పెట్రోల్ భయం లేదు.. ఛార్జింగ్ బాధలేదు.. స్టార్ట్ చేసి ఈ కొత్త కారుతో దేశమంతా చుట్టేయొచ్చు

మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వైవ్ మొబిలిటీ అనే సోలార్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో తన సరికొత్త ఉత్పత్తి అయిన ఇవా కాంపాక్ట్ సోలార్ ఎలక్ట్రిక్ 2-సీటర్ కారును ప్రదర్శించింది. ఈ కారు ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ రద్దీ, లిమిటెడ్ పార్కింగ్ ప్లేస్, పెరుగుతున్న ఇంధన ధరల వంటి సమస్యలను పరిష్కరించేందుకు రూపొందించారు. ఈ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

వైవ్ ఇవా కారు ప్రారంభ ధర రూ. 3.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ పేర్కొంది. ఈ కారు వైవ్ ఇవా నోవా, వైవ్ ఇవా స్టెల్లా, వైవ్ ఇవా వేగా అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కో వేరియంట్‌కు ఒక్కో విధమైన ఫీచర్లు, బ్యాటరీ కెపాసిటీ ఉంటాయి.

Solar Electric Car Price

ఈ కారు మెయిన్ స్పెషాలిటీ ఏమిటంటే ఇది ఎలక్ట్రిక్ పవర్‌తో పాటు సోలార్ ప్యానెల్స్‌తో కూడా పనిచేస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీ ద్వారా మాత్రమే నడుస్తాయి.. కానీ వైవ్ ఇవాలో సోలార్ ప్యానెల్స్ ఉండడం వల్ల బ్యాటరీ ఛార్జ్ అయిపోయినపుడు సౌర శక్తిని ఉపయోగించి కొంత దూరం ప్రయాణించవచ్చు. ఇది కారు వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

వైవ్ ఇవా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీని హై-వోల్టేజ్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీ సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని కంపెనీ ధీమాగా చెబుతుంది. ఇది వినియోగదారులకు సమయాన్ని ఆదా చేస్తుంది.

Solar Electric Car Inner

వైవ్ ఇవా కారులో అనేక స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, వెహికల్ డయాగ్నస్టిక్స్, రిమోట్ మానిటరింగ్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు కారును ఉపయోగించడాన్ని మరింత సులభతరం చేస్తాయి.

వైవ్ ఇవా విశాలమైన డ్రైవర్ విజిబిలిటీని కలిగి ఉంది. ఇది కేవలం 5 సెకన్లలో 0 నుంచి 40కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 70కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మూడు వేరియంట్‌లలో వరుసగా 9 కిలోవాట్, 12.6 కిలోవాట్, 18 కిలోవాట్ల బ్యాటరీలు ఉన్నాయి.

Solar Electric Car Red

ఇంకా ఈ కారులో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో 2-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టార్ట్-స్టాప్ బటన్, 13 అంగుళాల స్టీల్ వీల్స్, LED హెడ్ లైట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

కొన్ని అదనపు ఫీచర్లు, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎయిర్ బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి వేరియంట్‌ను బట్టి అదనంగా ఉండవచ్చు. మరింత సమాచారం కోసం, వైవ్ మొబిలిటీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, March 30, 2025, 11:00 [IST]
English summary
Vive mobility unveils the eva compact solar electric 2 seater at india mobility expo 2025
Read more on: #solar car #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+