లగ్జరీ అంటే ఊరికే వస్తుందా.. డబ్బుంటే దునియా నీదే.. లేటెస్ట్ ఫీచర్లతో ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు!
లగ్జరీ ఫీచర్లతో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ విడుదలైంది. జర్మనీకి చెందిన ఈ నమ్మకమైన కార్ల తయారీ సంస్థ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. స్పోర్టీ డిజైన్, పవర్ ఫుల్ ఇంజిన్, లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ కారు ధర ఎంత? పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) ఒక నమ్మకమైన కార్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లో కూడా కంపెనీ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. వినియోగదారులు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా సరికొత్త టిగువాన్ ఆర్-లైన్ ఎస్‌యూవీని అట్టహాసంగా విడుదల చేశారు. ఈ కారు ధర, ప్రత్యేకతల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

కొత్త వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ (Volkswagen Tiguan R-Line) ఎస్‌యూవీ మరింత స్పోర్టియర్ డిజైన్‌ను కలిగి ఉంది. అగ్రెసివ్ బంపర్‌లు, ముందు భాగంలో (ఫ్రంట్) పెద్ద గ్రిల్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్‌ఎల్‌లు, 19-ఇంచుల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా వెనుక భాగంలో (రేర్) ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్‌లు, 'ఆర్-లైన్' బ్యాడ్జింగ్‌ను కలిగి ఉంది.
ఈ కారు పర్సిమన్ రెడ్ మెటాలిక్, సిప్రెసినో గ్రీన్ మెటాలిక్, నైట్‌షేడ్ బ్లూ మెటాలిక్, గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్‌తో సహా వివిధ ఆకర్షణీయమైన రంగులలో కూడా లభిస్తుంది. ఇది 4,539 మిమీ పొడవు, 1,859 మిమీ వెడల్పు, 1,656 మిమీ ఎత్తుతో 2,680 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్‌యూవీ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్ కలిగి ఉంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 201 బిహెచ్‌పి హార్స్‌పవర్‌ను, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిసిటి (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. లీటరుకు 12.58 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
కొత్త టిగువాన్ ఆర్-లైన్ కారు అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.3-ఇంచుల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, 3-జోన్ ఆటో ఎసి, 30-రంగుల యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌లను కలిగి ఉంది.

ఈ కారు సేఫ్టీకి కూడా పేరుగాంచింది. ప్రయాణికులకు మాగ్జిమన్ సేఫ్టీని అందిస్తుంది. 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎడిఎఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), టిపిఎమ్ఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, డిస్క్ బ్రేక్‌లు, ముందు (ఫ్రంట్) & వెనుక (రేర్) పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ ఎస్‌యూవీ ఖరీదైనది. దీని ధర రూ.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 5 సీట్ల ఆఫ్షన్లను కలిగి ఉంది, ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొని సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. వారాంతాల్లో, సెలవుల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి 652 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








