పిల్లల బండి అనుకుని వదిలేస్తే పొరపాటే.. తక్కువ ధరలో షాకింగ్ ఎలక్ట్రిక్ కార్ రాబోతుంది!
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (Vinfast) ప్రస్తుతం భారత మార్కెట్‌పై తన దృష్టిని పెడుతోంది. దేశంలో ఈవీలు మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో కంపెనీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడి మార్కెట్లో కూడా తన సత్తాచాటడానికి కీలకంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా తన ప్రసిద్ధ మోడళ్లను ఇండియాలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో కూడా తన కార్లను ప్రదర్శించింది. విన్‌ఫాస్ట్ VF3, VF6, VF7 ఎలక్ట్రిక్ కార్లను భారతీయ ప్రజల కోసం ఇక్కడ పరిచయం చేసింది. వీటిలో ఇప్పటికే VF6, VF7 ఎలక్ట్రిక్ SUV మోడళ్ల కోసం కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు రూ.21,000 అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఆసక్తిగల వినియోగదారులు ఇప్పుడు నుంచే తమ బుకింగ్‌ను ఫైనల్ చేయవచ్చు. ఈ రెండు SUVలు దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ సెగ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీటిని ప్రక్కన పెడితే విన్‌ఫాస్ట్ ఒక చిన్న కారును కూడా తీసుకొస్తుంది. ఇది చిన్న గల్లీలు, నగరాల్లో ట్రాఫిక్‌లో సైతం రయ్ మంటూ దూసుకుపోయే విధంగా రూపుదిద్దుకుంది. టాటా నానో తరహలో ఇది కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది.

VF3 ఇది ఓ చిన్న, హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారు. డిజైన్ పరంగా ప్రత్యేకంగా, ధర విషయంలో ఎంతో యాక్సెస్‌ఫుల్‌గా ఉండేలా దీన్ని తయారు చేశారు. చాలా మంది మొదటి కారు కొనుగోలుదారులకు ఇది సరైన ఎంపికగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా, ఎప్పుడు కొందామా.. అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇది ఫిబ్రవరి 2026 భారతదేశంలో లాంచ్ చేయనున్నారు.
ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని ప్రారంభ ధర రూ.10 లక్షల లోపే ఉంటుందని ప్రచారం. అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇది కీలక ఆటగాడిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను, రేంజ్, భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచ మార్కెట్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రాండ్, భారత ఎలక్ట్రిక్ మార్కెట్‌లోనూ అదే స్థాయిలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.

విన్‌ఫాస్ట్ VF3 EV పేరు వినగానే చిన్నది, కానీ శక్తివంతమైనదిగా కనిపించే ఈ కారు టాటా నానోలా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, అందులోని టెక్నాలజీ మాత్రం చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించే వారికి ఇది సరైన ఎంపికగా నిలవబోతోంది. VF3 EV అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. దీని 18.64 కిలోవాట్(kWh) బ్యాటరీ ప్యాక్ ఫుల్ చార్జ్ అయినప్పుడు 215 కిలోమీటర్ల దూరాన్ని కవర చేయగలదు.
ఇంజిన్ శక్తి విషయానికి వస్తే, ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటర్ 43.5 PS హార్స్‌పవర్, 110 Nm టార్క్ జనరేట్ చేయగలదు. అంటే రోజూ సిటీలో డ్రైవింగ్‌కు సరిపడా పికప్ కారుకి ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 0 నుండి 100 కి.మీ. వేగాన్ని కేవలం 5.3 సెకన్లలో చేరుకోగలదు. ఇది చిన్న కారులో ఊహించదగిన అద్భుతమైన ఫీచర్. కారులో నాలుగు సీట్లు ఉన్నాయి.

చిన్న కుటుంబ ప్రయాణాలకైనా, డైలీ ప్రయాణాలకు ఇది మెరుగైన అనుభూతిని ఇస్తుంది. చిన్న పరిమాణంతో పాటు, పార్కింగ్‌కు కూడా ఇది చాలా వీలుగా ఉంటుంది. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరతో, టెక్ ఫీచర్లతో కూడిన ఈ కారును దేశంలో రూ.10 లక్షల లోపు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇది సక్సెస్ అవుతుందని కంపెనీ భారీ నమ్మకం పెట్టుకుంది. విడుదల చేయబోయే ముందు దీని అధికారిక బ్యాటరీ, ఫీచర్స్ గురించి వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications








