5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కారుపై రూ.1.43 లక్షల తగ్గింపు! కొత్తగా కారు కొనాలంటే ఇదే సరైన సమయం

భారతీయులకు బాగా ఇష్టమైన కార్ల తయారీ కంపెనీల్లో ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కూడా ఒకటి. గతంలో ఈ కంపెనీ కార్ల మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయం గట్టిగా ఉండేది. అధిక నిర్వహణ ఖర్చులతో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్రాండ్, ఇప్పుడు తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకుంటూ భారత మార్కెట్లో మళ్లీ నమ్మకాన్ని పొందుతోంది. ఇండియా 2.0 వ్యూహం కింద ప్రవేశపెట్టిన మోడల్స్ పట్ల వినియోగదారులలో మంచి స్పందన తెచ్చుకుంది. ఆర్కిటెక్చర్ నుండి ఫీచర్ల వరకు అన్నీ భారతీయ రోడ్లపై అనుకూలమైన డ్రైవింగ్ అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా , 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌లు, అధునాతన టెక్నాలజీతో కలిపి ఈ కార్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టైగన్ (Taigun) SUV మరోసారి చర్చల్లో నిలిచింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్ ప్రవేశపెట్టిన ఈ మోడల్‌కు విశేష ఆదరణ లభించింది. తాజాగా, ఈ మోడల్ ధరలో కొన్ని స్వల్ప మార్పులు చేసినట్లు సమాచారం. కార్‌వాలేలో వచ్చిన దాని ప్రకారం, ధరలో జరిగిన సర్దుబాటు ఖచ్చితంగా కొత్త కొనుగోలుదారులకు ఉపయోగపడనుంది. దీంతో టైగన్ మరింతమంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

Volkswagen Taigun Prices Dropped Up To Rs 1 43 Lak

టైగన్ వేరియంట్లలో కొన్ని మోడల్స్ ధరలు తగ్గింపులు చేయగా, కొన్ని వేరియంట్ల ధరలను స్వల్పంగా పెంచారు. ఎంపిక చేసిన వేరియంట్లపై తగ్గింపు ఇవ్వడం కస్టమర్లకు సంతోషం కలిగించే విషయం అని చెప్పాలి. తగ్గింపు ద్వారా మధ్యతరగతి SUV సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీలో ఫోక్స్‌వ్యాగన్ మరింత బలంగా ఇతర కంపెనీలకు చెందిన మోడళ్లకు పోటీ ఇవ్వడానికి సిద్ధమైందని అర్థం చేసుకోవచ్చు. టైగన్ ధర తగ్గడంతో షోరూమ్‌లకు జనాలు ఎగబడే అవకాశం ఉంది.

ధర తగ్గింపుల విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ హైలైన్‌ 1.0 AT వేరియంట్‌ ధర తగ్గింపు చేశారు. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ను కోసం వినియోగదారులు కొంత ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇకపై ఈ మోడల్‌ను కొనాలంటే రూ. 1.43 లక్షల వరకు తక్కువ చెల్లించాలి. ఇంత భారీ తగ్గింపు అంటే సాధారణ విషయం కాదు. అదే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌పై మాత్రం రూ.88,500 వరకు తగ్గింపు ఉంది.

Volkswagen Taigun Prices Dropped

భారత మార్కెట్లో ఆటోమేటిక్ కార్లకు ఎప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉండటమే కాకుండా, వాటి ధరలు మాన్యువల్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి టైంలో, ఆటోమేటిక్ వేరియంట్ పై ఇలా భారీ డిస్కౌంట్ ఇవ్వడంఫోక్స్‌వాగన్‌కి వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రణాళిక అని చెప్పవచ్చు. టైగన్ తగ్గింపు మొత్తం వేరియంట్లపై వర్తించదు. కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌కు మాత్రమే లభిస్తోంది. GT 1.5 MT, GT 1.5 DSGలో మార్పు చేయలేదు.

అంతేకాదు, టైగన్‌కి సంబంధించిన మిగిలిన వేరియంట్‌లకు మాత్రం ధరలు రూ.13,000 వరకు పెరిగాయి. టైగన్ ఇంజిన్ గురించి చూసినట్లయితే 1.0-లీటర్, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 PS పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 PS పవర్, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Volkswagen Taigun

ఈ మోడల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డ్యూయల్-క్లాచ్ ఆటోమెటిక్ (DSG) ట్రాన్స్‌మిషన్‌లో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లాస్టర్, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ వంటి హైటెక్ ఫీచర్లతో పాటు, సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఇంకా అత్యాధునికి ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 7, 2025, 7:30 [IST]
English summary
Volkswagen taigun prices dropped up to rs 1 43 lakh on selected variants
Read more on: #volkswagen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+