మారుతీ నుంచి టాటా వరకు.. ఒక్కో కారు 400 కి.మీల పైనే రేంజ్.. కార్ల రేస్‌కి సిద్ధంగా ఉండండి!

భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో బాధపడుతున్న వారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో తయారీదారులు డిమాండ్‌ను తీర్చడానికి క్రమంగా ఎక్కువ ఈవీలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆటో రంగాన్ని శాశ్వతంగా మార్చే ఈ ట్రెండ్‌లో, కొన్ని ప్రముఖ కార్ తయారీ సంస్థలు తమ అత్యంత ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి పోటీ కేవలం ఒకే విభాగంలో కాదు, సెడాన్‌లు, SUVలు, MPVలు వంటి విభిన్న సెగ్మెంట్లను ఇది కవర్ చేస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టని మారుతీ సుజుకీ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో తమ తొలి EV మోడల్‌ను లాంచ్ చేయనుంది.

అదే సమయంలో టాటా మోటార్స్ మరోసారి హారియర్ EV అనే శక్తివంతమైన SUVను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాప్‌లో ఉన్న టాటా సరికొత్త ఈవీని విడుదల చేయడానికి అన్ని ప్రణాళికలు రెడీ చేసుకుంది. అలాగే, MG మోటార్స్ ఈ ఏడాది ప్రీమియం సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. M9 అనే MPV ద్వారా,పెద్ద కుటుంబాలు లక్ష్యంగా చేసుకుని కారును తీసుకురావాలని చూస్తుంది. కియా కూడా Clavis EVని తెస్తుంది.

Upcoming Ev Cars maruti E vitara

Maruti Suzuki eVitara: మారుతీ సుజుకీ మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించిన ఈ మోడల్ అప్పటినుండే అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లాంచ్‌లలో ఒకటి. దేశంలోని ప్రీమియం నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా ఈ కొత్త EV వినియోగదారుల వరకు చేరనుంది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ప్యాక్‌లతో అందుబాటులోకి రానుంది.

ఒకటి సాధారణ డైలీ యూజ్ కోసం సరిపడే స్థాయిలో ఉండగా, మరొకటి లాంగ్ ప్రయాణాలు చేయాలనుకునే వారికి తగిన విధంగా డిజైన్ చేయబడినట్లు తెలుస్తోంది. అధికారికంగా స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించలేదు కానీ, మారుతి 500 కిలోమీటర్లకంటే ఎక్కువ ARAI రేంజ్‌ను లక్ష్యంగా పెట్టుకుని దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, MG ZS EV వంటి మార్కెట్లో ఉన్న వాటితో నేరుగా పోటీ పడనుంది.

Upcoming Ev Cars Kia Clavis

Kia Clavis EV: కియా త్వరలో భారత ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని మరింత వేగవంతం చేయబోతోంది. క్లావిస్ EV ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్నటువంటి క్రెటా ఎలక్ట్రిక్ మోడల్‌తో ఎలక్ట్రిక్ వాహన ప్లాట్‌ఫారమ్ పంచుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. దీనిలో అమర్చిన బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 450 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని సమాచారం. ఈ కారులో కంపెనీ రెండు బ్యాటరీ ప్యాక్‌లను అందించనున్నారు.

ఇవి వేర్వేరు వాహన వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి. ఒకటి స్టాండర్డ్ రేంజ్ వెర్షన్, మరొకటి హైవే ప్రయాణాల కోసం రూపొందించింది. కియా క్లావిస్ EV లేటెస్ట్ ఇంటీరియర్, టెక్నాలజీతో, టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, హ్యుందాయ్ క్రెటా EV లాంటి మోడళ్లకు పోటీగా నిలవబోతోంది. మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో ఇది మరో ముఖ్యమైన ఆప్షన్‌గా మారబోతుంది. దీని గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

Upcoming Ev Cars Mg m9

MG M9: ఎంజీ మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహన పోర్ట్‌ఫోలియోను భారత మార్కెట్లో మరింత విస్తరించేందుకు మరో ముఖ్యమైన అడుగు వేయబోతోంది. రాబోయే నెలల్లో భారతదేశంలో MG M9 MPVని తీసుకురాబోతుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా తన ప్రత్యేకతను ప్రదర్శించిన మోడల్, మియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని దేశంలో అడగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడల్ లేటెస్ట్ సౌకర్యాలు, సాఫిస్టికేటెడ్ డిజైన్, హై-ఎండ్ టెక్నాలజీతో నిండి ఉంటుంది.

ఈ మోడల్‌కు సంబంధించి అమ్మకాలు ప్రత్యేకంగా MG సెలెక్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా నిర్వహించబడతాయి, దీని వల్ల ఈ వాహనం లక్ష్యంగా పెట్టుకున్న ఖాతాదారులకు మరింత ప్రత్యేకత, ప్రాధాన్యత లభించనుంది. ఎలక్ట్రిక్ MPVల విభాగంలో ఇది కొత్త ప్రమాణాలు స్థాపించేందుకు సిద్ధంగా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో 90 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌‌తో వచ్చింది. ఇది WLTP ప్రమాణాల ప్రకారం దాదాపు 430 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు.

Upcoming Ev Cars Toyota Urban

Toyota Urban Cruiser BEV: టయోటా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అర్బన్ క్రూయిజర్ బీఈవీ ఈ ఏడాది మధ్య భాగంలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మోడల్ గురించి మార్కెట్‌లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. టయోటా, ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలనే లక్ష్యంతో ఈ BEVను ఆసక్తిగా తయారు చేస్తోంది. ఇది eVX మోడల్ ఆధారంగా తయారవుతుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ బీఈవీ అధికారిక స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించకపోయినా, వర్సటైల్ మిడ్-సైజ్ BEVగా రాబోతుందని సమాచారం. దీనిలో అందించిన బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ అందించగలదు. దీని ఇంటీరియర్‌లో ఆకట్టుకునే డిజైన్, అధునాతన టెక్-ఇన్ఫోటైన్‌మెంట్, మెరుగైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వంటి అంశాలు కారులో ఉన్నాయని తెలుస్తుంది.

Tata Harrier EV: టాటా మోటార్స్ భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి హారియర్ EVని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇది రాబోయే నెలల్లో అధికారికంగా లాంచ్ కాబోతుంది. 2025లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ఈ మోడల్ సింగిల్ మోటార్ వేరియంట్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో రాబోతుంది.

దీని పనితీరు విషయానికి దీనిలో అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 00 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ అందించగలదు. హారియర్ EVని జెన్ 2 EV ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు. ఫ్టీ విషయంలో అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS)సిస్టం, ఇంటీరియర్‌లో ఆకట్టుకునే ఫీచర్స్, విశాలమైన స్థలం, కంఫర్టబుల్ సీట్లు వంటి అంశాలు ఈ కారులో ఉన్నాయి.

MG Cyberster: ఎంజీ సైబర్‌స్టర్ జీటీ కారు త్వరలో రోడ్లపై పరుగులు పెట్టడానికి రాబోతుంది. ఇది డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 510 PS పవర్, 725 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 3.2 సెకన్లలో చేరుకోగలదు. ఇది 443 కి.మీల వరకు ప్రయాణించగలదు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 13, 2025, 7:30 [IST]
English summary
Upcoming ev cars maruti e vitara tata harrier mg cyberster urban cruiser kia clavis details
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+