తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభం.. మంచి మైలేజ్ ఇచ్చే బెస్ట్ డీజిల్ కార్లు ఇవే !
భారతదేశంలో ఇప్పటికీ డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్ని వాహన తయారీ కంపెనీలు దేశంలో ఇంకా డీజిల్ కార్లకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వాటిని ఎక్కువ సంఖ్యలో విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వార్తలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డీజిల్ కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.
ఆ కార్లు లీటరుకు ఎంత మైలేజ్ ఇస్తాయి? ఎలాంటి ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి? వాటి కెపాసిటీ, ఫీచర్లు, ధర వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

జీప్ కంపాస్ (Jeep Compass): జీప్ కంపాస్ ఒక లగ్జరీ ఫీచర్లు కలిగిన SUV రకానికి చెందిన కారు మోడల్. మనం చూడబోయే ఈ జాబితాలో అతి తక్కువ మైలేజ్ ఇచ్చే డీజిల్ కారు మోడల్ ఇదే అనిచెప్పొచ్చు. జీప్ కంపాస్ డీజిల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు ఆప్షన్‌లలో లభిస్తుంది.
మాన్యువల్ లీటరుకు 17.10 కిమీ మైలేజ్‌ను, ఆటోమేటిక్ 14.90 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు మోడల్ ప్రారంభ ధర రూ. 18.99 లక్షలు. గరిష్ట ధర రూ. 32.41 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ మోటార్ అందిస్తారు. ఇది 170 bhp పవర్, 350 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా బొలెరో నియో(Mahindra Bolero Neo): జీప్ కంపాస్ కారు మోడల్ తర్వాత మహీంద్రా బొలేరో నియో ఉంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా లీటరుకు 17.29 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ మోటార్ అందిస్తారు. ఇది 100 bhpపవర్, 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 9.95 లక్షలు.
హ్యుండాయ్ అల్కాజార్ (Hyundai Alcazar): భారతదేశంలో అమ్ముడవుతున్న లగ్జరీ రకానికి చెందిన కారు మోడల్‌గా అల్కాజార్ ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 14.99 లక్షలు. గరిష్ట ధర రూ. 21.70 లక్షలు. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఈ కారు మోడల్ డీజిల్ ఆప్షన్‌లో హ్యుండాయ్ మాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు ఆప్షన్‌లను అందిస్తోంది.

దీని మాన్యువల్ లీటరుకు 20.40 కిమీ మైలేజ్‌ను, ఆటోమేటిక్ లీటరుకు 18.1 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ మోటార్ అందించారు. ఇది గరిష్టంగా 116 bhp పవర్‌ను అందిస్తుంది.
కియా సెల్టోస్ (Kia Seltos): భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న SUV మోడళ్లలో ఇది ఒకటి. ఈ కారు మోడల్ డీజిల్ ఆప్షన్‌లో కూడా మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని మాన్యువల్ ఆప్షన్ 20.70 కిమీ మైలేజ్‌ను, ఆటోమేటిక్ లీటరుకు 20.70 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది.

ఇది116 bhp పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది1.5 లీటర్ మోటార్ ఇంజన్ ఈ కారులో అందించబడింది. డీజిల్ మోటార్‌తో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. సెల్టోస్ SUV కారు ప్రారంభ ధర రూ. 11.13 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే.
కియా సిరోస్ (Kia Syros): భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడళ్లలో సిరోస్ ఒకటిగా మారుతోంది. ఈ కారులో కియా 1.5 లీటర్ డీజిల్ మోటార్‌ను అందిస్తోంది. ఇది 116 bhp పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేసే కెపాసిటీ కలిగి ఉంది.
ఇందులో కూడా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. సిరోస్ కారు మోడల్‌ను భారతదేశంలో రూ. 9 లక్షల ప్రారంభ ధర నుండి కొనుగోలు చేయవచ్చు. డీజిల్ వేరియంట్ లీటరుకు 17.65 నుండి 20.75 కిమీ మైలేజ్ ఇస్తుంది.

మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO): ఈ కారు మోడల్ మహీంద్రా అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడళ్లలో ఒకటి. దీనికి ఆకర్షణీయమైన లుక్, ఎక్కువ ప్రీమియం ఫీచర్లు ఉండటమే ప్రధాన కారణం. 117 bhp కెపాసిటీ కలిగిన 1.5 లీటర్ డీజిల్ మోటార్‌ను మహీంద్రా ఈ కారులో అందిస్తోంది.
ఈ మోటార్‌తో అందించబడే మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లీటరుకు 20.60 కిమీ మైలేజ్‌ను, ఆటోమేటిక్ 21.20 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు భారతీయ మార్కెట్‌లో రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.57 లక్షల ధరలో అందుబాటులో ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే.
హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta): హ్యుండాయ్ కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న SUV. ఈ కారు మోడల్ డీజిల్ మోటార్ 19.10 కిలోమీటర్ల నుండి 21.80 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ అందించారు. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది రూ. 11.11 లక్షల నుండి రూ. 20.50 లక్షల ధరలో అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్ (Tata Nexon): భారతదేశంలో అత్యధిక సేఫ్టీ రేటింగ్ కలిగిన కారు మోడళ్లలో ఇది ఒకటి. ఇది ఐదుకు ఐదు స్టార్ల సేఫ్టీ రేటింగ్ పొందింది. టాటా మోటార్స్ ఈ కారు మోడల్‌లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వంటి అనేక రకాల ఆప్షన్‌లను అందిస్తోంది. దీని డీజిల్ ఆప్షన్‌లో 113 bhp పవర్, 260 Nm టార్క్ఉత్పత్తి చేసే 1.5 లీటర్ మోటార్ అందించబడింది.
ఇది గరిష్టంగా లీటరుకు 23.23 కిమీ నుండి 24.08 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారులో మాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు గేర్‌బాక్స్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ కారును రూ. 8 లక్షల ప్రారంభ ధర నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే.
కియా సోనెట్ (Kia Sonet): ఈ జాబితాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే డీజిల్ కార్లలో ఈ కారు మోడల్ రెండవ స్థానంలో ఉంది. ఇది లీటరుకు 19 కిమీ నుండి 24.10 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 8 లక్షలు. ఇది కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. దీని డీజిల్ మోటార్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

హ్యుండాయ్ వెన్యూ(Hyundai Venue): భారతదేశంలో నంబర్ 1 మైలేజ్ ఇచ్చే డీజిల్ కారు ఆప్షన్ ఇందులో అందుబాటులో ఉంది. లీటరు డీజిల్‌కు 24.20 కిమీ మైలేజ్‌ను ఇందులో అందించబడిన 1.5 లీటర్ డీజిల్ మోటార్ అందిస్తుంది. ఈ కారులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మోటార్ 116bhp, 250Nm టార్క్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.94లక్షలు. గరిష్ట ధర రూ.13.62 లక్షలు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: పైన పేర్కొన్న మైలేజ్ వివరాలు ARAI సర్టిఫికేషన్ ప్రకారం అందించబడిన గణాంకాలు. భారతదేశంలో డీజిల్ కార్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, చాలా మంది వాటికి ప్రాధాన్యతనిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








