రూ.3.25 లక్షలకే సోలార్ కారు వచ్చేసింది.. పైసా ఖర్చు లేకుండా ప్రతి ఏడాది 3000 కి.మీలు తిరగండి..

ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ కార్లు, బైక్స్, వాణిజ్య, ఇతర వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ ఈవెంట్‌లో కొన్నింటిని ఇప్పుడు విడుదల చేయగా, మరికొన్ని భవిష్యత్తులో విడుదల కాబోయే కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శిస్తున్నారు. దీనిలో కొన్ని వాహనాలు మాత్రం విచిత్రమైన డిజైన్లతో చూపరులను ఆకట్టుకున్నాయి. వాటి ఫీఛర్స్, పనితీరు గురించి ప్రక్కన పెడితే వాటి రూపానికే అట్రాక్టివ్‌గా అనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో స్టార్టప్ బ్రాండ్ అయిన వేవ్ ( Vayve) సంస్థ ఎవా (Eva) ప్రగతి మైదాన్‌లో శిలాజ ఇంధనాల ముగింపు పలకాలనే ఉద్దేశంతో కొత్తగా భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే కారును విడుదల చేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న కారణంగా చాలా మంది కొత్తగా కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో చేస్తున్న వారు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం బ్యాటరీల ద్వారా నడిచే వాహనాలకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే ఈవీలను ఛార్జ్ చేయాలన్న దానికి కరెంట్ అవసరం తప్పనిసరి. దీంతో కరెంట్ బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్, cngలకు పోటీగా విద్యుత్‌తో పాటు సౌరశక్తితో నడిచే కారును విడుదల చేసి వేవ్ సంస్థ మార్కెట్ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. సౌరశక్తితో నడిచే ఎవా కారు ధర రూ.3.25 లక్షలు(ఎక్స్ షోరూమ్).

Vayve Eva Solar Electric Car Launched In Auto Expo

ఈ కారును కంపెనీ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించారు. దీనిలో ఇద్దరు పెద్దలు, ఒక బిడ్డ కూర్చోవచ్చు. అయితే కంపెనీ ప్రకటించిన ధరను మొదటి 25,000 మంది వినియోగదారులకు మాత్రమే వేవ్ సంస్థ అందిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులకు మాత్రం ధర మరింత పెరగవచ్చు. సోలార్ కారు కాబట్టి దీన్ని నడపడం కూడా చాలా సులభం. దీని బుకింగ్స్ కూడా ప్రారంభించారు.

ముందస్తు బుకింగ్ చేసుకునే వారు కేవలం రూ.5,000 చెల్లించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. డెలివరీలు మాత్రం వచ్చే ఏడాది 2026లో ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి 25,000 మంది కస్టమర్లకు కంపెనీ అదనంగా పలు ప్రయోజనాలు అందిస్తుంది. పొడిగించిన బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల ఉచిత వాహన కనెక్టివిటీ వంటి ప్రయోజనాలు ఇస్తామని కంపెనీ పేర్కొంది.

Vayve Eva Solar Electric Car Launched

సౌరశక్తితో నడిచే ఈ కారు టాప్‌లో సోలార్ ప్యానెల్ సెటప్ ఉంటుంది. ఎండలో లేదా ఎక్కడైన అవుట్‌డోర్‌లో పార్క్ చేసినప్పుడు సూర్య రశ్మి నుంచి పవర్‌ను అందుకుని బ్యాటరీ ఛార్జ్ అయి కారు రన్ అవుతుంది. బ్యాటరీ ఆప్షన్లలో 9 kWhr, 12 kWhr, 18 kWhr అనే మూడు వేరు వేరు ఎంపికలు ఉంటాయి. ఎవా సోలార్ కారు టాప్ స్పీడ్ గంటకు 70 కి.మీ.

ముఖ్యంగా వేవ్ మొబిలిటీ తన సోలార్ కారులో IP68-సర్టిఫైడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 250 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఏడాదికి 3,000 కి.మీల ప్రయాణానికి సోలార్‌ను వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. వేవ్ సంస్థ ప్రకారం, దీని నిర్వహణ ఖర్చు కిలోమీటరుకు కేవలం 50 పైసలు మాత్రమే అవుతుంది.

Eva Solar Electric Car

నగర ప్రయాణాలకు అనువుగా ఉండేలా ఎవా విద్యుత్ శక్తితో పాటు సోలార్‌తో నడుస్తుంది. ఈ కారులో అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. పనోరమిక్ గ్లాస్ రూఫ్, లిక్విడ్ బ్యాటరీ కూలింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, యాపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ల్యాప్‌టాప్ ఛార్జర్, వంటి ఇతర ప్రీమియం కారు ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2025, 18:59 [IST]
English summary
Vayve eva solar electric car launched in auto expo starting price at rs 3 25 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+