ఇంత తక్కువ ధరలో కింగ్ కార్గో.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.. కార్గో రవాణాకు గేమ్ ఛేంజర్

టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సరుకు రవాణాకు వినూత్న పరిష్కారాన్ని అందించడానికి కింగ్ కార్గో HD EV ని విడుదల చేసింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద డెలివరీ నెట్‌వర్క్‌ల వరకు అందరికి సులభంగా సరిపోయేలా దీన్ని రూపొందించారు. ఆధునిక సాంకేతికతను కలిపి తయారు చేసిన ఈ వాహనం, రోజువారీ రవాణా అవసరాలను తేలికగా తీర్చగలిగే సామర్థ్యం కలిగిఉంది. కఠినమైన నగర ట్రాఫిక్‌లో సైతం సులభంగా నడిపించుకునేలా దీని డిజైన్‌ను రూపొందించారు. దీని డిజైన్‌నే కాకుండా పనితీరు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎలక్ట్రిక్ వేరియంట్‌లో శక్తివంతమైన మోటార్, లాంగ్ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందేలా తయారు చేశారు.

కేవలం సరుకు మోయడమే కాకుండా డ్రైవర్‌కు సౌకర్యవంతమైన అనుభవం ఇవ్వడం కూడా ఇందులో ప్రత్యేకత. దీని లోడింగ్ స్పేస్‌ను విస్తృతంగా ఉంచడం వల్ల ఎక్కువ పరిమాణంలో సరుకును తేలికగా మోయగలదు. ఈ లాంచ్ సందర్భంగా టీవీఎస్ తమ కింగ్ కార్గో సిరీస్‌లో CNG వేరియంట్‌ను కూడా ప్రదర్శించింది. పర్యావరణహిత వాహనాలపై డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, CNG మోడల్ రాబోవు రోజుల్లో మరింత ఆదరణ పొందే అవకాశం ఉంది.

Tvs King Kargo Hd Ev Launched In India For Cargo Mobility

అయితే, CNG మోడల్ 2025 చివరి నాటికే మార్కెట్‌లోకి వచ్చేలా ప్లాన్ చేశారు. అంతేకాకుండా, పెట్రోల్ వేరియంట్‌ను సిద్ధం చేసి త్వరలోనే వినియోగదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టీవీఎస్ కింగ్ కార్గో HD EV పట్టణ రవాణా రంగంలో ఒక కొత్త దశను ప్రారంభించబోతోంది. ఖర్చు తగ్గింపు, విశ్వసనీయత, పర్యావరణ పరిరక్షణ అనే మూడు ప్రధాన అంశాలను కలిపి ఈ వాహనం రూపుదిద్దుకోవడం, వ్యాపారాలకు దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది.

ఈ వాహనం గరిష్టంగా 60 కి.మీ వేగంతో ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ మధ్య సులభంగా నడిపించుకునేలా ఈ వేగం అనుకూలంగా ఉంటుంది. ఇంకా, దీని బ్యాటరీని కేవలం 3 గంటల 10 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో రోజువారీ డెలివరీ కార్యకలాపాల్లో సమయం వృథా కాకుండా వ్యాపారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. డిజైన్ పరంగా చూస్తే, ఇది కఠిన పరిస్థితుల్లో కూడా పనితీరు చూపగలిగేలా రూపుదిద్దుకుంది.

Tvs King Kargo Hd Ev Launched In India For Cargo Mobility

235 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల అసమానమైన రోడ్లపై కూడా సాఫీగా నడుస్తుంది. 703 mm లోడింగ్ ప్లాట్‌ఫామ్ ఉండటం వలన పెద్ద పరిమాణంలో సరుకును సులభంగా మోసుకెళ్లవచ్చు. అంతేకాక, 500 mm వాటర్ ఫోర్డింగ్ సామర్థ్యం దీని మరో ప్రధాన హైలైట్. వర్షాకాలంలో నీటితో నిండిన రహదారులపై కూడా ఈ వాహనం ధైర్యంగా ప్రయాణించగలదు.

మొదటి దశలో టీవీఎస్ ఈ వాహనాన్ని ఢిల్లీ, NCR ప్రాంతాలు, రాజస్థాన్, బెంగళూరులో మాత్రమే విక్రయిస్తోంది. ఈ నగరాల్లో వినియోగదారుల నుండి సానుకూల స్పందన లభించిన తరువాత, క్రమంగా దేశంలోని ఇతర పట్టణాలకు కూడా విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ధర విషయానికొస్తే, కేవలం రూ.3.85 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంచడం వల్ల చిన్న వ్యాపారులకూ ఇది అందుబాటులో ఉంటుంది.

Tvs King Kargo Hd Ev Launched In India For Cargo Mobility

ఈ వాహనంలో LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, మెరుగైన రాత్రి లైటింగ్, విశాలమైన క్యాబిన్, రోల్-అప్ విండోలు, స్టైలిష్ డోర్ డిజైన్భా ఉన్నాయి. భారత్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో తొలి కార్గో 3-వీలర్ ఇదే. TVS స్మార్ట్ X కనెక్ట్ - 26 స్మార్ట్ ఫీచర్లు, వెనుక వీక్షణ అద్దాలు, నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది, అలాగే TVS కనెక్ట్ ఫ్లీట్ వెబ్ ఆధారిత ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 22, 2025, 11:30 [IST]
English summary
Tvs king kargo hd ev launched in india for cargo mobility more details inside
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+