ఈ కారుకు డిమాండ్ పెరుగుతోందేంటి? మే నెలలో టయోటాకు బూస్ట్ ఇచ్చింది.. ఏకంగా 39 శాతం జంప్
దేశీయంగా, అంతర్జాతీయంగా వాహన తయారీలో ప్రసిద్ధి చెందిన టయోటా (Toyota)కు చెందిన అర్బన్ క్రూయిజర్ టైజర్ (urban cruiser taisor) అనేది ఇటీవలి కాలంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్న నమ్మకమైన SUVగా గుర్తింపు పొందింది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్, టయోటా బ్రాండ్‌కు ప్రత్యేకతను తీసుకువస్తూ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదిస్తోంది. దాని ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ అంశాలు, వినియోగదారులకు అందుబాటులో ఉండే ధర లగ్జరీ లుక్ అన్ని కలిపి ఈ కారును ప్రసిద్ధ మోడల్‌గా అవతరించేలా చేశాయి. ఇటీవల మే, 2025 ముగిసిన నేపథ్యంలో కంపెనీ ఈ కారుకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. ఆ సేల్స్‌ను ఒకసారి చూద్దాం.
2025 మే నెలలో అర్బన్ క్రూయిజర్ టైజర్ మోడల్ మంచి అమ్మకాలను సాధించింది. టయోటా ఇండియా తన అర్బన్ క్రూయిజర్ టైజర్ SUVని ఒక్క నెలలో 3,035 యూనిట్ల వరకు విక్రయించింది. ఇదే మోడల్ 2024 మేలో విక్రయించిన 2,180 యూనిట్లతో పోలిస్తే, ఇది 39 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఇది కేవలం సంఖ్యల పరంగా మాత్రమే కాదు, వినియోగదారుల నమ్మకాన్ని పొందడంలోనూ ఈ కారు విజయవంతమైందని చెప్పవచ్చు.

ఇంత వృద్ధి సాధించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి, దీని మోడరన్ డిజైన్. స్లీక్ లుక్స్, డ్యూయల్-టోన్ బాడీ ఫినిష్, LED లైట్ సిస్టమ్ వంటి అంశాలు దీన్ని యూత్‌ఫుల్ ఇంకా స్పోర్టీ లుక్‌తో తీర్చిదిద్దుతున్నాయి. అంతేకాదు, ఇందులో ఉన్న స్మార్ట్ ఫీచర్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి టెక్నాలజీ ఆధారిత ఫీచర్లు కొనుగోలుదారుల మనసును గెలుచుకున్నాయి.
ఇంతవరకూ SUVలు ఖరీదైన వాహనాలుగా భావించబడ్డా, టైజర్ ఈ ఆలోచనను మార్చింది. సులభంగా అందుబాటులో ఉండే ధరతో, ఇది బడ్జెట్‌తో కూడిన కుటుంబాలకు మంచి ఎంపికగా నిలిచింది. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఒక స్టైలిష్ SUV. భారత మార్కెట్లో టయోటా నుండి వచ్చిన ఈ మోడల్, మంచి డిజైన్, సౌకర్యాలు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు వంటి అంశాలతో అన్ని వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

ధర విషయానికి వస్తే, టైజర్ SUV రూ.7.74 లక్షల నుంచి రూ.13 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది. ఇది మూడు ప్రధాన వేరియంట్లలో.. E, S. S ప్లస్‌లలో అందుబాటులో ఉంది, కొనుగోలుదారులకు వారి అవసరాలను బట్టి ఎన్నుకునే అవకాశం ఇస్తుంది. ఈ కారు ఎక్స్‌టీరియర్ ఎంతో ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించబడింది. ఎంటైసింగ్ సిల్వర్, స్పోర్టిన్ రెడ్, గేమింగ్ గ్రే వంటి కలర్స్‌లో అందుబాటులో ఉండటంతో, ఇది కళ్లను ఆకర్షించేలా ఉంటుంది.
ఇంజిన్ పరంగా చూస్తే, ఈ SUV మూడు వేరే వేరే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, అలాగే 1.2-లీటర్ CNG వేరియంట్‌లతో, ఇది అన్ని రకాల వినియోగదారులకు సరిపోయే విధంగా ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచేలా, ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంది.

మైలేజీ లీటరుకు 19 నుండి 28 కిలోమీటర్ల వరకూ అందిస్తుంది. ఐదు మందికి కంఫర్టబుల్ సీటింగ్‌ను అందించడమే కాదు, 308 లీటర్ల బూట్ స్పేస్ కూడా అందిస్తూ ప్రయాణాల సమయంలో లగేజీ కోసం అనుకూలంగా ఉంటుంది. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ప్యాడిల్ షిఫ్టర్‌ల వంటి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








