లారీపై కారును చూసి ఆశ్చర్యపోయిన రోడ్డు మీద ఉన్న జనాలు! దేశాలు దాటిన కారుకు ఇండియాలో ఊరేగింపు!

వియత్నాంకు చెందిన ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ (vinfast) అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌‌లో కూడా తన సత్తాను చాటడానికి సిద్ధమైంది. మన దేశంలో మారుతీ సుజుకీ అంటే ఏ మేరకు ప్రసిద్ధ కంపెనీగా ఉందో అదే విధంగా వియత్నాంలో విన్‌ఫాస్ట్‌కి అదే రేంజ్‌లో పేరుంది. ఇది కార్లు, వ్యాన్లు మాత్రమే కాదు టూవీలర్స్‌ను కూడా విక్రయిస్తుంది. ఈ భారీ ఆటోమొబైల్ సంస్థ తన దృష్టిని ప్రపంచపు అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారతదేశంపై సారించింది. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025 ఈ దిశగా మొదటి బలమైన అడుగుగా నిలిచింది. ఈ ప్రదర్శన వేదికగా, విన్‌ఫాస్ట్‌ భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

ఈ ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పలు మోడళ్లను కూడా ప్రదర్శించారు. ఈ వాహనాలు డిజైన్‌, టెక్నాలజీ, ప్రదర్శనలో ఆధునికతను ప్రతిబింబించడమే కాకుండా, భారత రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయని చెప్పొచ్చు. వీటి ద్వారా భారత దేశమంతటా విస్తరించి విన్‌ఫాస్ట్‌ ఇక్కడ కూడా ఆర్ధిక శక్తిగా ఎదగాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో మొదట అత్యంత కీలక పాత్ర పోషించనున్న VF7ను విడుదల చేయనుంది.

Vinfast Vf7 Electric Car

ఇది ఒక పెద్ద ఎలక్ట్రిక్ SUV, అంతేకాదు భారతదేశంలో విడుదల కానున్న విన్‌ఫాస్ట్ వాహనాల్లో ముందస్తుగా కనిపించబోతున్నది కూడా ఇదే. VF7ని విన్‌ఫాస్ట్ బ్రాండ్‌కు భారత మార్కెట్‌లో కీలకంగా భావించవచ్చు, ఒక రకంగా చెప్పాలంటే, ఇది భారత రోడ్డుపైకి రానున్న విన్‌ఫాస్ట్‌ తొలి కారు. ఇటీవల ముంబై వీధుల్లో, ఒక ట్రక్కులో రవాణా అవుతున్న VF7 కెమెరాకు చిక్కింది. ఆశ్చర్యకరంగా, ఇది ఎలాంటి కవర్లు లేకుండా, పూర్తిగా ఓపెన్‌గా కనిపించింది.

వాస్తవానికి, ఇది విన్‌ఫాస్ట్‌ సంస్థ భారతదేశంలో ఏర్పాటు చేసుకునే డీలర్ నెట్‌వర్క్ కోసం ప్రదర్శన కోసం తెచ్చే అవకాశం ఉంది. లేదా, ఇంకొంతమంది అంచనా వేసినట్లు, రోడ్డుపై పనితీరు వంటి అంశాలపై లోతైన పరిశోధన కోసం తీసుకువచ్చి ఉండవచ్చు. VF7 డిజైన్‌ లేటెస్ట్‌గా కనిపిస్తుంది. దాని మెరిసే బాడీ, ఆకర్షణీయమైన లైన్‌లుచ ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన సాంకేతికతతో, ఇది మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న కార్లతో పోటీ పడగలిగే స్థాయిలో ఉంది.

Vinfast Vf7 Electric Car Spotted

ఈ కారు ద్వారా విన్‌ఫాస్ట్ భారత వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటుందా లేదా అన్నది సమయం చెప్పాలి. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోనే ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ, VF7 కార్లు ఇప్పటివరకు పూర్తిగా వియత్నాం నుంచే దిగుమతి అవుతున్నాయి. దీనివల్ల, వాహన నిర్మాణ ప్రమాణాలలో ఎటువంటి రాజీ పడకుండా, సంస్థ తన అత్యుత్తమ టెక్నాలజీని నేరుగా భారత వినియోగదారులకు పరిచయం చేయాలని చూస్తుంది.

ఈ మధ్యే ముంబై వీధుల్లో కనిపించిన VF7, తన జెట్ బ్లాక్ వర్ణంలో మెరిసిపోతూ అందరి దృష్టిని ఆకర్షించింది. విన్‌ఫాస్ట్‌ ప్రచార సామగ్రిలో కూడా ఈ గాఢ నలుపు రంగును ప్రముఖంగా వినియోగిస్తుండటం, దీనిని ఒక సొగసైన, శక్తివంతమైన ఐకాన్‌లా చూపించాలనే లక్ష్యంతోనే కావచ్చు. అయితే, VF7కి ఇది మాత్రమే కాదు, బ్రాహ్మినీ వైట్, క్రిమ్సన్ రెడ్, నెప్ట్యూన్ గ్రే వంటి మరెన్నో రంగుల ఎంపికలు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.

Vf7 Electric Car Spotted In Mumbai

ఇవన్నీ భారత వినియోగదారుల వివిధ రుచులను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డాయి. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కారుకు 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, గుడ్‌ ఇయర్ ఈగిల్ F1 తక్కువ ప్రొఫైల్ టైర్లు అమర్చినదిగా కనిపించగా, ప్రస్తుతం ముంబై వీధుల్లో దర్శనమిచ్చిన VF7లో 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు అపోలో ఆస్పైర్ టైర్లు అమర్చబడ్డాయి.

More from DriveSpark

Article Published On: Sunday, June 1, 2025, 7:30 [IST]
English summary
Vinfast vf7 electric car spotted in mumbai more details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+