ఈ పొట్టి ఎలక్ట్రిక్ కారు చాలా గట్టిది.. చిన్న కుటుంబాలకు బెస్ట్.. పైగా తక్కువ ధరలో రాబోతుంది!
వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ (Vinfast) భారతీయ కార్ల మార్కెట్లో తన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇంతకుముందు ప్రధానంగా వియత్నాం మార్కెట్‌కే పరిమితమైన ఈ బ్రాండ్, ఇప్పుడు భారత్ వంటి విస్తృత వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పలు మోడళ్లను విడుదల చేయడానికి కీలకంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో 'VF3' ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. చిన్నదైన, స్టైలిష్ లుక్‌తో, పూర్తిగా ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్‌తో వస్తున్న ఈ కారు, భారతీయ రహదారులపై విప్లవాత్మక మార్పుని తీసుకురాబోతోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తరువాత దేశీయంగా ఉన్నటువంటి ఈవీ తయారీదారులకు బలమైన పోటీ కానుంది. ప్రధానంగా MG మోటార్‌కు చెందిన కామెట్ ఈవీ, టాటా మోటార్స్ టియాగో ఈవీ, సిట్రోయెన్ EC3 వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇది చిన్నదైన హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ దీని ఆకట్టుకునే డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. దీని బ్యాటరీ, లేటెస్ట్ ఫీచర్స్ పరంగా విన్‌ఫాస్ట్ వీఎఫ్3 ప్రత్యేకంగా నిలవనుంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, VF3 ధరను అన్ని వర్గాల వారు కొనగలిగేలా అందుబాటులో అందించే అవకాశం ఉంది. విన్‌ఫాస్ట్ ఎంట్రీ-లెవల్ EVను తక్కువ ధరలో తీసుకొచ్చినట్లయితే, ఇది భారతీయ వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్‌గా మారడానికి బొలేడు అవకాశాలు ఉన్నాయి. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు త్వరలో మార్కెట్లోకి విడుదల కావచ్చని తెలుస్తుంది. దీని ధర రూ.10 లక్షల(ఎక్స్ షోరూమ్)గా ఉండవచ్చు.
VF3లో 18.64 kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో రోజువారీ సిటీ డ్రైవింగ్‌కి లేదా షార్ట్ ట్రిప్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది. అంతేకాదు, ఈ కారు కేవలం 5.3 సెకన్లలోనే 0 నుండి 50 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, అంటే కారును స్టార్ట్ చేసిన వెంటనే వేగవంతమైన పికప్‌ను అందిస్తుంది.

ఈ కారు సాధారణంగా 2-డోర్ మైక్రో SUV. అయినప్పటికి లోపల నాలుగు సీట్లు ఉంటాయి. కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ప్రయాణీకులకు సరిపడే స్థలాన్ని కలిగి ఉంది. ఇది చూడటానికి చిన్న కారు అయినప్పటికి కాంపాక్ట్ డిజైన్‌తో స్టైలిష్ లుక్‌తో శక్తివంతమైన బ్యాటరీ, మెరుగైన డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది. ఎక్స్‌టీరియర్ అందిరిని ఆకట్టుకుంటుంది. ఇంటీరియర్‌లో కూడా డజన్ల కొద్ది ఫీచర్స్ ఉంటాయి. 10-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఇంకా మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్ లాంటి ఆధునిక ఫీచర్లు ఇందులో లభిస్తాయి. VF3 భద్రత పరంగా కూడా తగినంత శ్రద్ధ తీసుకుంది. ఈ SUVలో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండే అవకాశం ఉంది, ఇది ప్రయాణికుల రక్షణను మరింత మెరుగుపరిచేలా చేస్తుంది. విన్‌ఫాస్ట్ VF3 ఎలక్ట్రిక్ కారుకు గట్టిపోటీ ఇవ్వడానికి ఇప్పటికే టాటా టియాగో EV, MG కామెట్ EV సిద్ధంగా ఉన్నాయి.

టియాగో EV ధర రూ. 7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 250 నుండి 315 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. MG కామెట్ EV కూడా కారుకు పోటీగా నిలవనుంది. దీని ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పూర్తిగా ఛార్జ్‌తో 230 కి.మీల వరకు దూరం ప్రయాణిస్తుంది. సిట్రోయెన్ eC3 కూడా దీనితో పోటీ పడుతుంది. ఇది 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








