సెన్సేషనల్ మోడల్ మార్కెట్లోకి తెస్తున్న వోక్స్ వ్యాగన్.. ఇక కంపెనీలన్నీ మూసుకోవాల్సిందే
ఇండియా ఆటో మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం సెడాన్, హ్యాచ్ బాక్ కార్లకు డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత కాంపిటేటివ్ విభాగాలలో కాంపాక్ట్ SUVలు ఒకటి. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి దిగ్గజాలు ఆధిపత్యం చెలాయిస్తుండగా.. ఈ విభాగంలోకి ఇటీవల స్కోడా కూడా కైలాక్ వంటి మోడల్ ను తీసుకొచ్చింది.
దేశంలోని అన్ని ప్రముఖ బ్రాండ్లలో వోక్స్‌వ్యాగన్ చివరి స్థానంలో ఉంది. ఆఖరికి అది కూడా రూ.8 లక్షల బడ్జెట్‌తో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకురాబోతుంది. కుషాక్, టైగన్‌లలో చూసినట్లుగా ఈ వెహికల్‌ను కూడా కైలాక్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు.

ఇటీవల వోక్స్‌వ్యాగన్ బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన కార్నివాల్‌లో తన కొత్త కాంపాక్ట్ SUV, టెరాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది వోక్స్ వ్యాగన్ విక్రయించే అత్యంత సరసమైన చిన్న వాహనం. ఈ ఎస్ యూవీ ఎక్సటీరియర్, ఇంటీరియర్ ను మాత్రమే బ్రాండ్ ప్రదర్శించింది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో బ్రెజిలియన్ మార్కెట్లో రిలీజ్ కానుంది.
వోక్స్‌వ్యాగన్ లైనప్‌లో పోలో, టి-క్రాస్ మధ్య స్థానంలో ఉన్న టెరా, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అత్యంత పోటీ ధరకు విక్రయిస్తారని భావిస్తున్నారు. ఈ కాంపాక్ట్ SUVను పూర్తిగా బ్రెజిల్‌లో డెపలప్ చేశారు. టెక్నికల్ స్పెసిఫికేషన్లను మాత్రం ప్రస్తుతానికి కంపెనీ గోప్యంగా ఉంచింది.

అయితే, కంపెనీ ఇదే వెహికల్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ టెరా ఎంక్యూబీ ఏ0 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. ఇండియా స్పెక్ కార్లు ఆధారపడిన ఎంక్యూబీ ఏ0 ఐఎన్ ప్లాట్‌ఫాం ఇది కాదని గమనించాలి. ఎంక్యూబీ ఏ0 గ్లోబల్ మార్కెట్లో విక్రయానికి ఉన్న పోలోకు కూడా సపోర్ట్ ఇస్తుంది. ప్రస్తుతానికి టెరా డైమెన్షన్స్ తెలియవు.
వోక్స్‌వ్యాగన్ టెర్రా స్కోడా కైలాక్ సక్సెస్ పునరావృతం చేయగలదని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ వోక్స్‌వ్యాగన్ టెరా ఎస్యూవీ ఎక్స్టీరియర్ పెద్ద ఎస్ యూవీ టిగువాన్ నుంచి ప్రేరణ పొందింది. హెడ్‌ల్యాంప్స్ స్లిమ్‌గా ఉంటాయి. డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ రెండు సెగ్మెంట్స్ గా విభజించడం జరిగింది. సైడ్స్ లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ ప్రీమియం SUVల మాదిరిగా కాకుండా టెరా ప్రకాశవంతమైన లైట్ బార్‌లను తొలగించింది. ధర తక్కువే అయినప్పటికీ ఈ వాహనం కాంపాక్ట్ SUV లాగా కూల్ డిజైన్ ఉండేలా రూపొందించారు. బ్రెజిల్‌లో ఈ వాహనం పోలో TSI మాదిరిగానే 1.0-లీటర్ టర్బో ఫ్లెక్స్ ఇంజిన్‌తో వస్తుందని నివేదించారు. ఇది అధిక వేరియంట్లలో లభిస్తుంది.
ఇది 116 బిహెచ్‌పి పవర్, 164 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది T-క్రాస్, నివస్, పోలోలతో MQB A0 మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌ను షేర్ చేసుకుంటుంది. భారతదేశంలోకి వచ్చినప్పుడు వోక్స్‌వ్యాగన్ టెరా 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటుంది.

స్కోడా కైలాక్ లాగానే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ TSI ఇంజిన్ 115 bhp పవర్, 178 Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటీరియర్ కూడా ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారు. కాబట్టి ఇండియాకు వచ్చే వోక్స్ వ్యాగన్ టెరా లేటెస్ట్ ఫీచర్స్ కలయికగా ఉంటుంది.
టెరాలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సిక్స్ వే అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ సీట్స్, డ్యూయల్-స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, లెథరెట్ అప్హోల్స్టరీ వంటి అన్ని బేసిక్ ఫీచర్స్ ఉంటాయి.
వోక్స్‌వ్యాగన్ టెరాలో ప్రయాణికుల భద్రతకు 6 ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, వెనుక పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందించవచ్చు. అందువల్ల జర్మన్ SUV భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను కూడా సాధించగలదు. వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఈ మోడల్ ధర రూ.8 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉండనుంది.


Click it and Unblock the Notifications








