ఇంత స్టైలిష్ EV చూశారా? రూ.21వేలతో బుకింగ్ ఓపెన్! మూడు వేరియంట్లు, ఆరు కలర్స్
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారత ఎలక్ట్రిక్ వాహన రంగంపై తన దృష్టిని మరింతగా కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లలో తన స్థానం సాధించిన ఈ బ్రాండ్, ఇప్పుడు భారతదేశంలో తన తొలి అడుగులు వేయబోతోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసిన కంపెనీ, భారత మార్కెట్‌ను ఒక కీలక అవకాశంగా చూస్తూ దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో, ఈ ఆగస్టులో భారత్‌లో రిలీజ్ కావాల్సిన రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి VinFast VF7. ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా VF6, VF7 మోడళ్లకు రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి.
ఇక ఇప్పుడు VF7 గురించి మరింత విస్తృత సమాచారం కూడా విడుదలైంది. దాని వేరియంట్ల నిర్మాణం,కలర్స్, ముఖ్య ఫీచర్లపై పూర్తి వివరణను అందిస్తూ, వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతోంది. VF7 గురించి మాట్లాడితే, ఇది ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా రూపుదిద్దుకుంది. శక్తివంతమైన పవర్‌ట్రెయిన్, అద్భుతమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన కలర్స్ ఆప్షన్లతో ఈ SUV ప్రీమియం అనుభూతిని కలిగించేలా ఉండనుంది.

తాజాగా కంపెనీ విన్‌ఫాస్ట్ VF7కు సంబంధించిన వేరియంట్లు, కలర్స్ గురించిన వివరాలను వెల్లడించింది. VF7 మూడు వేరియంట్లలో ఎర్త్ (Earth), విండ్ (Wind), స్కై(Sky) అందుబాటులోకి రానుంది. ప్రతి వేరియంట్ తనకు ప్రత్యేకమైన ఫీచర్లు, పనితీరు, డ్రైవింగ్ డైనమిక్స్‌ను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఎర్త్ వేరియంట్ ఎంట్రీ లెవల్‌గా ఉండే అవకాశం ఉండగా, స్కై వేరియంట్‌లో అధునాతన టెక్నాలజీ, ఎక్కువ రేంజ్ లేదా శక్తివంతమైన మోటార్ ఉండే అవకాశం ఉంటుంది.
వేరియంట్ ఎంపికతో పాటు, కలర్స్ ఎంపికలో కూడా వినియోగదారులకు 6 స్టైలిష్ ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. ఇది జెట్ బ్లాక్(Jet Black), డిట్టో సిల్వర్(Ditto Silver), ఇన్ఫినిటీ బ్లాక్(Infinity Black), క్రిమ్సన్ రెడ్(Crimson Red), జెనిత్ గ్రే (Zenith Grey), అర్బన్ మింట్ (Urban Mint)లలో కొనుగోలు చేయబడుతుంది. ఈ కలర్స్ ఆధునికతకు చిహ్నంగా నిలుస్తాయి. వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని, వేరియంట్‌లు, కలర్స్ వంటి అంశాల్లో విస్తృత ఎంపికలు అందిస్తోంది.

విన్‌ఫాస్ట్ VF7 డిజైన్ పరంగా చూస్తే, ముందు భాగంలో V-ఆకారపు లోగో ప్రత్యేక ఆకర్షణ. ఇది విన్‌ఫాస్ట్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు కలిగిస్తుంది. దానికి ఇరువైపులా హై-టెక్ LED DRLs(డే టైమ్ రన్నింగ్ లైట్స్) ఉన్నాయి. కూపే స్టైల్ సిలుయెట్ వలన, VF7 కి స్పోర్టీ ప్రెజెన్స్ కలుగుతుంది. ఇంటీరియర్‌లో 15 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉండొచ్చు.
ప్రస్తుతం ఇండియా VF7 పవర్‌ట్రెయిన్ వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అయితే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న VF7 వెర్షన్‌ను బేస్ చేసుకుంటే, కొన్ని కీలక వివరాలు మనం ఊహించవచ్చు. ఇది 75.3 kWh లిథియ-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 450 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం ఉంది. మరో విషయం ఏమిటంటే ఈ కారును తమిళనాడులోని తూత్తుకుడిలో నిర్మించబోయే విన్‌ఫాస్ట్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేయనున్నారు.

స్థానికంగా తయారవ్వడం వలన ధరలు పోటీగా ఉండే అవకాశం ఉంది. Make in India ప్రోగ్రాంలో భాగంగా విన్‌ఫాస్ట్ కంపెనీకి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహాలు లభించే అవకాశం ఉంది. VF7 ఫ్యూచర్-రెడీ లుక్‌తో పాటు ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఒక్కసారి చూసినవాళ్లు తిరిగి మళ్లీ చూచేలా చేసే డిజైన్, లగ్జరీగా డ్రైవ్ చేసేలా చేసే ఇంటీరియర్.. ఇవన్నీ VF7ని ఈవీ మార్కెట్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టే అంశాలు.


Click it and Unblock the Notifications








