కొత్త కారు కొనాలనుకునే వారికి లక్కీ ఛాన్స్.. ఏకంగా రూ.4.20 లక్షల తగ్గింపు ఇస్తోన్న కంపెనీ
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్(Volkswagen) అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మోడళ్లను విడుదల చేస్తూ మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. ఇతర దేశాల్లోనే కాకుండా భారత్‌లో కూడా ఈ కంపెనీ కార్లు ఎక్కువగా కనిపిస్తాయి. పోలో అనే సూపర్‌మినీ కారును విడుదల చేసి ఆటోమొబైల్ పరిశ్రమలో అతిపెద్ద సంచలనం సృష్టించి రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. ఫోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన టైగన్ (Taigun), వర్టస్ (Virtus) మోడళ్ల ద్వారా తన మార్కెట్‌ను దేశీయంగా నిలుపుకుని ఇతర కార్ల తయారీదారులకు పోటీగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో 2024 ఏడాదిలో మెరుగైన అమ్మకాలను సాధించిన ఫోక్స్‌వ్యాగన్ 2025లో కూడా మెరుగైన అమ్మకాలను సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంంది. అందులో భాగంగా పలు కొత్త మోడళ్లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిపై తగ్గింపు ఆఫర్స్ అందిస్తుంది.
కొత్త ఏడాది ప్రారంభంలో తన అమ్మకాలను మరింత పెంచడానికి కంపెనీ ఫిబ్రవరి నెలలో తన కార్లపై దాదాపు రూ. 4.20 లక్షల విలువైన ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మోడల్ బట్టి మారుతుంది. తగ్గింపు ఆఫర్ ఈ నెల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇది నెలవారి ఆఫర్. ఎంచుకున్న కారును బట్టి లాయల్టీ బోనస్‌లు, క్యాష్ తగ్గింపులు, స్క్రాపేజ్ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు వంటి ప్రయోజనాలు ఉంటాయి.

ఈ తగ్గింపు అనేది 2024 మోడళ్లతో పాటు, 2025 మోడళ్లపై కూడా ఉంది. అయితే గత ఏడాది వాటికి ఎక్కువ తగ్గింపు ఉంటుంది, అదే ప్రస్తుత మోడళ్లకు కొంచె తగ్గింపు ఉంది. కంపెనీ 2024 ఏడాదిలో అమ్ముడుపోకుండా మిగిలిన వర్టస్ (Virtus),టైగన్ (Taigun), టిగువాన్ (Tiguan) సెడాన్ కార్లపై తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారికి ఇది చాలా మంచి అవకాశం.
సాధారణ రోజుల్లో ఎక్కువ ధర పెట్టి కారును కొనుగోలు చేయడం కంటే తక్కువ ధరలో లభించినప్పుడు సొంతం చేసుకోవడం చాలా ఉత్తమం. దీని వలన భారీగా డబ్బులు ఆదా అవుతాయి. ఇక ఆఫర్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Virtus) కొనుగోలు చేసే వారికి కంపెనీ రూ.1.70 లక్షల విలువైన తగ్గింపు ప్రయెజనాలను అందిస్తుంది. అయితే ఇది 2024 మోడళ్లకు వర్తిస్తుంది, అదే 2025 మోడళ్లకు రూ.80,000 తగ్గింపు ఉంటుంది.

ప్రస్తుతం దేశీయంగా వర్టస్ ధర రూ. 11.50 లక్షల నుంచి రూ. 19.39 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర, ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన మరో ముఖ్యమైన కారు టైగన్‌పై దాదాపు రూ.2.20 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇంత భారీ తగ్గింపు 2024 వెర్షన్లపై మాత్రమే ఉంది. అదే 2025 మోడళ్లపై రూ.80 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
టైగన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 11.70 లక్షల నుండి ఉంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఏకంగా రూ.19.73 లక్షల వరకు ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. మరో మోడల్ టిగువాన్‌పై అత్యధికంగా రూ.4.20 లక్షల విలువైన తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో క్యాష్ తగ్గింపులు, లాయల్టీ బోనస్‌లు, స్క్రాపేజ్ బోనస్‌లు వంటి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే ఇక్కడ అందరు గమనించాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించిన తగ్గింపు ఆఫర్స్ అనేవి నగరాలను బట్టి మారుతాయి. కాబట్టి ఈ కంపెనీ ఇచ్చే పూర్తి ఆఫర్స్ గురించిన వివరాల కోసం మీ దగ్గరలోని డీలర్స్‌ను, షోరూమ్ సిబ్బందిని సంప్రదించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications








