మిడిల్ క్లాస్ వాళ్లకు గుడ్ న్యూస్..రూ.7.5లక్షలకే 215కిమీ రేంజ్ ఈవీ..మిగతావన్నీ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే
వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) త్వరలోనే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కంపెనీ, ముఖ్యంగా విఎఫ్6 (VF6), విఎఫ్7 (VF7) వంటి రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (EV SUVs) దేశీయ మార్కెట్లలో విజయవంతంగా విక్రయిస్తోంది. ఇప్పుడు భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, 2026 ఫిబ్రవరిలో కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రవేశం భారత ఈవీ మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించనుంది.
మధ్యతరగతి కోసం వీఎఫ్3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్
విన్‌ఫాస్ట్ తీసుకురాబోతున్న మోడళ్లలో, ముఖ్యంగా మధ్యతరగతి కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉన్న మోడల్ విన్‌ఫాస్ట్ వీఎఫ్3 (VF3). ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కూడా 2026 ఫిబ్రవరిలోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

తక్కువ ధరలో ఈవీని ఆశిస్తున్న వినియోగదారులకు ఇది ఒక మంచి ఎంపిక కానుంది. ఈ వీఎఫ్3 కారు ఎలక్ట్రిక్ బ్లూ, అర్బన్ మింట్, సమ్మర్ యెల్లో, రోజ్ పింక్ వంటి ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
వీఎఫ్3 ఫీచర్లు, రేంజ్ వివరాలు
విన్‌ఫాస్ట్ వీఎఫ్3 ఒక అద్భుతమైన, కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది హలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లతో పాటు, 3,190 ఎంఎం పొడవు, 1,679 ఎంఎం వెడల్పు, 1,622 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 191 ఎంఎం కాగా, వీల్‌బేస్ 2,075 ఎంఎం ఉంది. ఈ కారులో నాలుగు సీట్లు ఉన్నాయి.

లగేజీ కోసం 285 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, వీఎఫ్3 18.64 కిలోవాట్-అవర్ (kWh) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 215 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. ఈ కారు టాప్ స్పీడ్ 100 కెఎంపిహెచ్ కాగా, 5.3 సెకన్లలో 0 నుంచి 50 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు. డ్రైవింగ్ మోడ్‌లలో ఇకో, కంఫర్ట్, స్పోర్ట్ ఆప్షన్లు ఉన్నాయి.
అత్యాధునిక టెక్నాలజీ, భద్రత
వీఎఫ్3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ పవర్ విండోలు వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), రేర్-వ్యూ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా ఇందులో అందించారు.

లిమో గ్రీన్ MPV కూడా విడుదల
వీఎఫ్3 తో పాటు, విన్‌ఫాస్ట్ కంపెనీ లిమో గ్రీన్ (Limo Green) అనే ఎంపీవీని (MPV) కూడా మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ మోడల్ ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇది 7-సీట్ల ఎంపికతో వస్తుంది. 60.13 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.
ఇది ఒక్క ఛార్జ్‌పై 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. ఇందులో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, 4 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








