చిన్న కుటుంబాల కోసం కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 474 కి.మీ.. బడ్జెట్ రెడీ చేసుకోండి!

భారతదేశంలో విదేశీ లగ్జరీ కార్లకు ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. ప్రీమియం పరంగా అవే మొదటి ఎంపికగా మారిపోతున్నాయి. అటువంటి బ్రాండ్స్‌లో వోల్వో (Volvo)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం లగ్జరీ కార్ల బ్రాండ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన ఆటోమొబైల్ బ్రాండ్‌గానూ గుర్తింపు పొందింది. ఇప్పటికే భారత మార్కెట్‌లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) విజయవంతంగా ప్రవేశపెట్టిన వోల్వో.. ఇప్పుడు తన వ్యాపార మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. XC40 రీచార్జ్, C40 రీచార్జ్ మోడళ్లకు మార్కెట్ నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రీమియం లుక్స్, టాప్ క్లాస్ బిల్డ్ క్వాలిటీ, హై ఎండ్ సేఫ్టీ ఫీచర్లు వాటిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు అదే విజయాన్ని కొనసాగిస్తూ, వోల్వో తన మూడవ ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

2025 ఆగస్టు 1న XC60 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేయనున్నారు. ఇది వోల్వోలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి. ఫ్రెష్ డిజైన్, తాజా ఫీచర్లు, మెరుగైన సురక్షిత ప్రమాణాలతో ఇది కొత్త రూపంలో మార్కెట్‌లోకి రానుంది. అంతే కాకుండా, వోల్వో ప్లాన్లలో మరో ముఖ్యమైన మోడల్ కూడా ఉంది. EX30 ఎలక్ట్రిక్ SUV విడుదలను సెప్టెంబర్ 2025 ప్రకటించనుందని గాడివాడి నివేదించింది.

Volvo Ex30 Electric Car Design

ఇది వోల్వో అందించే అత్యంత చిన్న, కానీ శక్తివంతమైన ఎలక్ట్రిక్ కారుగా రానుంది. యువతను టార్గెట్ చేస్తూ దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవి చూసి అర్థమవుతోంది, వోల్వో భారత మార్కెట్‌పై ఎంతగా ఫోకస్ చేస్తోంది అన్నది. సురక్షితతను ప్రాధాన్యతగా భావించే కస్టమర్లకు వోల్వో EVలతో ఓ కొత్త ప్రయాణం మొదలయ్యేలా ఉంది. పెరిగిన పోటీ నేపథ్యంలో కంపెనీ నుంచి కొత్త మోడళ్ల రాక అనివార్యమైంది.

వోల్వో ఎలక్ట్రిక్ మోడల్ EX30 SUVని పబ్లిక్ రోడ్లపై పరీక్షిస్తున్నట్లు ఫొటోలు వెలుగు చూశాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో విజయవంతంగా లాంచ్ అయిన ఈ మోడల్‌, ఇప్పుడు భారత మార్కెట్‌పై కూడా టార్గెట్ చేసింది. EX30ను వోల్వో తన గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్లు EC40, EX40ల కంటే దిగువ స్థాయిలో పెట్టి ప్లాన్ చేస్తోంది. ఇవన్నీ చూస్తే ఇది కంపెనీ అతి చిన్న ఎలక్ట్రిక్ SUV అని చెప్పొచ్చు.

Volvo Ex30 Electric Car Launch

చిన్నదైనా ఫీచర్లలో మాత్రం ఆకట్టుకునేలా తయారైంది. టెక్నాలజీ, డిజైన్, సేఫ్టీ వంటి అంశాల్లో ఎలాంటి రాజీ లేకుండా రూపొందించబడిన మోడల్ ఇది. ధర విషయానికి వస్తే.. వోల్వో ఈ మోడల్‌ను భారతదేశంలో అసెంబుల్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల కారును పోటీ ధరలో లాంచ్ చేయగలుగుతుంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ.45 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది.

భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని వోల్వో EX30లో 69 kWh సామర్థ్యం గల NMC (నికెల్-మాంగనీస్-కోబాల్ట్) బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని వల్ల లాంగ్ రేంజ్‌తో పాటు, వేగవంతమైన ఛార్జింగ్‌ వంటి అంశాల్లో కూడా ఇది ముందుంటుంది. EX30 రెండు వేరియంట్‌లలో వెనుక చక్రాల డ్రైవ్ (RWD), డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD)లలో లభించనుంది.

Volvo Ex30 Electric Car Battery

AWD వేరియంట్ గరిష్ఠంగా 427 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది చిన్న SUV అయినా కూడా చాలా స్పోర్టీ మరియు శక్తివంతమైనదిగా నిలుస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, EX30 ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 474 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలదని తెలుస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలు అయినా, వీకెండ్ రోడ్ ట్రిప్స్ అయినా.. ఛార్జింగ్‌ విషయంలో టెన్షన్ లేకుండా ప్రయాణించడానికి ఎంతో సరైనది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 30, 2025, 10:59 [IST]
English summary
Volvo ex30 electric car will launch soon in india expected price and battery
Read more on: #volvo #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+