6-ఎయిర్‌బ్యాగ్‌ల సేఫ్టీ, బ్లూయిష్ బ్లాక్ లుక్‌తో మెరిసిపోతున్న టయోటా టైజర్ వచ్చేసింది

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కాంపాక్ట్ SUV అయిన అర్బన్ క్రూయిజర్ టైజర్ (Urban Cruiser Taisor) కోసం ఈరోజు రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌లు కేవలం ఫీచర్ల పరంగా మాత్రమే కాకుండా, కస్టమర్ల భద్రత, స్టైల్ రెండింటినీ మరింత మెరుగుపరచే విధంగా ఉండటం విశేషం. మొదటగా, టయోటా ఈ మోడల్‌కు కొత్త బ్లూయిష్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్‌ను జోడించింది. ఈ ప్రత్యేకమైన కలర్ కాంబినేషన్ SUVకి మరింత ప్రీమియమ్ లుక్‌ను తీసుకువస్తుంది. ప్రస్తుత మార్కెట్‌లో కస్టమర్లు వ్యక్తిగత ఇష్టాలను ప్రతిబింబించే ప్రత్యేక రంగుల కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న తరుణంలో, ఈ కొత్త షేడ్ అర్బన్ క్రూయిజర్ టైసర్ ఆకర్షణను మరింత పెంచుతుంది.

ఇక రెండవ అప్‌డేట్ భద్రతా పరంగా ఒక పెద్ద ముందడుగు. లైనప్ అంతటా ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అంటే, ఏ వేరియంట్‌ తీసుకున్నా, డ్రైవర్, ప్రయాణికుల రక్షణలో భద్రతా ప్రమాణాలు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. ఈ ఫీచర్, కస్టమర్ నమ్మకాన్ని పెంచడమే కాకుండా, SUVని తన సెగ్మెంట్‌లో మరింత పోటీగ నిలబెడుతుంది. ఈ సిస్టమ్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, అలాగే కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

Toyota Urban Cruiser Taisor Updated With Bold New Bluish Black Colour And 6 Airbags

టయోటా కిర్లోస్కర్ మోటార్ తన అర్బన్ క్రూయిజర్ టైజర్‌లో భద్రతా పరంగా ఈ SUVలోని అన్ని వేరియంట్లు E, S, S+, G, V ఒకే స్థాయిలో భద్రతను అందించనున్నాయి. అంటే, ఎలాంటి వేరియంట్ ఎంచుకున్నా, కస్టమర్లకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా లభిస్తాయి. . ఇవన్నీ కారు లోపల ప్రయాణిస్తున్న వారికి అన్ని వైపులా, అంటే ముందునుంచి, పక్కలనుంచి, పైభాగం వరకు 360 డిగ్రీల రక్షణ అందిస్తాయి.

ఇవి కారును ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నా, ప్రభావాన్ని తగ్గించి, డ్రైవర్, ప్రయాణికుల ప్రాణాలను కాపాడేలా రూపొందించబడింది. ఇది కేవలం టెక్నికల్ అప్‌డేట్ మాత్రమే కాదు, టయోటా పాటించే ప్రపంచ భద్రతకు నిదర్శనం. ప్రతి ఒక్కరికి సమానంగా, ఎటువంటి రాజీపడకుండా భద్రతను అందించడం దీని ప్రధాన లక్ష్యం. పైగా, కాంపాక్ట్ SUVల విభాగంలో కస్టమర్లు ఇప్పుడు అధిక భద్రతా ప్రమాణాలను కోరుకుంటున్న సందర్భంలో, ఈ అప్‌డేట్ వారి అవసరాలకు సమాధానం ఇస్తుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్, ఇప్పుడు కేవలం భద్రతలోనే కాదు, ధర, పనితీరులో కూడా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకుంది. ఈ కాంపాక్ట్ SUV ధర రూ. 7.77 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుండటంతో, బడ్జెట్‌కు అనుగుణంగా, కానీ ప్రీమియం ఫీల్ కలిగిన వాహనం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.

పనితీరులోకి వస్తే, టైజర్‌లో రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది, 1.2 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్, మైలేజీ పరంగా ప్రసిద్ధి చెందింది. రెండవది, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది మరింత ఆకట్టుకునే రైడ్‌ను అందించి, స్పోర్టీ ఫీల్‌ను ఇస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లు కూడా అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి, అందులో టర్బో వెర్షన్ లీటరుకు గరిష్టంగా 22.79 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది.

ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ డ్రైవింగ్‌తో పాటు, సులభమైన సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోసం 5-స్పీడ్ AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఆప్షన్ ఉంది. మరింత ప్రీమియం అనుభవం కోరుకునే వారికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది, ఇది సాఫీగా గేర్ మార్పులను నిర్వహిస్తూ హైవే డ్రైవ్స్‌లో ప్రత్యేకమైన కంఫర్ట్‌ను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 12, 2025, 18:30 [IST]
English summary
Toyota urban cruiser taisor updated with bold new bluish black colour and 6 airbags
Read more on: #toyota #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+