ఇండియాలోకి అఫీషియల్‎గా ఎంట్రీ ఇచ్చిన విన్ ఫాస్ట్.. తొలి డీలర్‌షిప్ ఓపెన్.. టెస్లా లాంటి కార్లు వస్తున్నాయ్

కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అలాంటి వారికో గుడ్ న్యూస్. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు, బస్సులతో అలరిస్తున్న కంపెనీ.. ఇప్పుడు ఇండియాలో తన తొలి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. త్వరలోనే రెండు అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, వీఎఫ్‌6, వీఎఫ్‌7లను విడుదల చేయనుంది. ఈ కార్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

విన్‌ఫాస్ట్ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించడం ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు నిజంగా శుభవార్త. విన్‌ఫాస్ట్ అనుబంధ సంస్థ అయిన విన్‌ఫాస్ట్ ఆటో ఇండియా, గుజరాత్‌లోని సూరత్‌లో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. దీనితో, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఈ కంపెనీ అధికారికంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ డీలర్‌షిప్‌లో త్వరలో విడుదల కానున్న విఎఫ్‌6, విఎఫ్‌7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శనకు ఉంచనున్నారు.

VinFast
విన్‌ఫాస్ట్ కంపెనీ భారత మార్కెట్‌పై చాలా పెద్ద ప్లాన్స్‌తో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 27కు పైగా నగరాల్లో మొత్తం 35 డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మాత్రమే కాదు, ఆగస్టు 4న తమిళనాడులోని తూతుకుడిలో తమ భారీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతోంది. దీని నిర్మాణం కోసం ఏకంగా రూ.16,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది భారతదేశంలో విన్‌ఫాస్ట్ దీర్ఘకాలిక నిబద్ధతను తెలియజేస్తుంది.

మీరు విన్‌ఫాస్ట్ కార్లను సొంతం చేసుకోవాలని చూస్తున్నారా? అయితే జూలై 15 నుంచే విఎఫ్‌6, విఎఫ్‌7 ఎలక్ట్రిక్ కార్ల కోసం కంపెనీ అధికారికంగా ప్రీ-బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్‌లు కేవలం రూ.21,000 ముందస్తు చెల్లింపుతో కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా విన్‌ఫాస్ట్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

VinFast

విఎఫ్‌6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో అందుబాటులోకి రావచ్చని అంచనా. ఇది ఎర్త్, విండ్ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. జెట్ బ్లాక్, డెజర్ట్ సిల్వర్, ఇంఫినిటీ బ్లాంక్, క్రిమ్‌సన్ రెడ్, జెనిత్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది వస్తుందని సమాచారం.

ఈ కారు 5 సీట్ల సామర్థ్యంతో రానుంది. ఇందులో 59.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 379 కిలోమీటర్ల నుంచి 410 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే, 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.

VinFast

విఎఫ్‌7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర సుమారు రూ.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చని అంచనా. ఇది ఎర్త్, విండ్, స్కై అనే మూడు వేరియంట్లలో లభించనుంది. జెట్ బ్లాక్, డెజర్ట్ సిల్వర్, ఇంఫినిటీ బ్లాంక్, క్రిమ్‌సన్ రెడ్, జెనిత్ గ్రే వంటి రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఈ కారు కూడా 5 సీట్ల కెపాసిటీతో వస్తుంది. ఇందులో 75.3kWh బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 431 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఫీచర్ల పరంగా, 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360 డిగ్రీ కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.

డ్రైవ్‎స్పార్క్ అభిప్రాయం : విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లోకి రావడం ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్లు భారతీయ రహదారులపై ఎలా దూసుకుపోతాయో, కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, July 28, 2025, 8:41 [IST]
English summary
Vinfast india launch first dealership opens vf6 vf7 evs coming soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+