భారత్‌లోకి ఆఫ్రికన్ ఏనుగు సైజు కార్..కియా కారెన్స్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్

భారత మార్కెట్‌లోకి కొత్త ఆటోమొబైల్ బ్రాండ్‌లు వరుస కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast), తన తొలి వాహనంతో ఇండియన్ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కంపెనీ తన నూతన లిమో గ్రీన్ (Limo Green) అనే 7-సీటర్ ఎంపీవీని (7-Seater MPV) భారత్‌లో సీక్రెట్‎గా టెస్ట్ చేసింది. ఇది మొదటిసారిగా ట్రయల్ రన్ జరుపుతున్నప్పుడు కెమెరా కంట పడింది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ పెద్ద ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు, దాని ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.

వియత్నామీస్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇటీవల VF6, VF7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల డెలివరీని ప్రారంభించింది. ఇప్పుడు భారత్ కోసం ప్రత్యేకంగా తమ కొత్త మోడల్ లిమో గ్రీన్ (Limo Green) ఎంపీవీ తయారీకి పేటెంట్‌ను దాఖలు చేసింది. ఈ కారు ఇటీవల భారత రోడ్లపై ట్రయల్ రన్ (Trial Runs) నిర్వహిస్తుండగా కనిపించింది. దానికి సంబంధించిన స్పై ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

VinFast Limo Green 7-Seater Electric MPV Spotted Testing in India for the First Time

టెస్టింగ్ సమయంలో కారును కంప్లీట్ బ్లాక్ కలర్ కవర్‌తో కప్పినప్పటికీ, దాని సిగ్నేచర్ టైల్ ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్‌ను క్లియర్‎గా గుర్తించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ లిమో గ్రీన్ డిజైన్‌ను ఇది పోలి ఉంది. లిమో గ్రీన్ ఎంపీవీ దాని పోటీదారులతో పోలిస్తే చాలా పెద్ద, విశాలమైన (Spacious) వాహనం.

ఈ కారు 4,740 మి.మీ పొడవు, 1,872 మి.మీ వెడల్పు, 1,728 మి.మీ ఎత్తు కలిగి ఉంది. ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ (170 మి.మీ), పెద్ద వీల్‌బేస్ (2,840 మి.మీ) ను కలిగి ఉంది. దీని మొత్తం బరువు దాదాపు 1,700 కిలోలు. ఈ వాహనం 7-సీటర్ ఆప్షన్‌తో వస్తుంది, ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది 285 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది, ఇది వీకెండ్ జర్నీలకు లేదా ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.

VinFast Limo Green 7-Seater Electric MPV Spotted Testing in India for the First Time

ఇందులో స్టైలిష్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఫుల్-విడ్త్ డీఆర్ఎల్ (DRLs), డీప్ ఓషన్, సన్‌సెట్ ఆరెంజ్, నెప్ట్యూన్ గ్రే, క్రిమ్సన్ రెడ్ వంటి కలర్ ఆప్షన్లు ఉంటాయి. లిమో గ్రీన్ పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్‌తో వస్తుంది. అద్భుతమైన పనితీరును కలిగి ఉంటుంది. ఇది 60.13 కిలోవాట్-అవర్ (kWh) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది 450 కి.మీ వరకు అద్భుతమైన రేంజ్‌ను (Mileage) అందిస్తుంది.

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 201 హార్స్‌పవర్ (bhp), 280 న్యూటన్ మీటర్ల (Nm) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎకో (Eco), కంఫర్ట్ (Comfort), స్పోర్ట్ (Sport) అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి.

VinFast Limo Green 7-Seater Electric MPV Spotted Testing in India for the First Time

లిమో గ్రీన్ మోడ్రన్ టెక్నాలజీ, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, లెథరెట్ సీటింగ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆన్-వీల్ డిస్క్ బ్రేక్‌లు వంటివి ఉన్నాయి.

ఈ కొత్త ఎంపీవీ రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య పోటీ ధరలో లభించే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది నేరుగా కియా కారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV) వంటి వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 10, 2025, 15:30 [IST]
English summary
Vinfast limo green 7 seater electric mpv spotted testing in india for the first time
Read more on: #electric car #mpv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+