రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో కొత్త కారు రాబోతుంది! టాటా-మారుతి నుంచి మాత్రం కాదు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ రెనాల్ట్ (Renault) భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుండి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా యూరప్‌కి పరిమితమైన కారు తయారీదారుగా పేరుపొందిన ఈ సంస్థ, భారత్‌లో మాత్రం తన కార్లను ప్రజలకు మరింత చేరువ చేసింది. ముఖ్యంగా, రెనాల్ట్ డస్టర్ SUVతో ఒకప్పుడు విపరీతమైన పాపులారిటీని సంపాదించింది. డస్టర్ అనేది భారతీయ కస్టమర్లకు ఫ్రెంచ్ ఇంజనీరింగ్‌ని పరిచయం చేసిన మోడల్ అని చెప్పాలి. ఆ తర్వాతి కాలంలో కొన్ని క్లాసిక్ మోడళ్లతోనూ, ఎంట్రీ లెవల్ కార్లతోనూ మార్కెట్లో సొంత స్థానం సంపాదించింది. ప్రస్తుతం రెనాల్ట్ దేశంలో మూడు ముఖ్యమైన మోడళ్లను విక్రయిస్తోంది. అందులో ట్రైబర్ MPV, కైగర్ సబ్-కాంపాక్ట్ SUV ఇటీవలే అప్‌డేట్ అవుతూ కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి వచ్చాయి.

ట్రైబర్ అనేది తన విభిన్నమైన సీటింగ్ లేఅవుట్‌ కారణంగా ఫ్యామిలీ కార్ల విభాగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగా, కైగర్ యువతకు నచ్చే స్పోర్టీ లుక్‌తో సబ్-కాంపాక్ట్ SUV కేటగిరీలో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఈ లిస్టులో మిగిలినది రెనాల్ట్ క్విడ్(Kwid). క్విడ్‌ను దేశంలో అత్యంత చౌకైన చిన్న కారు అని చెప్పవచ్చు. మొదటిసారి 2015లో లాంచ్ అయినప్పటి నుండి తన డిజైన్‌, తక్కువ ధర, ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో కొనుగోలుదారులను ఆకట్టుకుంది.

Updated Renault Kwid Will Launch Soon in India Here Expected Features

బడ్జెట్ కారు విభాగంలో మారుతి ఆల్టో వంటి స్థిరమైన పోటీదారులతో పోటీపడుతూ, క్విడ్ తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకుంది. ఇప్పుడు ఈ కారు కొత్తగా అప్‌డేట్ కానుంది. రాబోయే నెలల్లో అప్‌డేట్ చేయబడిన కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చే ఆలోచనలో రెనాల్ట్ ఉందని కార్‌వాలే నివేదించింది. అంటే ఇప్పటికే ఉన్న బలమైన ఫీచర్లకు మరింత మెరుగులు చేర్చబడతాయని చెప్పొచ్చు.

లుక్, ఇంటీరియర్స్, సేఫ్టీ, టెక్నాలజీ పరంగా కొత్త మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ చిన్న కారు ఎప్పటిలాగే అందుబాటులో ఉండే ధరతోనే వినియోగదారులను ఆకట్టుకోనుందని భావిస్తున్నారు. ప్రస్తుత మోడల్ ధరల మాదిరిగానే, దీని ధర రూ.4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి.

Updated Renault Kwid Will Launch Soon in India Here Expected Features

ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ కారు సెగ్మెంట్‌లో మరింత ఆకర్షణీయంగా నిలుస్తుంది. డిజైన్ పరంగా మార్పులు చోటుచేసుకోవచ్చని అంచనా. కారు ముందు భాగంలో మరింత స్టైలిష్ లుక్, కొత్త డీటైలింగ్ ఉండొచ్చని సమాచారం. అలాగే, కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఐస్ కూల్ వైట్, అవుట్‌బ్యాక్ బ్రాంజ్, మూన్‌లైట్ సిల్వర్ వంటి ఆకట్టుకునే కలర్స్‌లో క్విడ్ లభ్యం కానుంది. వతకు, ఫ్యామిలీ బైయర్స్‌కి రెండింటికీ ఈ కారు మరింత దగ్గరవుతుందనడంలో సందేహం లేదు.

పవర్‌ట్రెయిన్ పరంగా అయితే ఎలాంటి పెద్ద మార్పులు ఉండవు. ఇదే 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి రానుంది. ఈ ఇంజిన్ 68 bhp హార్స్‌పవర్, 1 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కి సరిగ్గా సరిపోయేలా ఉండనుంది. ట్రాన్స్మిషన్ విషయంలో కూడా 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందించనున్నారు. ఈ కాంబినేషన్‌ వల్ల కొత్త క్విడ్ సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవే డ్రైవ్‌లోనూ సులభంగా నడపగలిగేలా ఉంటుంది.

Updated Renault Kwid Will Launch Soon in India Here Expected Features

మైలేజీ పరంగా అప్‌డేట్ తర్వాత కూడా క్విడ్ 22 kmpl వరకు మైలేజీ ఇస్తుందని అంచనా. అంటే ఎకానమీ, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, తక్కువ మెయింటెనెన్స్‌ మూడు అంశాలు మళ్లీ కస్టమర్లను తనవైపు తిప్పుకోబోతున్నాయి. మొత్తంగా కొత్త క్విడ్ ఫేస్‌లిఫ్ట్ పెద్దగా ఇంజిన్ అప్‌గ్రేడ్ లేకపోయినా, డిజైన్ మార్పులు, ఆకర్షణీయమైన కొత్త కలర్స్, అలాగే ఇప్పటికీ అందుబాటులో ఉన్న ధరలు దీన్ని మార్కెట్లో మళ్లీ హాట్‌సెల్లర్‌గా మార్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, August 29, 2025, 14:44 [IST]
English summary
Updated renault kwid will launch soon in india here expected features details
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+