మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. రెండు కొత్త హాట్ మోడళ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయ్

అంతర్జాతీయంగానే కాకుండా ఇండియాలో కార్ల తయారీలో ప్రసిద్ధి చెంది ఫోక్స్‌వ్యాగన్ (volkswagen) ఇప్పటికే పలు వాహనాలను విక్రయిస్తూ క్రమంగా తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. మరోసారి తమ హవాను కొనసాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన రెండు ప్రీమియం మోడళ్లను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. జర్మన్ కార్ల తయారీదారు ఇటీవల గోల్ఫ్ GTI,టిగువాన్ R-లైన్ మోడళ్లను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మోడళ్లను తన భారతీయ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేసింది. కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం, టిగువాన్ R-లైన్ కారును ఏప్రిల్ 14న లాంచ్ చేయనుండగా, గోల్ఫ్ GTI కోసం అధికారికంగా విడుదల చేసే తేదీని ఇంకా వెల్లడించలేదు. లాంచ్‌కు ముందుగా ఈ కార్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIని మొదటగా చూసినట్లయితే ఇది అంతర్జాతీయ మోడల్‌ను ప్రతిబింబించే స్పోర్టి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్, ముందు భాగంలో స్టైలిష్ LED లైట్లు, ఫ్రంట్ స్పోర్టీ బంపర్, నల్లటి హైలైట్‌లతో బాగా ఆకర్షించే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్‌పై క్లాసిక్ రెడ్ లైన్, GTI బ్యాడ్జ్ ఇవ్వడం ద్వారా దీని లుకింగ్ మరింత పెరిగింది.

Volkswagen New Cars Golf Gti And Tiguan R Line Will Launch In India

ఇది స్పోర్టీ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించే విధంగా ఉంది. గ్లోబల్ వెర్షన్‌లో చూసినట్లయితే గోల్ఫ్ GTI లో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 245 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జోడించారు. స్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌‌కు జోడించడి ఉంది.

గోల్ఫ్ GTI కారు కేవలం 5.9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇక దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 250 కి.మీగా ఉంది. ఇంత స్టైలిష్ లుక్‌తో పాటు పెర్ఫామెన్స్ పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIని పూర్తిగా అసెంబుల్ చేసిన కారు మోడల్‌గా దిగుమతి చేసుకుని అమ్మకానికి ఉంచాలని చూస్తోంది. మొదటి బ్యాచ్‌లో 250 యూనిట్లు ఉంటాయి.

Volkswagen New Cars Golf Gti

గోల్ఫ్ GTI ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. ఇది డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇది 12.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ AC,యాంబియంట్ లైటింగ్, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటిని కలిగి ఉంది. ఇది దేశంలో మినీ కూపర్ ఎస్ వంటి మోడళ్లకు బలమైన పోటీ ఇస్తుంది.

Take a Poll

మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ధర దాదాపు రూ. 50 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 261 bhp పవర్, 400 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 4Motion AWD సిస్టమ్, డైనమిక్ ఛాసిస్ కంట్రోల్(DCC) వంటి అధునాతన టెక్నాలజీనిని కలిగి ఉంది.

Volkswagen New CarTiguan R Line

ఈ కారులో కూడా కస్టమర్లను ఆకట్టుకునే డజన్ల కొద్ది ఫీచర్స్ ఉంటాయి. మల్టిపుల్ USB ఛార్జింగ్ పోర్ట్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వెనుక AC వెంట్‌, వర్ స్లైడింగ్, టిల్టింగ్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్పోర్ట్స్ సీట్లు మొదలగు అంశాలతో వస్తుంది. ఈ రెండు మోడళ్లు కూడా భారతదేశంలో ప్రీమియం కార్ మార్కెట్‌ను మరింత ఆకర్షిస్తాయని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 21, 2025, 15:10 [IST]
English summary
Volkswagen new cars golf gti and tiguan r line will be launch in india more details here
Read more on: #volkswagen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+