పేదలు, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్‌ ధరలో రాబోతున్న మారుతీ సుజుకీ టాప్ బెస్ట్ కార్లు

ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ దశాబ్ద కాలంగా మధ్యతరగతి వినియోగదారుల కోసం తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే వాహనాల ధరలు చాలా వరకు అందుబాటులోనే ఉంటాయి. వీటి డిజైన్లు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మైలేజ్ విషయంలో ఎక్కువగానే ఇస్తాయి. ప్రతి ఏడాది కూడా కార్ల సేల్స్ పరంగా దేశంలోనే ఇతర తయారీదారుల కంటే మొదటి స్థానంలో ఉంటుంది. 2024 ఏడాదిలో కూడా కారంల అమ్మకాల్లో మారుతీ సుజుకీ అగ్రస్థానం పొందింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి తక్కువ ధరలో పలు మోడళ్లను విడుదల చేయాలని చూస్తుంది. తాజాగా తన కార్ల ధరలను పెంచి అందరికి షాకిచ్చిన కంపెనీ రెండు, మూడేళ్లలో రూ.10 లక్షల లోపు ధరలో కొత్త కార్లను తీసుకురావడానికి ప్రణాళికలు చేసింది. వాటి గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం..

మారుతీ సుజుకీ బాలెనో: ఈ కారును కంపెనీ వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనిని YTA అనే కోడ్‌నేమ్‌తో తీసుకురావాలని చూస్తోంది. ఈ కారులో హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ని అందించే అవకాశం ఉందని సమాచారం. ఈ పవర్‌ట్రెయిన్‌తో కారు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. అదనంగా లేటెస్ట్ రేంజ్-ఎక్స్‌టెండర్ టెక్నాలజీని కూడా ఇస్తారని తెలుస్తుంది. 1.2లీ జె‌డ్12ఈ పెట్రోల్ ఇంజిన్ ఉండవచ్చు.

Maruti Suzuki Cars Under Rs 10 Lakh

కొత్త బాలెనో కారు దాదాపు లీటర్‌కు 30 కి.మీల కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికుల రక్షణ కోసం అధునాతన సేఫ్టీ ప్రమాణాలు ఈ కారులో ఉండబోతున్నాయి. ఇంటిరియర్ డిజైన్ థీమ్‌ను చాలా అందంగా మార్చబోతున్నారు. కొత్త కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఫీచర్లను ఈ కారులో ఇస్తున్నారు.

ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్: మారుతీ సుజుకీ Fronx కాంపాక్ట్ SUV కారును బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో తీసుకురాబోతున్నారు. దీంతో ఇది వినియోగదారులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ దేశీయ మార్కెట్లోకి అన్ని కుదిరినట్లయితే 2026లో విడుదల చేస్తారు. లేదంటే 2027 లో కానీ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో 5 మంది కలిసి ప్రయాణించవచ్చు. ఫీచర్స్‌ కూడా డజన్ల కొద్ది ఉంటాయి.

Upcoming Top Maruti Suzuki Cars

మారుతీ సుజుకీ eWX: ఎలక్ట్రిక్ కారు ఇ విటారా తర్వాత మారుతీ సుజుకీ నుంచి మరో ఈవీ కారు eWX విడుదల కాబోతుంది. ఇది తక్కువ ధరలోనే రాబోతుంది. హ్యాచ్‌బ్యాక్ మోడల్ మధ్య తరగతి వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. రాబోయే సంవత్సరాల్లో జీరో-ఎమిషన్ లక్ష్యానికి అనుగుణంగా మారుతీ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

కాంపాక్ట్ MPV: దేశంలో కుటుంబ ప్రయాణాలు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది కలిసి ప్రయాణించే వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ కాంపాక్ట్ MPV కారును రాబోయే కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఇది తక్కువ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉండబోతుంది. మార్కెట్ వర్గాల ప్రకారం, ఇది రూ.10 లక్షల లోపే లభించే అవకాశం ఉంది. ఈ కారులో హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనున్నారు.

Upcoming Top Maruti Suzuki Cars Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 24, 2025, 18:30 [IST]
English summary
Upcoming top maruti suzuki cars under rs 10 lakh all details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+