మార్కెట్లోకి కొత్త కంపెనీల హల్‌చల్.. సోలార్ పవర్ కారు మంచిదా? లేక ఈ ఎలక్ట్రిక్ కారు బెటరా?

దిల్లీలో గతం వారం జరిగిన ఆటో ఎక్స్‌పోలో వివిధ ఆటో మొబైల్ సంస్థలు ఆకట్టుకున్నాయి. స్టార్టప్‌ల నుంచి మొదలుకుని దిగ్గజ సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో కనువిందు చేశాయి. ఈ ఈవెంట్‌లో విన్‌ఫాస్ట్ సంస్థ ప్రదర్శించిన వీఎఫ్ 3 కారు, వాయ్‌వే సంస్థ నుంచి ఈవా కారు.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇందులో వాయ్‌వే ఈవా కారు.. దేశంలోనే మొదటి సోలార్ పవర్ కారు కాగా.. విన్ ఫాస్ట్ వీఎఫ్3 కారు చిన్న ఎలక్ట్రిక్ కారు. ఈ రెండు కార్లు ఒకదానికి ఒకటి పోటీ అనేటట్లుగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫీచర్లు, రేంజ్, తదితర విషయాలు తెలుసుకుందాం.

ముందుగా వీటి ధర విషయానికి వస్తే.. విన్‌ఫాస్ట్ వీఎఫ్ 3 కారు ధరను విన్‌ఫాస్ట్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ.10 లక్షలుగా ఉండనుందని అంచనా. ఇక వాయివే ఇవా కారు పూర్తిగా ఎలక్ట్రిక్ మైక్రో కారు అని చెప్పవచ్చు. దీన్ని పూర్తిగా అందుబాటు ధరలో ఉండేలా తీసుకురానున్నారు.

VinFast VF3 Vs Vayve Eva Cars Comparison

మరో వైపు వాయ్‌వే ఈవా కారు.. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో లేదా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయవచ్చు. దీంట్లోని బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ధర రూ.3.25 లక్షల నుంచి రూ.4.49 లక్షలుగా ఉండనుంది. బ్యాటరీ లేకుండా అయితే ఈ కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.99 లక్షల మధ్య ఉండనుంది. ఈ కారు నోవా, స్టెల్లా, వేగా వేరియంట్లలో అందుబాటులో ఉంది.

నిజానికి వీఎఫ్3, ఈవా మోడల్స్ రెండూ ఒకదానికొకటి ప్రత్యక్ష పోటీ కావనే చెప్పవచ్చు. సైజు విషయంలో ఈ రెండు వేర్వేరుగా ఉంటాయి. వీఎఫ్3 ఈవీ.. 240 మి.మీ.ల పొడవుతో, 479 మి.మీ.ల వెడల్పుతో ఉంటుంది. ఈవా మోడల్ కంటే ఇది 62 మి.మీ.ల ఎత్తుతో ఉంటుంది. అయితే... ఈవా వీల్‌బేస్ వీఎఫ్ 3 కంటే 25 మి.మీ.ల పొడవుతో ఉంటుంది.

వీఎఫ్3 కారులో 285 లీటర్ల బూట్‌స్పేస్ ఉంటుంది. ఇక ఈవా మోడల్‌లో 300 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ రెండు కార్లలో ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్స్ ఉంటాయి.

ఈవా కారులో మినీ ఫ్రిడ్జ్, ఆటో- డిమ్మింగ్ IRVM, వేరియస్ డ్రైవింగ్ మోడ్స్, గ్లాస్ రూఫ్ మేడ్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ వంటి అడిషనల్ ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. విన్‌ఫాస్ట్ వీఎఫ్3 కారులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంటాయి. ఇక ఈవా మోడల్‌లో సింగిల్ ఎయిర్ బ్యాగ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం(TPMS) ఉంటాయి.

Features VF3 Eva
LED headlights Halogen projector LED
Daytime running lights Yes Yes
Start/stop switch No Yes
IRVM Manual Auto
Multifunction steering No Yes
A glass roof No Yes
Cooled storage space No Yes
Driving modes No Eco, City, and Sport
Instrument cluster Integrated into infotainment Digital
Infotainment 10-inch Yes
Apple CarPlay / Android Auto Yes Yes
Speakers 2 4
USB Type-C 45W
Airbag Dual front airbags Driver's side
TPMS No Yes
Rearview camera No Yes
Rear parking sensors Yes Yes
Traction control Yes No
Hill start assist Yes No

పవర్ ట్రెయిన్, బ్యాటరీ కెపాసిటీ ఈ రెండు కార్లలో కూడా దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. వీఎఫ్3 కారు 18.64 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 210 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. ఇక వాయ్‌వే ఈవా కారు 18kWh బ్యాటరీతో ఉంటుంది. ఇది 250 కి.మీ.ల రేంజ్ అందిస్తుంది. దీంట్లో ఉండే సోలార్ పవర్ ద్వారా సంవత్సరానికి 3,000 కి.మీ.ల దూరం ప్రయాణించగలదని వాయ్‌వే సంస్థ చెబుతోంది.

వీటి పవర్ అవుట్‌పుట్స్ విభిన్నంగా ఉంటాయి. విన్‌ఫాస్ట్ వీఎఫ్ 3 మోడల్.. 44 PS పవర్, 110 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈవా మోడల్... 20 PS పవర్ 40 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు మోడళ్లు కూడా ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి.

ఏసీ ఛార్జర్‌తో 5 గంటల సమయం పడుతుంది. వీఎఫ్‌3 కారు... డీసీ ఛార్జర్‌తో 36 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుండగా.. ఈవా కారు 20 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది. వీఎఫ్‌3 భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. దీని ధర రూ.10 లక్షలుగా ఉండనుంది. ఇది ఎంజీ కోమెట్ ఈవీ, టాటా టియాగో ఈవీకి పోటీగా ఉండనుంది. ఇక ఈవా కారు ఇప్పటికే భారత మార్కట్లో అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2025, 7:20 [IST]
English summary
Vinfast vf3 vs vayve eva electric car range powertrain and price comparison details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+