రూ.7.89 లక్షల కారు బైక్ లాగా 28 కి.మీ మైలేజ్.. గత నెలలో 2500 మందికి పైగా కొన్నారు
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా SUV ప్రియులు కోరుకునే మోడల్‌గా ఇది పేరుపొందింది. అందుకు కారణం దీని అద్భుతమైన డిజైన్, రోడ్డు మీద ప్రత్యేకంగా కనిపించే స్టైల్, అలాగే వినియోగదారులను ఆకర్షించే అనేక ఆధునిక ఫీచర్లు. కంఫర్ట్, సేఫ్టీ, మైలేజ్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో టైజర్ అమ్మకాల సంఖ్యలో కొంత వెనుకబాటు కనిపించింది. మొత్తం 2,683 యూనిట్లు మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేయబడ్డాయి. గత ఏడాది ఇదే సమయంలో 3,213 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ సారి ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. గణాంకాలను పరిశీలిస్తే, టైజర్ అమ్మకాలలో దాదాపు 16 శాతం క్షీణత చోటుచేసుకున్నట్టు తేలింది.
ఇది కంపెనీకి ఒక చిన్న వెనుకడుగు అయినప్పటికీ, టైజర్ పై వినియోగదారుల ఆసక్తి తగ్గిందని మాత్రం చెప్పలేము. పోటీ SUVలు మార్కెట్లోకి రావడం, కొత్త మోడళ్ల లాంచ్‌లు, అలాగే వినియోగదారుల అభిరుచుల మార్పు వంటి అంశాలు అమ్మకాలపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, టయోటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం, టైజర్ ఇచ్చే రైడ్ క్వాలిటీ, ఫీచర్లు ఇంకా మార్కెట్లో బలంగా నిలబడేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం కొత్త కార్లపై జీఎస్‌టి తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు వినియోగదారులను కొంతవరకు వేచి చూడాలనే దిశగా నెట్టాయి. జీఎస్‌టి రాయితీ అమల్లోకి వస్తే ధరలు గణనీయంగా తగ్గవచ్చన్న ఆశతో చాలా మంది కొనుగోలును వాయిదా వేసుకున్నారని చెప్పవచ్చు. అదే సమయంలో, టైజర్ లభించే ధరల్లో ఇతర మోడళ్లు లభించడం కూడా ఈ కారు సేల్స్ తగ్గడానికి కారణం.
ఈ కొత్త వాహనాలు ఫీచర్లు, టెక్నాలజీ, డిజైన్ పరంగా మరింత ఆకర్షణీయంగా ఉండటంతో, వినియోగదారుల దృష్టి వాటిపై ఎక్కువగా పడింది. ఫలితంగా టైజర్ డిమాండ్ కొంత తగ్గింది. ఇక ముందు కొత్త అప్‌డేట్‌లు, ప్రత్యేక ఆఫర్లు, లేదా కొత్త వేరియంట్లు అందిస్తే, టైజర్ తిరిగి తన అమ్మకాల సంఖ్యను పెంచుకునే అవకాశముంది. రాబోయే పండుగ సీజన్ కూడా దీని సేల్స్ పెరగడానికి దోహదం చేయనుంది.

ప్రస్తుతం టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ధర రూ.7.89 లక్షల నుండి రూ.13.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అయితే, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని సవరించిన కారణంగా కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో టైసర్ ధర మరింత తగ్గనుంది. అందువల్ల, కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఒక బిగ్ అట్రాక్షన్‌గా మారవచ్చు.
ఈ SUV ప్రస్తుతం E, S, S ప్లస్ వంటి విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. పవర్‌ట్రెయిన్ పరంగా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.2-లీటర్ CNG ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉన్నాయి. మైలేజీ విషయంలో ఇది 19 kmpl నుండి గరిష్టంగా 28 kmpl వరకు ఇస్తుంది.

ఈ కారులో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 5 సీట్లు, ప్రయాణికులకు ప్రమాద సమయంలో పూర్తి రక్షణ అందించడానికి 6 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), కారులో నుంచి చుట్టూ చూడటానికి 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








