ఆటో ఎక్స్‌పోలో భలే గమ్మత్తుగా ఉన్న చూడ చక్కని పొట్టి ఈవీ కారు.. ఇది చాలా గట్టిది.. చిన్న కుటుంబాలకు బెస్ట్
ఆటో ఎక్స్‌పో 2025: ప్రపంచదేశాలను అబ్బురపరిచేలా దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండప వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఆటోమొబైల్ తయారీ దారులు అందరూ కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం విడుదల కాబోతున్న వాహనాలు, అలాగే భవిష్యత్తులో రాబోతున్న కార్లు, బైక్స్, వాణిజ్య ఇతర వాహనాలకు సంబంధించిన కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత మార్కెట్ ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆటోమొబైల్ పరిశ్రమలో పేరుగాంచిన పలు వాహన తయారీ కంపెనీలు తమ కార్లను భారత్‌లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఢిల్లీలో అత్యంత ఘనంగా జరుగుతున్న అతిపెద్ద ఆటో ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో ఈ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి.
ఈ క్రమంలో వియత్నాంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన విన్‌ఫాస్ట్ (VinFast) ఆటో ఎక్స్‌పో 2025లో తన ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ ఈవెంట్‌లో విన్‌ఫాస్ట్ బిట్-సైజ్ EV అయిన VF3 ప్రదర్శించింది. ఇది అర్బన్ ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. నగర రోడ్లకు, దాని చుట్టు ప్రక్కన ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది చూడటానికి మారుతీ సుజుకీ ఆల్టో సైజును కలిగి ఉంటుంది.

బయటి నుంచి దీని డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో ప్లాస్టిక్ క్లాడింగ్‌ను పొందింది. ఈ చిన్న కారు, చిన్న కుటుంబ వినియోగదారులకు బాగా సరిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి పెట్రోల్, డీజిల్ కొట్టించడం కూడా అవసరం లేదు. భారతీయ ప్రజలను ఈ కారు బాగా ఆకట్టుకుంటుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇది ఎస్‌యూవీ (SUV) మోడల్. ఇది తక్కువ ధరలో లభించే అవకాశం ఉంది.
అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని కారు లోపల అధునాతన ఫీచర్లను అందించారు. ఇది వెనుక వీల్స్‌కు పవర్‌ను అందించడానికి సింగిల్ మోటారుతో వస్తుంది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 40hp పవర్, 110 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఉన్న బ్యాటరీని 10 నుండి 70 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 36 నిమిషాల టైం పడుతుందని వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్ ప్రకటనలో తెలిపింది.

VinFast VF3 కేవలం 5.2 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని అందుకుటుంది. ఇక, దీని ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే, లోపల థీమ్ చాలా అందంగా ఉన్నట్లు కనిపిస్తుంది. లోపల అధునాతన డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఉంటుంది. 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్,ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అత్యంత అధునాతన స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్, మెరుగైన కంఫర్ట్ సీట్లు, రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.
కారు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ 285 లీటర్ల లగేజీ పెట్టుకోవడానికి స్థలాన్ని కలిగి ఉంది. అలాగే, కారు టాప్ భాగంలో కూడా 50 కిలోల వరకు సామాన్లను తీసుకెళ్లవచ్చు. ఈ కొత్త కారులో ప్రయాణికుల భద్రతకు సంబంధించి కూడా అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారులో నలుగురు కూర్చుని ఈజీగా ప్రయాణించవచ్చు. ఇది కొంచెం ఎంజీ మోటార్స్‌కు చెందిన కామెట్ మోడల్ మాదిరిగా అనిపిస్తుంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








