మారుతి వ్యాగన్ఆర్ EV లాంచ్ అయ్యే సమయం ఆసన్నమైంది! 270 కి.మీ రేంజ్‌తో షాక్ ఇవ్వనుందా?
మారుతి సుజుకి మాతృసంస్థ అయిన సుజుకి మోటార్ కార్పొరేషన్ ఈసారి భారీ సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 29 నుండి ప్రారంభమయ్యే జపాన్ మొబిలిటీ షోలో ఈ సంస్థ తన తాజా ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ ప్రదర్శనలో సుజుకి పలు కొత్త కాన్సెప్ట్ కార్లు, భవిష్యత్‌కి అనుగుణంగా రూపుదిద్దుకున్న మోడళ్లను ఆవిష్కరించనుంది. ఇప్పటికే కంపెనీ ఈ షో కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది, దాంతో ఆటోమొబైల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సారి సుజుకి స్టాల్ వద్ద ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నది విజన్ ఇ-స్కై కాన్సెప్ట్ కారు. ఇది సుజుకి అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కీలకమైన హ్యాచ్‌బ్యాక్‌గా భావించబడుతోంది. వాస్తవానికి, విజన్ ఇ-స్కై మోడల్‌ను చాలా మంది వ్యాగన్‌ఆర్ EVగా పిలుస్తున్నారు.
అంటే, మనం ఇప్పటికే పరిచయం ఉన్న వ్యాగన్‌ఆర్ డిజైన్ ఆధారంగా రూపొందించిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్ అని చెప్పొచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఫోటోలను పరిశీలిస్తే, విజన్ ఇ-స్కై ఎక్స్‌టీరియర్ వ్యాగన్‌ఆర్ మోడల్‌కి చాలా దగ్గరగా కనిపిస్తుంది. అయితే, దీని డిజైన్ మరింత స్మూతుగా, ఆధునిక లైట్ సిగ్నేచర్లు, ఎయిరోడైనమిక్ బాడీ షేప్‌తో కొత్త లుక్‌ను అందిస్తుంది. ఈ కారు పూర్తి ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకుంటున్నదని సమాచారం.

కొత్త సుజుకి విజన్ ఇ-స్కై కాన్సెప్ట్ హ్యాచ్‌బ్యాక్ రూపకల్పనలోనే భవిష్యత్ టచ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీని ముందు భాగంలో సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన C-ఆకారపు LED DRLలు, అలాగే వెనుక భాగంలో ప్రత్యేకమైన టెయిల్‌లైట్ సిగ్నేచర్ ఈ కారుకు భిన్నమైన ప్రెజెన్స్ ఇస్తాయి. వెడల్పాటి విండ్షీల్డ్, ఫ్లాట్ బంపర్ డిజైన్, అలాగే స్పాయిలర్-మౌంటెడ్ స్టాప్ లైట్‌లు దీని స్పోర్టీ లుక్‌ను మరింత బలపరుస్తాయి.
పర్ఫార్మెన్స్ పరంగా కూడా విజన్ ఇ-స్కై ప్రత్యేకతను సాధించనుంది. ఈ మోడల్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు లభిస్తాయని సమాచారం, మొదటిది 20 kWh, 25 kWh. వీటిలో ఏదైనా పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సుమారు 270 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా. ఇది నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా తగిన సామర్థ్యం కలిగిన కాంపాక్ట్ EV అవుతుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, సుజుకి ఈ కాన్సెప్ట్ కారును పూర్తి ఆధునిక టచ్‌తో తీర్చిదిద్దింది. ఇందులో 12-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త డిజైన్‌లో 3-స్పోక్ స్టీరింగ్ వీల్, అలాగే ఆకర్షణీయమైన యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల కోసం విస్తృత స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్ అమరికతో ఇది 5 సీటర్ కారు.
దీని వల్ల నగర ప్రయాణాలతో పాటు లాంగ్ ట్రిప్‌లకూ సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు. పరిమాణ పరంగా సాధారణ హ్యాచ్‌బ్యాక్‌ల కంటే పెద్దదిగా ఉంటుంది. దీని పొడవు 3,395 మిల్లీమీటర్లు, వెడల్పు 1,475 మిల్లీమీటర్లు, ఎత్తు 1,625 మిల్లీమీటర్లు. ఈ డైమెన్షన్‌లు సొగసైన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారుగా నిలబెడతాయి. మొత్తానికి, సుజుకి విజన్ ఇ-స్కై కేవలం కాన్సెప్ట్ కారు మాత్రమే కాకుండా, సుజుకి భవిష్యత్ ఎలక్ట్రిక్ లైన్‌ప్‌కి ఒక ప్రతీకగా నిలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియా మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి వ్యాగన్ఆర్ గురించి చూసినట్లయితే, దీని ధర రూ.4.99 లక్షల నుండి రూ.6.95 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. కొత్త వ్యాగన్ఆర్ శక్తివంతమైన పెట్రోల్, సిఎన్జి ఇంజిన్ తో వస్తుంది. ఇది లీటరుకు 23 నుండి 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








