ఈ పొట్టి ఎలక్ట్రిక్‌ కారు చాలా గట్టిదీ.. బెత్తడంతా ఉన్నాకానీ, ఫర్ఫామెన్స్‌లో భళా!

వియత్నాంకు చెందిన దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్.. భారత మార్కెట్ వైపు దృష్టి సారించింది. విదేశాల్లో ఈ సంస్థకు చెందిన కార్లు ఇప్పటికే వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇప్పుడు భారతీయ కస్టమర్లను సైతం అదే స్థాయిలో లక్ష్యంగా పెట్టుకుందీ సంస్థ. ఇందులో భాగంగా... త్వరలో భారత మార్కెట్లోకి వివిధ కార్లను లాంఛ్ చేయనుంది. ఇటీవల జరిగిన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ఈ సంస్థ.. కొన్ని కారు మోడళ్లను పరిచయం చేసి ఔరా అనిపించింది. దాంట్లో 'VF3' ఎలక్ట్రిక్ కారు అందరి దృష్టినీ ఆకర్షించింది. త్వరలోనే దీన్ని లాంఛ్‌కు సిద్ధమవుతోంది. మరి ఆ ఈవీ ధర అంచనా, పర్ఫార్మెన్స్, ఇతర స్పెసిషికేషన్లు ఏమున్నాయో చూసేద్దాం.

విన్‌ఫాస్ట్ వీఎఫ్‌3 ఈవీ.. బయటివైపు అధునాతనమైన డిజైన్‌తో రూపొందించిన ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు. దీంట్లో క్రోమ్ గ్రిల్‌బార్, బ్లాక్ బంపర్, 'V' షేప్‌లో ఉన్న టెయిల్‌గేట్ వంటి ఆకర్షణీయమైన హంగులు ఉన్నాయి. ఈ కారు చూసేందుకు మారుతీ సుజుకీ ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్ తరహాలో కనిపిస్తోంది. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు (MG Comet EV) తరహాలో ఈ విన్‌ఫాస్ట్ కొత్త కారులో కూడా రెండు డోర్స్ ఉన్నాయి.

VinFast VF3 Electric Car

ఇది 3,190 మిమీల పొడవుతో, 1,679 మి.మీ.ల వెడల్పుతో 1,652 మిమీల ఎత్తుతో ఉంటుంది. అలాగే 2,075 మిమీల వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ విన్‌ఫాస్ట్ వీఎఫ్3 ఈవీ.. ఎక్సలెంట్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. ఇందులోని మోటార్‌ 40 PS, 110 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 215 కి.మీ.ల రేంజ్ అందించనుందని తెలుస్తోంది.

ఇంటీరియర్‌లోనూ ఈ కారు అట్రాక్టివ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, 2- స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. సేఫ్టీ పరంగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) ఉంటాయి. ఈ కొత్త విన్‌ఫాస్ట్ వీఎఫ్ 3 ఈవీని.. తమిళనాడు తూత్తుకుడిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో తయారవుతోంది.

VinFast VF3 Electric Car

దీని ఎక్స్- షోరూమ్ ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. విన్‌ఫాస్ట్ సంస్థ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో వివిధ స్కూటర్లను కూడా ప్రదర్శించింది. దాంట్లో Evo S, Theon S, Clara S, Feliz S, Vento S, Dragonfly వంటి మోడళ్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్లు... అత్యధిక, అత్యల్ప ధరల్లో అమ్మే అవకాశం ఉంది.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు పెరిగాయి. దీంతో కంపెనీలు కొత్త కార్లను తీసుకువస్తున్నాయి. అందులో భాగంగానే చాలా కంపెనీలు భారతీయ మార్కెట్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలోనే భారత్‌లో ఈ రంగానికి చెందిన కార్లు ఎక్కువ మొత్తంలో అమ్ముడయ్యే ఛాన్స్‌ ఉంది. ఇప్పటికే ఈ మార్కెట్‌లోకి మారుతి సుజుకి, హ్యుందాయ్‌ ప్రవేశించాయి. త్వరలోనే ఇతర టాప్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలు కూడా కొత్త ఈవీలను తీసుకురానున్నాయి.

VinFast VF3 Electric Range

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2025, 13:12 [IST]
English summary
Vinfast vf3 electric car all set to launch in indian market check range and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+