తయారు చేసేటప్పుడే చూసుకోవాలిగా.. మళ్లీ ఇప్పుడు ప్రాబ్లం అంటూ ఫోక్స్ వ్యాగన్ టైగూన్, వెర్టిస్ కార్లు రీకాల్!
పోలో, వెంటో వంటి మోడల్స్ నిలిచిపోవడంతో భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కథ ముగిసిందని చాలామంది అనుకున్నారు. అయితే స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కలిసి ప్రారంభించిన టైగూన్, వెర్టిస్ మోడళ్లు కంపెనీకి మళ్లీ మంచి ఊపునిచ్చాయి. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లు పోలో కంటే ఎక్కువ డిమాండ్‌తో దూసుకుపోతున్నాయి.
అయితే తాజాగా ఈ కార్లలో చిన్నపాటి తయారీ లోపం వెలుగులోకి వచ్చింది. నిన్న స్కోడా కార్లలో వచ్చినట్టుగానే సీటు బెల్ట్ సమస్య ఇప్పుడు ఫోక్స్వ్యాగన్లోని ఈ రెండు కార్లను కూడా వెంటాడుతోంది. 2024 మే 24 నుంచి 2025 ఏప్రిల్ 1 మధ్య తయారైన టైగూన్, వెర్టిస్ కార్లను కంపెనీ వెనక్కి పిలుస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ మొత్తం 21,513 వాహనాలను రీకాల్ చేస్తోంది. క్వాలిటీ కంట్రోల్ ప్రక్రియలో గుర్తించిన వెనుక సీటు బెల్ట్‌లోని లోపమే దీనికి కారణం. వెనుక ప్రయాణికుల సీటు బెల్ట్‌లో సమస్య ఉందని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. ప్రమాదం లేదా ముందువైపు నుండి ఢీకొన్న సందర్భంలో వెనుక సీటు బెల్ట్ బకిల్ లాచ్ ప్లేట్ విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇలాంటి పరిస్థితిలో ప్రయాణికుల సేఫ్టీకు ముప్పు వాటిల్లవచ్చని గుర్తించిన జర్మన్ కార్ల తయారీ సంస్థ టైగూన్, వెర్టిస్ మోడళ్లను వెనక్కి పిలుస్తోంది. 2024 మే 24 నుండి 2025 ఏప్రిల్ 1 మధ్య తయారైన ఫోక్స్‌వ్యాగన్ కార్లను ఉపయోగిస్తున్న వారికి కంపెనీ అధీకృత డీలర్‌షిప్ లేదా సర్వీస్ సెంటర్ నుంచి సమాచారం అందుతుంది.

ఈ విషయంపై ఏమైనా సందేహాలు లేదా ఆందోళనలు ఉంటే టైగూన్, వెర్టిస్ యజమానులు వారి సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఈ సమస్య ఉన్న కార్లను ఫోక్స్‌వ్యాగన్ ఉచితంగా రిపేర్ చేసి ఇస్తుండడం గమనార్హం. టైగూన్, వెర్టిస్‌లోని లోపభూయిష్ట యూనిట్లు ప్రస్తుత స్థితిలో సురక్షితంగా నడపగలరా లేదా అని ఫోక్స్‌వ్యాగన్ ఇంకా స్పష్టంగా చెప్పలేదు.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఫోక్స్‌వ్యాగన్ వెర్టిస్, టైగూన్ దేశంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచాయి. ఈ రెండు కార్లలోనూ స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ధర రూ.11.80 లక్షల నుంచి రూ.19.83 లక్షల వరకు ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, ఎంజి ఆస్టర్ వంటి దేశీయ మిడ్-సైజ్ SUVలతో పోటీపడుతుంది. వెర్టిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.56 లక్షల నుంచి రూ.19.40 లక్షల వరకు ఉంటుంది. ఇది హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, హోండా సిటీ వంటి సెడాన్ కార్లతో పోటీపడుతుంది.
ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ తమ మోడల్ శ్రేణిని విస్తరించే భాగంగా టిగువాన్ R-లైన్ ప్రీమియం SUVని కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధర కలిగిన ఈ మోడల్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విదేశాల్లో తయారై దిగుమతి చేసుకున్న ఈ టిగువాన్ బ్రాండ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా స్థానం సంపాదించింది.
సాధారణ టిగువాన్‌తో పోలిస్తే అనేక కాస్మెటిక్ మార్పులతో వస్తున్న టిగువాన్ R-లైన్, MQB Evo ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. 2.0 లీటర్, టీవీఎస్ EVO పెట్రోల్ ఇంజన్ ఈ ప్రీమియం SUVకి పవర్ అందిస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (4Motion)తో రాబోతున్న ఈ వాహనం ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో 201 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








