ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు.. రిలీజైన 90రోజుల్లోనే ఫోక్స్ వ్యాగన్ కొత్త కారు పై ఏకంగా రూ.3లక్షల తగ్గింపు

జులై నెలలో కార్లు, ఎస్‌యూవీలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. తక్కువ ధరల కార్ల నుంచి ప్రీమియం కార్ల వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటిలో అన్నింటికన్నా ఆకర్షణీయమైన ఆఫర్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ Rలైన్ పై ఉంది. కేవలం 90రోజుల క్రితం అంటే మూడు నెలల క్రితం రూ.49లక్షల (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ పవర్‌ఫుల్ SUV ఇప్పుడు ఏకంగా రూ. 3 లక్షల తగ్గింపుతో లభిస్తోంది.

ఈ ఆల్-వీల్ డ్రైవ్ ప్రీమియం ఎస్‌యూవీని ఇప్పుడు రూ. 46 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఈ తగ్గింపులు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో పొందవచ్చు. మరి ఈ కారు ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకుందాం.

Volkswagen Tiguan R Line

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ R లైన్లో 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ 204 బీహెచ్‌పీ పవర్‌ను, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. ఈ ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ కేవలం 7.1 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల/గంట వేగాన్ని అందుకుంటుంది.

దీని టాప్ స్పీడు గంటకు 229 కిలోమీటర్లు. అలాగే, టిగువాన్ R లైన్ మైలేజ్ లీటరుకు 12.58 కిలోమీటర్ల వరకు వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఎస్‌యూవీలో లోపల పూర్తిగా బ్లాక్ కలర్ క్యాబిన్ ఉంటుంది. ఇందులో స్పోర్ట్స్ సీట్లు, డ్యాష్‌బోర్డ్‌పై కాంట్రాస్టింగ్ బ్లూ స్టిచింగ్ ఉన్నాయి. దీనితో పాటు, 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేస్తుంది.

డ్రైవర్ కోసం 'R' బ్యాడ్జింగ్ ఉన్న త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెనుకవైపు 10.3-అంగుళాల పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇవన్నీ క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ R లైన్లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

Volkswagen Tiguan R Line

రెండు ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, మసాజింగ్ ఫ్రంట్ సీట్లు, ట్రై-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్, ఎయిర్‌బ్యాగ్‌లు, ఫోక్స్‌వ్యాగన్ పార్క్ అసిస్ట్ ప్లస్ టెక్నాలజీ ఇది పార్కింగ్‌ను సులభతరం చేస్తుంది. ఇంకా మరిన్ని అత్యాధునిక ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ R లైన్ కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఈ ఫోక్స్‌వ్యాగన్ ప్రీమియం AWD SUV 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆయిస్టర్ సిల్వర్ మెటాలిక్, గ్రెనాడిలా బ్లాక్ మెటాలిక్, సిప్రెస్సినో గ్రీన్ మెటాలిక్, ఓరిక్స్ వైట్ మదర్ ఆఫ్ పెర్ల్ ఎఫెక్ట్, నైట్‌షేడ్ బ్లూ మెటాలిక్, పర్సిమోన్ రెడ్ మెటాలిక్ లాంటి యూనిక్ కలర్లలో లభిస్తుంది.

ఈ కారులో కనెక్టెడ్ ఎల్‌ఈడీ స్ట్రిప్ తో పాటు స్లీకర్ హెడ్‌ల్యాంప్స్ కూడా ఉన్నాయి, ఇవి కారుకు మరింత స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. ఇప్పుడు రూ. 3 లక్షల తగ్గింపుతో ఈ ప్రీమియం ఎస్‌యూవీని కొనేందుకు ఇది మంచి అవకాశం. ఈ ఆఫర్ రాష్ట్రాలు, డీలర్లను బట్టి మారుతుంది. కాబట్టి మీ సమీప డీలర్ దగ్గరకు వెళ్లి డిస్కౌంట్ల వివరాలను తెలుసుకోవడం మంచిది.

More from DriveSpark

Article Published On: Thursday, July 31, 2025, 10:16 [IST]
English summary
Volkswagen tiguan r line discount save rs 3 lakhs on this premium awd suv
Read more on: #volkswagen #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+