చిన్న కుటుంబాల కోసం పొట్టి ఈవీ కారు.. అదిరే ఫీచర్స్ , సూపర్ ఫర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే!
వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ (vinfast) ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. అంతర్జాతీయంగా ఈ కార్లకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత మార్కెట్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ కూడా తన వ్యాపారాన్ని విస్తరించడానికి పలు కొత్త మోడళ్లను విడుదల చేయాలని చూస్తుంది. దీనిలో భాగంగా త్వరలో లాంచ్ చేయబోయే కొన్ని కార్లను ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ఈవెంట్‌లో పలు ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిలో ముఖ్యంగా 'VF3' అనే ఎలక్ట్రిక్ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూడటానికి చిన్నగా భలేగా అనిపిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో చిన్న ఫ్యామిలీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో పొట్టి కారు దేశంలో మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుందని వియత్నాం కంపెనీ విన్‌ఫాస్ట్ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్ అతిపెద్ద గమ్యస్థానంగా అవతరించింది. ఇలాంటి సమయంలో వీఎఫ్3 ఈవీ కారుకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఈ కారు ఎప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీని గురించిన మరిన్ని వివరాలను కింది కథనంలో తెలుసుకుందాం.

డిజైన్: VinFast VF3 ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే భారత్‌లో మాత్రం త్వరలోనే అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అద్బుతంగా ఉంటుంది. ముందు క్రోమ్ గ్రిల్ బార్, LED హెడ్‌లైట్లు, V ఆకారంలో ఉండే టెయిల్‌గేట్, బ్లాక్ కలర్ బంపర్, అల్లాయ్ వీల్స్ కారు బయటి నుంచి అందాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడ్డాయి.
ఈ ఎలక్ట్రిక్ కారు నగర రోడ్లకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీని కొలతల విషయానికి వస్తే, పొడవు 3,190 mm, వెడల్పు 1,679 mm, ఎత్తు 1,652 mmను కలిగి ఉంది. దీని వీల్‌బేస్ పరంగా చూస్తే 2,075 mmగా ఉంది. VF3 ఎలక్ట్రిక్ కారులో రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. చూడటానికి ఇది మారుతీ సుజుకీ ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా కనిపిస్తుంది.

బ్యాటరీ పనితీరు: వీఎఫ్3 ఈవీ కారులో 18.64 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది వెనుక ఆక్సిల్-మౌంటెడ్ మోటార్‌తో వస్తుంది. దీనిలోని మోటార్ 41 PS హార్స్‌పవర్, 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 215 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇది 5.3 సెకన్లలోనే 0-50 కి.మీ./గం వేగాన్ని చేరుకుంటుంది. బ్యాటరీని 36 నిమిషాల్లో 10%-70% ఛార్జ్ చేయచ్చు.
ఫీచర్స్: ఈ ఎలక్ట్రిక్ కారులో 2-స్పోక్ స్టీరింగ్ వీల్, 10-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కంఫర్టబుల్ సీట్లు, లోపల కూర్చున్న ప్రయాణికుల రక్షణ కోసం ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), బహుళ ఎయిర్‌బ్యాగులు, నుక పార్కింగ్ సెన్సార్, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటివి కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా డజన్ల కొద్ది సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

ధర: ఇక చివరగా VinFast VF3 ఎలక్ట్రిక్ కారు ధర విషయానికి వస్తే, ఇంకా కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారును దాదాపు రూ.10 లక్షల లోపే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది 2026 లో దేశీయ మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








