పెట్రోల్ కార్లకు గుడ్‌బై.. మార్కెట్లోకి అదిరిపోయే ఈవీ కారు లాంచ్.. సింగిల్ ఛార్జ్ చాలు..

వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారత మార్కెట్‌లో తన పాదం మోపింది. శనివారం నాడు న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ఈ బ్రాండ్ తన తొలి వాహనాన్ని పరిచయం చేసింది. అది VF6 ఎలక్ట్రిక్ SUV. ఈ కొత్త SUVలో భవిష్యత్‌తరహా ఆధునిక డిజైన్ కనిపిస్తుంది. సాఫ్ట్ లైన్స్, స్పోర్టీ లుక్,ప్రత్యేకమైన స్టైల్ ఎలిమెంట్స్ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా నిలిపాయి. అంతేకాదు, సౌకర్యం, సేఫ్టీ, టెక్నాలజీని కలిపి వినియోగదారునికి ప్రీమియం అనుభూతిని ఇవ్వాలని విన్‌ఫాస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. VinFast VF6 మూడు వేరియంట్లలో ఎర్త్, విండ్, విండ్ ఇన్ఫినిటీలలో అందుబాటులో ఉంది. ఒక్కో వేరియంట్ ప్రత్యేక ఫీచర్లతో వస్తోంది.

ధర విషయానికి వస్తే, రూ. 16.49 లక్షల నుండి రూ. 18.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య నిర్ణయించారు. ఈ ధర పరిధి SUV మార్కెట్‌లో మంచి పోటీని సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం విన్‌ఫాస్ట్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు కేవలం రూ. 21,000 ముందస్తు చెల్లింపు ద్వారా తమ ఆర్డర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇది వినియోగదారుల కోసం సులభమైన, స్నేహపూర్వక ఆఫర్ అని చెప్పాలి.

Vinfast Vf6 Electric Car Launched In India Here Price And All Details

ఎర్త్ వేరియంట్ ధర కేవలం రూ.16.49 లక్షలు, విండ్ వేరియంట్ ధర రూ.17.79 లక్షలు, టాప్-ఎండ్ విండ్ ఇన్ఫినిటీ వేరియంట్ ధర రూ.18.29 లక్షలుగా నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ముఖ్యంగా ఇవి ప్రస్తుతం పరిచయ ధరలు మాత్రమే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ SUV ధరలు పెరగవచ్చని కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి. విన్‌ఫాస్ట్ VF6లో ఒకే ఒక 59.6 kWh బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నారు.

విన్‌ఫాస్ట్ VF6 ఎలక్ట్రిక్ SUVలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటారు శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. ఇది గరిష్టంగా 204 BHP హార్స్‌పవర్, 310 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి కారణంగా, VF6 కేవలం 8.89 సెకన్లలోనే 0 నుండి 100 kmph వేగాన్ని అందుకోవడం ప్రత్యేకత. అంటే, ఇది కేవలం ఎలక్ట్రిక్ SUV మాత్రమే కాదు, స్పోర్టీ పనితీరు కూడా కలిగిన మోడల్ అని చెప్పొచ్చు.

Vinfast Vf6 Electric Car Launched In India Here Price And All Details

SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 488 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది రోజువారీ వినియోగం మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా సరిపడేలా రూపొందించబడింది. VF6 ఎలక్ట్రిక్ SUV కేవలం డిజైన్ పరంగానే కాదు, ఫీచర్ల పరంగానూ అత్యాధునిక సాంకేతికతను ప్రతిబింబిస్తోంది. ఈ SUVలో 5 సీట్ల సీటింగ్ అమరికను అందించారు, అందువల్ల ఇది కుటుంబ వినియోగానికి కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

ఫీచర్ల విషయానికొస్తే, VF6లో లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)ని అందించారు. ఇవి డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చుతాయి. అదనంగా, డ్యూయల్-జోన్ AC, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వాహనం లోపల లగ్జరీ ఫీలింగ్‌ను కలిగిస్తాయి. కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, హెడ్స్-అప్ డిస్ప్లే, ఫుల్ LED లైటింగ్ SUVని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి.

Vinfast Vf6 Electric Car Launched In India Here Price And All Details

ఇన్ఫోటైన్‌మెంట్ పరంగా, VF6లో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేను అందించారు. ఇది డ్రైవర్ వైపు కొద్దిగా తిరిగినట్లు (ఓరియెంటెడ్) ఉండేలా డిజైన్ చేయబడింది, తద్వారా డ్రైవర్‌కి సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, సాధారణంగా అన్ని కార్లలో కనిపించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ SUVలో లేదు. దాని బదులుగా, డ్రైవర్ హెడ్స్-అప్ డిస్ప్లే (HUD) ద్వారా అన్ని ముఖ్యమైన సమాచారాన్ని పొందగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, September 6, 2025, 16:02 [IST]
English summary
Vinfast vf6 electric car launched in india here price and all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+