భయ్యా.. జన్మలో వోల్వో కార్లు ఇంత తక్కువ ధరలకు మళ్లీ దొరకవు.. ఆ మోడళ్ల పై ఏకంగా రూ.7లక్షలు తగ్గింపు
పండుగ సీజన్‌కు ముందు లగ్జరీ కార్ల ప్రియులకు వోల్వో కార్ ఇండియా ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ తన ఐసీఈ (ఇంటర్నల్ కంబుషన్ ఇంజిన్) మోడల్స్ అయిన వోల్వో XC60, వోల్వో XC90 కార్ల ధరలను ఏకంగా దాదాపు రూ.7 లక్షల వరకు తగ్గించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వస్తాయి. దీంతో పాటు, వోల్వో డబుల్ ఫెస్టివ్ డిలైట్ పేరుతో ప్రత్యేక పండుగ ఆఫర్లను కూడా అందిస్తోంది.
ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇటీవల జీఎస్‌టీ కౌన్సిల్ కార్లపై ఉన్న పన్ను విధానాన్ని సరళీకృతం చేసింది. పాత పన్ను స్లాబ్‌లను తొలగించి, కొత్త ట్యాక్స్ స్లాబులను తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాన్ని వోల్వో తన కస్టమర్లకు బదిలీ చేసింది. అయితే, వోల్వో ఎలక్ట్రిక్ వాహనాల (BEVs)పై ఎలాంటి పన్ను తగ్గింపు వర్తించలేదు. అయినప్పటికీ కంపెనీ వాటిపై కూడా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది.

వోల్వో XC60, XC90 మోడల్స్ వాటి లగ్జరీ, సేఫ్టీ, అద్భుతమైన ఫీచర్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ ధరల తగ్గింపుతో ఈ కార్లు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారాయి.
వోల్వో XC60 (MY26 రీఫ్రెష్డ్) విషయానికి వస్తే దీని పాత ధర రూ.71,90,000..తగ్గింపు తర్వాత కొత్త ధర రూ.67,10,667.. మొత్తంగా ఆ మోడల్ మీద కంపెనీ రూ. 4,79,333లను తగ్గించింది. ఈ మోడల్ పవర్ఫుల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది డ్రైవింగ్ ఎక్సపీరియన్స్ మెరుగుపరుస్తుంది. వోల్వో కంపెనీ ఎప్పుడూ సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తుంది. అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు (ADAS - అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటివి ఉంటాయి.
ఈ కార్లలో ప్రీమియం క్వాలిటీ గల మెటీరియల్స్, విశాలమైన క్యాబిన్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి లగ్జరీ అనుభూతిని అందిస్తాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto, ప్రీమియం సౌండ్ సిస్టమ్. హీటెడ్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, వెనక సీట్ల వారికి కూడా మంచి స్పేస్ లభిస్తుంది.

ఇక వోల్వో XC90 (MY26) మోడల్ విషయానికి వస్తే.. దీని పాత ధర రూ.1,03,89,000.. కొత్త ధర రూ.96,97,240.. మొత్తంగా ఈ మోడల్ మీద రూ.6,92,660 తగ్గింపు లభిస్తుంది. ఇది 7 సీటర్ మోడల్. పెద్ద కుటుంబాలకు లేదా ఎక్కువ మంది ప్రయాణీకులతో వెళ్లే వారికి ఇది సరిపోతుంది. సుదూర ప్రయాణాలకు, అధ్వానమైన రోడ్లపై కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
వోల్వో ఫ్లాగ్‌షిప్ మోడల్ కావడంతో ఇందులో అత్యంత అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు (సెమీ-అటానమస్ డ్రైవింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, కొలిషన్ అవైడెన్స్ సిస్టమ్స్) ఉంటాయి. ఆకర్షణీయమైన ఎక్సటర్నల్, క్లాసీ ఇంటీరియర్ డిజైన్ దీని సొంతం.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద వర్టికల్ టచ్‌స్క్రీన్, బోవర్స్ విల్కిన్స్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. అన్ని సీట్లలోనూ విశాలమైన స్థలం, లగ్జరీ సీటింగ్, ఫోల్డబుల్ థర్డ్ లేన్ సీట్లు ఉంటాయి.
వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ.. "లగ్జరీ మొబిలిటీని మరింత సరసమైనదిగా మార్చడమే మా లక్ష్యం. జీఎస్‌టీ ప్రయోజనంతో పాటు మేము అందిస్తున్న ప్రత్యేక పండుగ ఆఫర్‌లు కస్టమర్‌లకు రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో మా విక్రయాలు మరింత బలంగా ఉంటాయని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము" అని అన్నారు.
వోల్వో చేసిన ఈ ప్రకటన లగ్జరీ ఎస్‌యూవీ కొనాలని కలలు కంటున్న వారికి ఒక సువర్ణావకాశం. వోల్వో XC60, XC90 ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో పాటు మరింత సరసమైన ధరలలో లభిస్తున్నాయి. ఈ భారీ ధరల తగ్గింపుతో, ఈ పండుగ సీజన్‌లో వోల్వో కార్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








