కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు.. లక్షల్లోనే బొలెరోను బెంజ్ కారుగా మార్చుకోవచ్చు

మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. నిజానికి కొన్ని సంవత్సరాల వరకు బొలెరో ప్రతినెల మహీంద్రా నంబర్ వన్ బెస్ట్ సెల్లింగ్ కారు. ఇప్పుడు మరికొన్ని లేటెస్ట్ మహీంద్రా కార్లు ఆ నంబర్ వన్ స్థానాన్నిదక్కించుకున్నాయి. అయితే, మహీంద్రా బొలెరో కార్ల అమ్మకాలు తగ్గాయని అనుకోలేము.. ఎప్పటిలాగే, నిర్దిష్ట సంఖ్యలో కస్టమర్లు ఈ బొలెరోను కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

ఎందుకంటే బొలెరో చాలా మందికి నచ్చే బాక్స్ ఆకారంలో నిర్మించారు. అయితే బొలెరోను తమకు నచ్చిన విధంగా డిమోడిఫికేషన్ చేసుకునే కస్టమర్లు కూడా ఉన్నారు. అలాంటి ఒక కస్టమర్ తన బొలెరోను ఖరీదైన మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ లాగా మార్చాడు. అందుకు బొలెరోకు కలిసొచ్చిన ముఖ్య ఫీచర్ ఏంటంటే దాని బాక్సీ రూపం. బొలెరో లోపల ఎక్కువ స్పేస్ అందిస్తుంది కాబట్టి చాలా మంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.

Mahindra Bolero into a Mercedes Benz

మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ కూడా బాక్సీ షేప్ నే కలిగి ఉంటుంది. కానీ, మీరు G-క్లాస్, బొలెరో పై నిచ్చెన వేసినా మీరు వాటిని చేరుకోలేరు. ఎందుకంటే బొలెరో వంటి బాక్సీ కార్లకు మెర్సిడెస్-బెంజ్ G-క్లాస్ నమూనా. ధర పరంగా G-క్లాస్ చాలా ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. ఈ రెండు ధరల వ్యత్యాసం ఆకాశం, భూమికి ఉన్నంత ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ విక్రయించే అత్యంత ఖరీదైన కార్లలో జి-క్లాస్ ఒకటి.

అయితే, మహీంద్రా బొలెరో ధర కేవలం రూ. 10 లక్షలు. అందుకే ఇక్కడ ఒక బొలెరో కారు యజమాని తన కారును G-క్లాస్ లాగా కనిపించే విధంగా మోడిఫై చేశారు. ఈ విషయంలో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలో బొలెరో కారులో ఈ మార్పులన్నీ ఎలా చేశారో వివరంగా చెప్పారు. చేసిన మార్పులను బట్టి చూస్తే ఈ బొలేరో ముందు భాగం G-క్లాస్ వాహనాన్ని పోలి ఉంటుంది.

Mahindra Bolero into

బొలెరో G-క్లాస్ మాదిరిగానే ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. మధ్యలో మెర్సిడెస్ బెంజ్ 3స్టార్ లోగో ఉంటుంది. ముందు బంపర్ కూడా సరిగ్గా G-క్లాస్ లాగానే ఉంటుంది. LED DRLలు సర్క్యూట్ LED హెడ్‌లైట్‌లతో కనెక్ట్ అయి ఉంటాయి. టర్న్ ఇండికేటర్లు బోనెట్‌పై అమర్చారు. ఫ్రంట్ లాగే, బొలెరో వైపు కూడా G-క్లాస్‌తో దగ్గర పోలికను కలిగి ఉంటుంది. రెండూ బాక్స్ టైప్ కార్లు కాబట్టి వారు దీన్ని చేయగలిగారు.

చక్రాలకు వీల్ ఆర్చ్‌లు G-క్లాస్‌లో కనిపించే వాటిలాగే మంచి సైజ్ లో ఇచ్చారు. G-క్లాస్‌లోని వీల్స్ బయటకు లాగుతున్నట్లుగా చూపించారు. దీని ప్రకారం, వీల్ ఆర్చ్‌లపై క్లాడింగ్ పెద్దదిగా చేశారు. తదనుగుణంగా ట్రెడ్ వెడల్పు చేశారు. ఈ బొలెరోకు చాలా స్ట్రాంగ్ డిజైన్ ఇచ్చింది. ఎక్సటర్నల్ లాగే బొలెరో ఇంటర్నల్ కూడా కంప్లీట్ బ్లాక్ కలర్ లోనే రూపొందించారు.

Mahindra Bolero into Benz

బొలెరో లోపల కంట్రోల్ బటన్లతో కూడిన స్టీరింగ్ వీల్, టర్బైన్ ఆకారపు AC వెంట్లు, డ్రైవర్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ టైన్మెంట్ కోసం పెద్ద డిస్ఫ్లే ఉన్నాయి. మొత్తానికి మహీంద్రా బొలెరోను మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ లాగా తయారు చేయడం మంచి ఆలోచన. రెండూ దాదాపు ఒకేలా ఉండటం వల్ల కారు బాడీని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా వారు ఈ బొలేరో కారును కొన్ని లక్షల రూపాయల్లోనే మోడీఫై చేశారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

FAQs
DriveSpark Automotive

More from DriveSpark

Article Published On: Saturday, March 15, 2025, 12:38 [IST]
English summary
Transforming a mahindra bolero into a mercedes benz g class at a fraction of the price
Read more on: #india #auto news #mahindra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+