61 వేల మంది నమ్మకంగా ఈ కారును కొనుగోలు చేశారు! అంతగా దీనిలో ఏం స్పెషాలిటీ ఉంది?

ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన ప్రీమియం సెడాన్ 'వర్టస్ (virtus)' ఇండియాలో అడుగుపెట్టి మెరుగైన అమ్మకాలను నమోదు చేస్తుంది. ప్రజల నుంచి మంచి డిమాండ్‌ను సాధిస్తున్న వర్టస్ ఇప్పుడు భారత రోడ్లపై మూడు సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 2022 జూన్‌లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, విడుదలైన రోజు నుంచే తన డిజైన్, పనితీరు, భద్రతా ప్రమాణాలతో ఎంతో మంది కస్టమర్ల మనసు దోచుకుంది. ప్రీమియం సెడాన్ సెగ్మెంట్‌లో వర్టస్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. 2025కి వచ్చినప్పటికీ, ఈ సెడాన్ తన ఆదరణను ఏ మాత్రం కోల్పోలేదు. అంతేకాకుండా, 2025లో ఇప్పటివరకు నమోదు చేసిన అమ్మకాల ప్రకారం, వర్టస్ 32 శాతం సెగ్మెంట్ మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకొని, ఈ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

ఇది సాధారణ విజయంగా కాకుండా, ఒక సెడాన్‌కు భారత మార్కెట్లో లభించే ఆదరణకి నిదర్శనంగా నిలిచింది. కేవలం డొమెస్టిక్ మార్కెట్‌నే కాకుండా, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉన్న ఒక బలమైన ప్రీమియం కార్‌గా ఎదిగింది. ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్‌ తన మూడు సంవత్సరాల ప్రయాణంలో ఒక్కో అడుగు విజయదిశగా వేసింది. భారతదేశంలో ప్రారంభించినప్పటి నుంచే వర్టస్ మెల్లగా కానీ స్థిరంగా మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చింది.

Volkswagen Virtus Sedan Model Sales

అమ్మకాల నివేదిక ప్రకారం, ఇప్పటివరకు వర్టస్‌ను మొత్తం 61,564 మంది కొనుగోలు చేయడం ఈ కారుకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తుంది. మొదటి ఆర్థిక సంవత్సరంలో 18,914 యూనిట్లు అమ్ముడవగా, రెండవ సంవత్సరానికి ఇది 20,796 కి చేరింది. మూడవ సంవత్సరానికి మాత్రం అమ్మకాలు మరింత పెరిగి 21,854 యూనిట్లకు చేరాయి. వృద్ధి స్ధిరంగా కొనసాగుతుండటం విశేషం. ఇలా మూడు సంవత్సరాల్లో వర్టస్ ప్రజల అభిమానాలను అందుకుంది.

ఈ సెడాన్‌‌ను కోనుగోలు చేయడానికి ముఖ్య కారణాల్లో ఇది ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉండటం. వర్టస్‌కు గ్లోబల్ NCAP టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్ లభించడంతో, భద్రతను ప్రాధాన్యం పెట్టే కొనుగోలు దారులందరికీ మొదటి ఎంపికగా నిలిచింది. ఈ కారు బలమైన బిల్ట్ క్వాలిటీ, బోల్డ్ డిజైన్, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగిన ఇంజినీరింగ్ కారణంగా, భారతీయ ప్రీమియం సెడాన్ విభాగంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.

Volkswagen Virtus Price

ఫోక్స్‌వ్యాగన్‌ వర్టస్ భారత మార్కెట్లో రూ.13.5 లక్షల నుండి టాప్ ఎండ్ వేరియంట్ రూ.22.54 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వరకు లభిస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇది మొత్తం 14 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాక, మాన్యువల్, ఆటోమేటిక్, DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో వస్తుండటంతో, ఇది ప్రతి డ్రైవింగ్ ప్రిఫరెన్స్‌కు తగ్గట్టు ఉంటుంది.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ, వర్టస్ ప్రీమియం సెడాన్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతుండటం మాకు గర్వకారణం. ఇది డిజైన్, ఫీచర్లు రెండింటినీ సమపాళ్లలో కోరుకునే ఆధునిక వినియోగదారుల మన్ననను పొందింది. వర్టస్‌పై, అలాగే వోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌పై వినియోగదారులు ఉంచిన విశ్వాసం ఈ మైలురాయికి ప్రధాన కారణం అని అన్నారు.

Volkswagen Virtus Sedan 61k Sales

మార్కెట్ మారుతున్న కొద్దీ, మేము అదే స్థాయిలో నమ్మకాన్ని పెంచే ఉత్పత్తులను, ఆవిష్కరణలను అందించేందుకు నిబద్ధంగా ఉన్నాం అని ఆయన పేర్కొన్నారు. యూరోపియన్ కార్ల తయారీ సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కి పైగా దేశాలలో తన కార్లను విక్రయిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో కంపెనీ ప్రసిద్ధ తయారీదారుగా ఉంది. ఇది దేశంలో టైగన్, వర్టస్, టిగువాన్ ఆర్-లైన్, గోల్ఫ్ GTI లను విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 11, 2025, 17:30 [IST]
English summary
Volkswagen virtus sedan model recorded 61k above sales with in three years
Read more on: #volkswagen #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+