ఫీచర్స్ చూస్తే మతి పోతుంది బ్రో.. టాటా- మహీంద్రాకు పోటీగా కొత్త ఈవీ కార్లు.. ఆటో ఎక్స్‌‌పోలో హైలెట్‌..

ప్రపంచదేశాలు ఆశ్యర్యపోయేలా దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండప వేదికగా జరుగుతున్న అతిపెద్ద వాహన ఈవెంట్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతుంది. శుక్రవారం ఈ వేడుకను భారత ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ఆటో ఎక్స్‌పోలో వాహన తయారీ కంపెనీలు తమ మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. ఇదే క్రమంలో విదేశాలకు చెందిన కార్ల తయారీదారులు తమ మోడళ్లను భారత గడ్డపై ఆవిష్కరిస్తున్నారు. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ ఇతర దేశాలతో పోలిస్తే పెద్దదిగా ఉండటం కారణంగా విదేశీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వియత్నాంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారులలో ఒకటైన విన్‌ఫాస్ట్ (VinFast) ఆటో ఎక్స్‌పో 2025లో తన వాహనాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ VF 6,VF 7, VF 8 ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది.

విన్‌ఫాస్ట్ VF6 ఈవీ కారు అద్బుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. విలక్షణమైన హెడ్‌ల్యాంప్‌లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లను కలిగి ఉంది. ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. విశాలమైన క్యాబిన్‌‌లొ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సన్‌రూఫ్ హైలైట్. లోపల బ్రౌన్, బ్లాక్ థీమ్ ఉంటుంది. డ్యాష్‌బోర్డులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పలు స్మార్ట్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

Vinfast Electric Cars Vf6 Vf7 And Vf8

విన్‌ఫాస్ట్ VF6 ఈవీ 59.6kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 201bhp పవర్, 309Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్స్ భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ అంచనాలు పెట్టుకుంది. ఇండియాలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఇది అమ్మకాల పరంగా కంపెనీకి కీలకం.

విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ కారును కంపెనీ ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ప్రదర్శించింది. ఇది లేటెస్ట్ టెయిల్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ LED హెడ్‌లైట్‌లు, సొగసైన బాడీని కలిగి ఉంటుంది. ఎకో, ప్లస్ అనే వేరియంట్లలో లభిస్తుంది. ఎకో వేరియంట్‌‌లో 201 bhp పవర్, 310 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 75.3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 45 కి.మీల వరకు ప్రయాణిస్తుంది.

Vinfast Electric Cars Vf7 Showcasesed In Auto Expo 2025

ప్లస్ వేరియంట్‌లో కూడా 75.3kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 349 bhp పవర్, 500 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది WLTP సైకిల్‌తో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 431 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. కారు లోపల అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. 15-అంగుళాల డిస్‌ప్లే,హెడ్-అప్ డిస్‌ప్లే, సేఫ్టీ కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)వంటివి ఉన్నాయి.

విన్‌ఫాస్ట్ VF8 ఈవీ కారులో శక్తివంతమైన డ్యూయల్ మోటార్‌ను అందించారు. ఇది 408 PS పవర్, 640 గరిష్ట Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది WLTP సైకిల్‌తో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 480 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. దీంతో 30 నిమిషాల్లో బ్యాటరీ 70 శాతం ఛార్జ్ అవుతుంది.

Vinfast Electric Car Vf8 Showcasesed In Auto Expo 2025

ఇది కేవలం 5.5 సెకన్లలో 0 నుండి 100 kmph వరకు వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS), చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, ఇతర సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. క్యాబిన్‌లో 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, January 18, 2025, 13:58 [IST]
English summary
Vinfast electric cars vf6 vf7 and vf8 showcased in bharat mobility global expo 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+