పెద్ద ఫ్యామిలీల కోసం టయోటా కొత్త వ్యాను.. టూర్‌కు వెళ్తే దీంట్లోనే హాయిగా స్టే చేయొచ్చు!
జనవరి 17న మొదలైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ వేడుకలో అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ కొత్త మోడళ్లతో పాటు, కాన్సెప్ట్ వాహనాలతో వీక్షకులను కనువిందు చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ మోడళ్లు మార్కెట్లోకి వస్తాయా అని ఎదురుచూసేలా అలరించాయి. ఈ ఎక్స్‌పోలో దిగ్గజ వాహన సంస్థ టయోటా కూడా తమ వాహనాలతో ఆకట్టుకుంది. ఈ సంస్థ ప్రదర్శించిన ఓ కాన్సెప్ట్ వాహనం ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే టయోటా ఎక్స్- వ్యాన్. ఇల్లు తరహాలో కనిపిస్తున్న ఈ వాహనంలో డ్రైవర్ కోసం ప్రత్యేక డోర్ లేదు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ కాన్సెప్ట్ వాహనాన్ని తీసుకువచ్చింది. దీని పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
దిల్లీలోని భారత్ మండపం సహా ద్వారకలోని యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఎక్స్‌పో మార్ట్ వేదికలుగా.. మూడు ప్రాంతాల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో జనవరి 17 నుంచి 22 వరకు జరిగింది. ద్వారకా వేదికగా జరిగిన ఈవెంట్‌లో టయోటా సంస్థ తమ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ వాహనాలను పరిచయం చేసింది. అందులో ఒకటి ఈ X- Van. మూడు విభిన్న బాడీ స్టైల్స్‌లో ఈ వాహనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ మూడు బాడీ స్టైల్స్‌లో X-Van core పేరుతో ఒక వాహనాన్ని ప్రదర్శించింది. దీన్ని పెద్ద ఫ్యామిలీలకు అనువుగా ఉండే సీటింగ్ కెపాసిటీతో తీసుకువచ్చింది టయోటా సంస్థ. దీంట్లో రెండో కాన్సెప్ట్ మోడల్ X-Van Tool. ఈ వ్యాను ఇంటీరియర్‌లో.. వాహనంలోనే దీర్ఘకాలం ఉండేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను జోడించారు.
ఇక ఈ కాన్సెప్ట్‌లో మూడవది X-Van Gear. ఈ వ్యాను కోర్, టూల్ మోడల్‌ను కలిపి తయారు చేశారు. దీంట్లో 6 (A) The X-Van Gear మోడల్ లో ఏడు మంది వరకు సరిగ్గా సరిపోతుంది. ఈ వ్యానులో మరో ముఖ్య విషయం ఏంటంటే.. దీనికి కేవలం రెండు డోర్లే ఉంటాయి.

ఫ్రంట్ సీట్లు, రియర్ సీట్లకు రెండు సపరేట్ డోర్స్ ఉంటాయి. డ్రైవర్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి డోర్ దీంట్లో ఉండదు. అయితే దీంట్లోకి ఎక్కడం, దిగడం చాలా సులభంగా ఉంటుంది. ఇది వ్యాన్ అయినప్పటికీ... ఈ వాహనం కాన్సెప్ట్ పూర్తిగా ఓ పెద్ద కారును పోలి ఉందని చెప్పవచ్చు. ఇది 4,695 మి.మీ.ల పొడవుతో, 1,820 మి.మీ.ల వెడల్పుతో, 1,855 మి.మీ.ల ఎత్తుతో ఉంటుంది.
ఈ ఎక్స్- వ్యాన్‌లో ఉపయోగించిన పవర్‌ట్రెయిన్ గురించి టయోటా సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇది Alphart/Vellfire ప్లాట్‌ఫామ్‌ను షేర్ చేసుకుంటుంది. దీన్ని మార్కెట్లో డిమాండ్, కొనసాగుతున్న ట్రెండ్ బట్టి, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌తో తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇప్పుడు ఈ వ్యాన్ ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఇది మార్కెట్లోకి రావాలంటే కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే! భారత్‌లో దీని సేల్స్ విషయంలో గానీ లేదా అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యాన్ అమ్మకం గురించి గాని ప్రస్తుతం ఎలాంటి వివరాలు లేవు.
అయితే ఇది అంత త్వరగా సేల్స్‌లోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే... ప్రస్తుతం ఉన్న బీ- పిల్లర్ లేకుండా క్రాష్ టెస్టులో పాస్ అవడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌లో కనిపిస్తున్నప్పటికీ.. దీని సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి మాత్రం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications