కళ్లు చెదిరే ఫీచర్లతో మిడిల్ క్లాస్ కోసం కొత్త ఈవీ.. సింగిల్ ఛార్జ్ చాలు.. టాటా-హ్యుందాయ్‌లకు గట్టి పోటీ!
వియత్నాంకు చెందిన ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది. ప్రముఖ ఆటోమేకర్‌గా అవతరించిన ఈ సంస్థ, భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పలు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాటిని దేశంలో ప్రదర్శించింది. వాటిలో VF6, VF7 అనే రెండు ఎలక్ట్రిక్ SUVలు కూడా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు సాగితే, విన్‌ఫాస్ట్ నుంచి భారత విభాగంలో విడుదల కానున్న తొలి మోడల్ VF6 కానుంది. వచ్చే సెప్టెంబర్‌లో ఈ ఎలక్ట్రిక్ SUVను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే VF6 మోడల్ ప్రపంచవ్యాప్తంగా మెరుగైన స్పందన పొందుతూ, తన ప్రత్యేకతను చాటుతోంది.
కారుకు విశిష్టమైన డిజైన్ ఉన్నది. ముందు 'V' ఆకారాన్ని పోలి ఉండే సిగ్నేచర్ LED హెడ్‌లైట్లు, దానికి పొడవుగా కలిసే పూర్తి వెడల్పు DRLలు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కేవలం లైట్లుగా కాకుండా, కారుకి దృఢమైన విశ్వసనీయతను, ఆధునికతను సూచించేలా ఉంటాయి. అంతేకాకుండా, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ దీనికి మరింత స్టైలిష్ రూపాన్ని అందిస్తాయి. కేవలం లుక్ పరంగా కాదు, టెక్నాలజీ పరంగా కూడా ఇది బెస్ట్ మోడల్.

కొత్తగా ప్రవేశపెట్టబోతున్న VinFast VF6 ఎలక్ట్రిక్ SUVను, ఈ విభాగంలోని ఇతర కార్లకు తక్కువ కాకుండా గట్టిపోటీ ఇవ్వగల సామర్థ్యంతో రూపొందించారు. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, దీని మరో ముఖ్యమైన అంశం ధర. వేరియంట్‌ను బట్టి ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు సుమారు రూ.18 లక్షల నుండి రూ.24 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటాయని అంచనా. ఈ రేంజ్ అంటే మిడిల్ క్లాస్ వినియోగదారులు సైతం కొనుగోలు చేయవచ్చు.
ఈ ధర , VF6ను మధ్యస్థ సెగ్మెంట్‌లోకి తీసుకొచ్చి, మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించగల స్థితిలో నిలబెడుతుంది. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా హారియర్ EV వంటి ప్రఖ్యాత మోడళ్లను లక్ష్యంగా పెట్టుకొని, వినియోగదారులకు లేటెస్ట్ సాంకేతికతను సరసమైన ధరకే అందించేందుకు విన్‌ఫాస్ట్ ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయంగా మంచి గుర్తింపు సంపాదించిన ఈ మోడల్, భారత్‌లో కూడా అదే స్థాయి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విన్‌ఫాస్ట్ VF6 ఎలక్ట్రిక్ SUV కేవలం డిజైన్ పరంగానే కాదు, శక్తివంతమైన పనితీరు పరంగానూ అంతే ఆకట్టుకునేలా రూపొందించారు. దీనిలో ఏర్పాటు చేసిన 59.6 కిలోవాట్స్(kWh) కెపాసిటీ కలిగిన పెద్ద బ్యాటరీ ప్యాక్ దీనికి ప్రధాన బలంగా నిలుస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే, ఈ SUV సుమారుగా 379 నుండి 410 కి.మీ.ల దూరాన్ని కవర్ చేయగలదు. ఇది దాని వేరియంట్ మరియు డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు.
సాధారణ నగర ప్రయాణాల నుంచి లాంగ్ రేంజ్ వరకు, వినియోగదారుల కోసం ఇది విశేషమైన వెసులుబాటు కల్పిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లలో అదే పవర్‌ట్రెయిన్‌తో విక్రయిస్తున్న ఈ మోడల్‌ను, భారత మార్కెట్లోనూ యధాతధంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇంత శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం, సరసమైన ధర, ఆకర్షణీయమైన డిజైన్, ఈ మూడింటితో VF6 దేశీయ ఎలక్ట్రిక్ SUV విభాగంలో ఒక కొత్త ప్రాధాన్యాన్ని సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ కారులో ఐదు మంది కూర్చోవచ్చు. లోపల 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక AC వెంట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే,హెడ్-అప్ డిస్‌ప్లే, భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), చుట్టు చూడటానికి 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి పలు అత్యాధునిక ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








