మరీ ఇంత పిచ్చా.. టాటా పంచ్ డెలివరీలో కొత్త ట్విస్ట్..కారు కంటే ఈమె బ్లౌజ్ కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి

కొత్త కారు కొంటే ఆ సంతోషమే వేరు. ఇంటికి కొత్త అతిథి వస్తున్నట్లుగా అందరూ పండగ చేసుకుంటారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఒక జంట తమ కొత్త టాటా పంచ్ (Tata Punch) కారును డెలివరీ తీసుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కారు కంటే కూడా ఆ కారు యజమానురాలు కట్టుకున్న స్పెషల్ బ్లౌజ్ నెటిజన్ల మనసు దోచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

వైరల్ అవుతున్న స్పెషల్ అవుట్‌ఫిట్
అవినాష్ రూప్నూర్, ఆయన భార్య రియా అవినాష్ తమ కొత్త టాటా పంచ్ కారును డెలివరీ తీసుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ఇందులో రియా కట్టుకున్న చీర, వేసుకున్న బ్లౌజ్ హైలైట్‌గా నిలిచాయి. కారు రంగు డేటోనా గ్రేకి మ్యాచ్ అయ్యేలా ఆమె చీరను ఎంచుకున్నారు.

Viral Tata Punch Delivery Womans Unique PUNCH Embroidered Blouse and Tata Logo Saree

ఆ చీర బోర్డర్ అంతా టాటా లోగోతో డిజైన్ చేసి ఉండటం విశేషం. ఇక ఆమె బ్లౌజ్ వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో PUNCH అని ఎంబ్రాయిడరీ చేయించి ఉంది. టాటా మోటార్స్ పై తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి ఈ జంట ఇలా వెరైటీగా ప్లాన్ చేశారు.

నెటిజన్ల ఫిదా.. 2 మిలియన్ల వ్యూస్
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే 2.1 మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. కారు పంచ్.. బ్లౌజ్ కూడా పంచ్ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. టాటా పంచ్ అంటే సామాన్యుల గుండె చప్పుడు అని, ఒక కారుపై ఇంతటి ప్రేమను చూపించడం గ్రేట్ అని కొనియాడుతున్నారు.

Viral Tata Punch Delivery Womans Unique PUNCH Embroidered Blouse and Tata Logo Saree

కారుకు హారతి ఇచ్చి, పూజలు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కేవలం కారు కొనడమే కాకుండా, దానికి తగినట్లుగా డ్రెస్ డిజైన్ చేసుకోవడం ఈ డెలివరీని స్పెషల్ గా మార్చింది.

మార్కెట్లో టాటా పంచ్ హవా
ప్రస్తుతం టాటా మోటార్స్ విక్రయాల్లో టాటా పంచ్ రెండో స్థానంలో ఉంది. సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ ఉండటం, బడ్జెట్ ధరలో ఎస్‌యూవీ లుక్ రావడంతో మధ్యతరగతి కుటుంబాలు ఈ కారును తెగ కొంటున్నారు.

Viral Tata Punch Delivery Womans Unique PUNCH Embroidered Blouse and Tata Logo Saree

2021లో లాంచ్ అయిన ఈ కారు ఇప్పటివరకు 6 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని దాటింది. పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంది. 2024లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా ఇది రికార్డు సృష్టించింది.

రాబోతున్న కొత్త ఫేస్‌లిఫ్ట్
టాటా పంచ్ క్రేజ్ ఇలాగే కొనసాగించడానికి కంపెనీ ఇప్పుడు దీని ఫేస్‌లిఫ్ట్ (2026 మోడల్) వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ కేరళలోని మూన్నార్ వంటి ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. కొత్త డిజైన్, మరిన్ని మోడరన్ ఫీచర్లతో ఈ కారు రాబోతోంది.

ప్రస్తుతం దీని ధర రూ.5.49 లక్షల నుంచి రూ.8.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వస్తే మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే వస్తుందని కంపెనీ చెబుతోంది.

More from DriveSpark

Article Published On: Monday, December 29, 2025, 16:31 [IST]
English summary
Viral tata punch delivery womans unique punch embroidered blouse and tata logo saree
Read more on: #tata motors #showroom #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+