అమెరికా ఆటో మార్కెట్ కు ట్రంప్ షాక్.. దిగుమతి కార్లపై 25% సుంకం..భారతీయ ఆటో మార్కెట్ పై ప్రభావం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని విదేశీ తయారీ ఆటోమోటివ్ వాహనాలపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీనివల్ల దేశీయ తయారీ రంగానికి ఊతమివ్వడంతో పాటు ఏడాదికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు.

ఈ సుంకం ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల ఆటోమొబైల్ కంపెనీలకు ఖర్చులు పెరగడంతో పాటు అమ్మకాలు పడిపోయే అవకాశం ఉంది. అయితే, ఈ చర్యతో అమెరికాలో మరిన్ని ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయని, అమెరికా, కెనడా, మెక్సికోల మధ్య రెడెక్యులెస్ సరఫరా చైన్‎ను తొలగించవచ్చని ట్రంప్ భావిస్తున్నారు.

US Auto Market Trump

ఆదాయం: ఈ కొత్త సుంకం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని వైట్ హౌస్ అంచనా వేస్తోంది. ఈ ఆదాయం బడ్జెట్ లోటును తగ్గించడానికి, అమెరికాలో పరిశ్రమలకు సపోర్టు ఇవ్వడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, ఖర్చులు పెరగడం వల్ల వినియోగదారుల డిమాండ్, ఆర్థిక వృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కార్ల ధరలు పెరుగుదల: ఆటోమొబైల్ కంపెనీలు సుంకం భారం కొనుగోలుదారులపై వేస్తే దిగుమతి చేసుకున్న కార్ల ధర మోడల్‎ను బట్టి 12,500 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త కార్ల సగటు ధర 49,000 డాలర్లకు దగ్గరగా ఉండడంతో, మధ్యతరగతి వినియోగదారులు కొత్త కార్లను కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడవచ్చు.

US Auto Market Auto Sector

తయారీ రంగం మార్పు: ఈ సుంకాలు ఆటోమొబైల్ కంపెనీలను అమెరికాలో తయారీకి ప్రోత్సహిస్తామని, తద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని ట్రంప్ గవర్నమెంట్ వాదిస్తోంది. హ్యుందాయ్ 5.8 బిలియన్ డాలర్ల స్టీల్ ప్లాంట్ లూసియానాలో ఏర్పాటు చేయడం తన విధానాలకు నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు.

దీర్ఘకాలిక అనిశ్చితి: ఈ సుంకాలు అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీని బలోపేతం చేస్తాయని వైట్ హౌస్ చెబుతున్నప్పటికీ, సప్లై చైన్ పునర్నిర్మించడానికి సమయం పడుతుంది. స్వల్పకాలంలో ఆటోమొబైల్ కంపెనీలు, వినియోగదారులు అధిక ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రయోజనాలు కనిపించే ముందు ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

Automobiles

ఆటోమొబైల్ కంపెనీలపై ప్రభావం: అమెరికా, విదేశీ కార్ల తయారీదారులు గ్లోబల్ సప్లై చైన్ మీద ఆధారపడతారు. అనేక విడిభాగాలు మెక్సికో, కెనడా, ఆసియాలో తయారవుతాయి. ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు అధిక ఖర్చులను భరించడం, కస్టమర్ల పై వేయడం లేదా తయారీని పునర్నిర్మించడం వంటి ఎంపికలను ఎదుర్కొంటాయి. దీనికి కొన్నేళ్లు పట్టవచ్చు.

మార్కెట్ స్పందన: ట్రంప్ ప్రకటన తర్వాత జనరల్ మోటార్స్(ఎంజీ) స్టాక్ దాదాపు 3 శాతం, స్టెల్లాంటిస్ (జీప్, క్రిస్లర్ యజమాని) 3.6 శాతం పడిపోయాయి. ఫోర్డ్ స్టాక్ స్వల్పంగా పెరిగింది. లాభదాయకతపై దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

US Auto Market Auto

ప్రపంచ వ్యతిరేకత: కెనడా, యూరోపియన్ యూనియన్ (EU) నాయకులు ఈ సుంకాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆర్థిక అంతరాయాల గురించి కూడా హెచ్చరించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ కెనడియన్ వ్యాపారాలను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈయూ వినియోగదారులు, వాణిజ్య సంబంధాలకు నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.

ప్రతీకార ప్రమాదం: ఈ సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇతర దేశాలు ప్రతిచర్య చర్యలు తీసుకోవచ్చు. ఈయూ ఇప్పటికే అమెరికా స్పిరిట్స్‌పై 50శాతం సుంకం విధించాలని బెదిరించింది. దీనికి ట్రంప్ యూరోపియన్ ఆల్కహాల్‌పై 200 శాతం పన్ను విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

పన్ను తగ్గింపు ప్రణాళిక: అధిక కార్ల ఖర్చులను భర్తీ చేయడానికి ట్రంప్ కొత్త పన్ను ప్రోత్సాహకాన్ని ప్రతిపాదించారు. అమెరికాలో తయారైన వాహనాలపై ఆటో రుణాల వడ్డీని ఫెడరల్ ఆదాయపు పన్నుల నుంచి కొనుగోలుదారులు తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.

వాణిజ్య ప్రభావం: ఈ సుంకాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని, కస్టమర్ల ఎంపికలను పరిమితం చేస్తాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి ఉక్కు, అల్యూమినియం, కంప్యూటర్ చిప్స్, ఇంధన ఉత్పత్తులపై సుంకాలను కలిగి ఉన్న ట్రంప్ విస్తృత ఆర్థిక విధానంలో భాగం. ఈ సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ప్రపంచ వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 27, 2025, 13:30 [IST]
English summary
Trump s shock to the us auto market 25 tariff on imported cars impact on indian auto industry
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+