చిన్నదే కానీ శక్తివంతమైన బేబి ఎలక్ట్రిక్ కారు.. రోజువారీ ప్రయాణాలకు బెస్ట్.. గల్లీలోనూ రయ్‌మంటూ వెళ్లొచ్చు!

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ గతంలో కంటే భారీగా పుంజుకుంది. పలు ఈవీ తయారీదారులు హోరా హోరీగా మార్కెట్ వాటా కోసం పోటీ పడుతున్నారు. అన్ని కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా నిలవడానికి చాలా కాలంగా జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్‌వ్యాగన్ కృషి చేస్తుంది. ఇన్ని రోజులు సాంప్రదాయ ఇంధన కార్లను విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందుకే ఈ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. కంపెనీ త్వరలో ఒక కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆ మోడల్ పేరు ఐడి ఎవ్రీ1(id every1). దీన్ని తాజాగా ఫోక్స్‌వ్యాగన్ ఆవిష్కరించింది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ చూపరులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కలర్ విషయానికి వస్తే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది.

ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును వినియోగదారులకు అందుబాటు ధరలోనే తీసుకురావాలని కంపెనీ చూస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా ఫోక్స్‌వ్యాగన్ ఈ సరికొత్త డిజైన్ కలిగిన కారును ఆవిష్కరించింది. దీన్ని మొదటగా యూరప్‌ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది 2027లో లాంచ్ కావచ్చు, అంచనా ధర రూ. 18.95 లక్షలు (20,000 యూరోలు).

Volkswagen Electric Car Id Every1 Concept Launch

దీన్ని ఎవ్రీవన్ కొత్త మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ (MEB) ప్లాట్‌ఫామ్‌పై ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో నిర్మిస్తున్నారు. దీనిలో శక్తివంతమైన బ్యాటరీతో పాటు 95 HP పవర్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించవచ్చు. బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే ఏకంగా 250 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో చిన్న రోడ్లపై కూడా ఇది చాలా ఈజీగా ప్రయాణిస్తుంది. ఇండియాలో ప్రస్తుతం నగరీకరణ బాగా పెరిగిపోయింది.

పట్టణ ప్రాంతాలు బాగా విస్తరిస్తున్నాయి. దీంతో ఇలాంటి సమయంలో ఈ ఏరియాల్లో ఉండే పెద్ద రోడ్లపైనే కాకుండా గల్లీలో కూడా రయ్ మంటూ దూసుకుపోవడానికి ఫోక్స్‌వ్యాగన్ ఐడి ఎవ్రీ1(id every1) చాలా అనువుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగస్తులు, కాలేజ్‌లకు వెళ్లేవారికి, ఇతర రోజవారి పనులు పూర్తి చేసుకోవడానికి ఇది అత్యుత్తమైన ఆప్షన్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ కారుకు 19-అంగుళాల వీల్స్‌ ఆకర్షణగా ఉన్నాయి.

Volkswagen Id Every1

ఎక్స్‌టీరియర్‌లో ముందు భాగంలో వర్టికల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, బ్లాక్-అవుట్ ఫాక్స్ గ్రిల్, పెద్ద LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, AC వెంట్లు, టూ-స్పోక్ స్క్వేర్డ్-అవుట్ స్టీరింగ్ వీల్, నలుగురు ప్రయాణికులు కూర్చోవడానికి అనువుగా ఉండే మెత్తని కంఫర్ట్ సీట్లు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి 305-లీటర్ బూట్ స్పేస్ వంటివి ఉన్నాయి.

ఈ కారులో జీవితాంతం ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు, డిజిటల్ అప్‌గ్రేడ్‌లు వస్తాయి. ఇది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం తన దృష్టినంతా కూడా ఈవీలపై పెట్టింది. దీంతో ఇతర మోడళ్లను కూడా విడుదల చేయాలని ప్రణాళికలు చేసింది. 2027 నాటికి MEB ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన 4 కొత్త ఈవీలతో సహా 9 మోడళ్లను విడుదల చేయాలని చూస్తుంది.

Volkswagen Electric Car Id Every1 Design

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 12, 2025, 17:24 [IST]
English summary
Volkswagen new electric car id every1 concept model revealed design and range
Read more on: #volkswagen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+