ఇది టాటా నానో కాదు.. మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు! పేటెంట్ దాఖలు చేసిన విన్‌ఫాస్ట్
వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ విన్‌ఫాస్ట్ (Vinfast) భారత మార్కెట్లో తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే చెన్నై, సూరత్‌లలో డీలర్‌షిప్‌లను ప్రారంభించి, తన ప్రెజెన్స్‌ను స్థిరపరిచిన ఈ కంపెనీ, ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలతో భారత వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో, విన్‌ఫాస్ట్ VF6, VF7 అనే రెండు ఎలక్ట్రిక్ SUV మోడళ్లను విడుదల చేయనుంది. ఇంతలో, ఈ బ్రాండ్ భారతదేశంలో మరో కీలక అడుగు వేసింది, మినియో గ్రీన్ EV ( VinFast Minio Green EV) అనే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. ఈ మోడల్ గురించి అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, ఇది VF6, VF7 తర్వాత విడుదలయ్యే తదుపరి మోడల్ కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
విన్‌ఫాస్ట్ ఈ వ్యూహం ద్వారా, పెద్ద SUVలతో పాటు పట్టణ వినియోగదారులకు అనువైన కాంపాక్ట్ EV సెగ్మెంట్‌లో కూడా తన స్థానం ఏర్పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇది భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీని మరింత ఉత్కంఠగా మార్చే అవకాశం ఉంది. ఈ మినీ గ్రీన్ కారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రధానంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించబడుతోంది.

చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఇది నాలుగు సీట్లు కలిగిన కారు కావడంతో సౌకర్యంగా కూర్చుని ప్రయాణించగలరు. అదనంగా, 24 లీటర్ల ట్రంక్ సామర్థ్యం ఉండటం వల్ల, అవసరమైన లగేజీని తీసుకెళ్లవచ్చు. డిజైన్ పరంగా చూస్తే, ఈ మినీ EV పొడవు 3,090 మిల్లీమీటర్లు, వెడల్పు 1,496 మిల్లీమీటర్లు, ఎత్తు 1,625 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వీల్‌బేస్ 2,065 మిల్లీమీటర్లు ఉండటం వల్ల, చిన్న కారుగానే ఉన్నప్పటికీ లోపల సరిపడిన స్థలం లభిస్తుంది.
ఇది పట్టణ ట్రాఫిక్‌లో సులభంగా నడపడానికి, అలాగే తక్కువ స్థలంలో పార్క్ చేయడానికి అనువుగా ఉంటుంది. VinFast Minio Green EVలో 14.7 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది, ఇది వెనుక చక్రాలకు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 27 హెచ్‌పీ శక్తిని, 65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. పనితీరు పరంగా నగర ప్రయాణాలకు శక్తిని అందించడమే కాకుండా, సాఫ్ట్, సైలెంట్ డ్రైవింగ్‌తో దూసుకుపోతుంది.

రేంజ్ విషయానికి వస్తే, కంపెనీ పేర్కొన్న NEDC ప్రమాణాల ప్రకారం, ఈ మినీ ఎలక్ట్రిక్ కారు ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 170 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ రేంజ్, రోజువారీ పట్టణ ప్రయాణాలు, షార్ట్ కమ్యూట్స్, లేదా వాణిజ్య అవసరాలకు పూర్తిగా సరిపోతుంది. చిన్న పరిమాణం, సమర్థవంతమైన బ్యాటరీ, తక్కువ నిర్వహణ ఖర్చులతో, Minio Green EV ఒక ప్రాక్టికల్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్‌గా నిలుస్తుంది.
VinFast Minio Green EV పనితీరు పరంగా కూడా తన కాంపాక్ట్ సెగ్మెంట్‌లో ప్రత్యేకతను చాటుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ ఉండగా, కేవలం 6.5 సెకన్లలోనే 50 కి.మీ వేగాన్ని చేరుకోవచ్చు. ఈ ఫిగర్స్ నగర ప్రయాణాలకు సరిపడే వేగాన్ని అందిస్తాయి. భారత మార్కెట్లో ఇది దాదాపు రూ.9 లక్షల ధర పరిధిలో విడుదలయ్యే అవకాశముందని అంచనా వేయబడుతోంది.
విన్‌ఫాస్ట్ మినియో గ్రీన్ EV లోపలి భాగం సింపుల్‌గా, వినియోగదారుకు అవసరమైన అన్ని ముఖ్యమైన అంశాలను అందించే విధంగా రూపొందించబడింది. క్లీన్ లేఅవుట్‌తో ఉన్న ఈ ఇంటీరియర్‌లో, రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, నాలుగు సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీటు, సీట్లకు ఫాబ్రిక్ అప్హోల్స్టరీ అందించబడింది. భద్రతా పరంగా కూడా ఈ మోడల్‌లో డ్రైవర్ కోసం ఎయిర్‌బ్యాగ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, అలాగే EBDతో కూడిన ABS వంటి సిస్టమ్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








