బడ్జెట్ రెడీ చేసుకోండి.. దేశంలో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కారు కోసం ప్రీ-బుకింగ్‌లు స్టార్ట్
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా ప్రసిద్ధ కార్లను విక్రయిస్తుంది. తాజాగా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త టిగువాన్ ఆర్-లైన్ (tiguan-r-line) కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ కారును ఇటీవల ఆవిష్కరించగా, ఇప్పుడు బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటిగా నిలవబోతోంది. ఈ మోడల్ భారతీయ కస్టమర్లకు ప్రీమియం పనితీరు, లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కారును బుకింగ్ చేసుకోవాలనుకునే వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అయిన ప్రీ-బుకింగ్‌లను చేసుకోవచ్చు. ఇదే కాకుండా, Golf GTI మోడల్ గురించి కూడా ఆసక్తిని సేకరించేందుకు ఫోక్స్‌వ్యాగన్ సర్వే ప్రారంభించింది.
ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ (tiguan-r-line) విషయానికి వస్తే, భారత కారు మార్కెట్‌లో ప్రీమియం పనితీరు, జర్మన్ ఇంజినీరింగ్ ఎక్సలెన్స్‌ను అందించే దిశగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కొత్త మైలురాయిగా ఈ కారును తీసుకొచ్చింది. ఇది కేవలం SUV మాత్రమే కాదు, స్పోర్టీ లుక్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్‌తో పెర్ఫార్మెన్స్ SUVలలో అగ్రస్థానంలో నిలిచే మోడల్. ఇది 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

204hp పవర్, 320Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ స్టైల్‌ను కొత్త లెవెల్‌కి తీసుకెళ్లే పవర్‌పుల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జోడించారు. ముఖ్యంగా ఈ కారు నాలుగు చక్రాలకు కూడా ఫోక్స్‌వ్యాగన్ 4Motion AWD సిస్టమ్ ద్వారా పవర్ అందుతుంది. దీంతో రోడ్లపై రయం మంటూ దూసుకుపోతుంది. ఇది కేవలం 7.1 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకుంటుంది.
దీని టాప్ స్పీడ్ వచ్చేసి 229kphగా ఉంది. కారు నైట్ షేడ్ బ్లూ మెటాలిక్, పెర్సిమోన్ రెడ్ మెటాలిక్, ఓరిక్స్ వైట్, సిప్రెస్సినో గ్రీన్ మెటాలిక్, నైట్ షేడ్ బ్లూ మెటాలిక్, మదర్ ఆఫ్ పెర్ల్ ఎఫెక్ట్, ఓరిక్స్ వైట్, ఓయిస్టర్ సిల్వర్ మెటాలిక్ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. టిగువాన్ ఆర్-లైన్ కొలతలను చూసినట్లయితే ఇది 4,539 మిమీ పొడవు, 1859 మిమీ వెడల్పుతో లభిస్తుంది.

అలాగే దీని ఎత్తు 1656 మిమీ, వీల్‌బేస్ 2680 మిమీగా ఉంది. భారతదేశం అంతటా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మీకు నచ్చిన కలర్ వేరియంట్‌ను కస్టమర్లు బుకింగ్ చేసుకోవడానికి కంపెనీ అవకాశం కల్పించింది. టిగువాన్ ఆర్-లైన్ ముందు భాగాన్ని చూస్తే, పెద్ద వెంట్లతో అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్ మస్కులర్ లుక్‌ను అందిస్తుంది. గ్లాస్ బ్లాక్ ఫాసియా దీని స్టైలింగ్‌కు మరింత అదనపు ఆకర్షణను జతచేస్తుంది.
ముందు, వెనుక ఉన్న LED లైట్ బార్‌లు రాత్రి వేళల్లో మరింత ఆకర్షణీయమైన లుక్‌ను ఇచ్చేలా డిజైన్ చేయబడ్డాయి. లోపలి భాగం లగ్జరీ, స్పోర్టీ ఫినిష్, అత్యాధునిక టెక్నాలజీ సమ్మేళనంగా రూపుదిద్దుకుంది. స్పోర్ట్స్ కార్ల నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఈ SUVని మరింత ప్రీమియంగా మారుస్తుంది. ఇది 10.3-అంగుళాల ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది, ఇది డ్రైవర్‌కు అవసరమైన మొత్తం సమాచారాన్ని స్పష్టంగా అందిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, మా కస్టమర్‌లు అంచనా వేస్తున్నదానికంటే ఎక్కువను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. భారతదేశంలో టిగువాన్ ఆర్-లైన్ కోసం వేచి ఉండటం దాదాపుగా ముగిసింది. ఈ ఏడాది మా అత్యంత ప్రసిద్ధ ఫోక్స్‌వ్యాగన్ మోడళ్లలో రెండుంటిని భారతదేశానికి పరిచయం చేస్తున్నాము. ఇది మా పురోగతి ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications








