టాప్ క్లాస్ ఫీచర్స్, స్టన్నింగ్ లుక్స్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ‌తో వోల్వో కొత్త కారు లాంచ్.. ధర ఎంతంటే?

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న కార్ల తయారీదారులకు అత్యంత కీలకం. దీనికి ప్రధాన కారణం చాలా దేశాలు ఆర్థికంగా బలంగా లేకపోవడం, వృద్ధి సన్నగిల్లడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే భారత్‌‌లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. పైగా ఇక్కడ వాహన పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్ల వాడకం కూడా ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో తయారీదారులు మన దేశానికి క్యూ కట్టి వరుసగా కొత్త కార్లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో ఇప్పటికే మెరుగైన మార్కెట్ కలిగిన వోల్వో కార్ ఇండియా (Volvo Car India) కొత్త మోడళ్లను లాంచ్ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా తాజాగా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ XC90 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.1.03 కోట్లు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఆన్‌రోడ్ ఎక్కువగా ఉంటుంది. దీనికంటే ముందు ఉన్న వేరియంట్ కంటే ఇది రూ. 2 లక్షలు ఎక్కువ. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ స్టైలిష్‌గా ఉంటుంది. ముందు రిఫ్రెష్ చేసిన క్రోమ్-యాక్సెంటెడ్ గ్రిల్, రిఫ్రెష్ బంపర్, సరికొత్తగా కనిపించే స్లీకర్ మ్యాట్రిక్స్-డిజైన్ LED హెడ్‌ల్యాంప్‌లు మొదలగునవి ఉన్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వోల్వో EX90 నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది.

Volvo New Xc90 Facelift

ప్రధానంగా 21-అంగుళాల బ్లాక్ డైమండ్-కట్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ కారు బయటి అందాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వెనుక అందించిన టెయిల్ ల్యాంప్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటి ఆప్షన్లు అందించారు. ఇంటీరియర్‌లో డజన్ల కొద్ది లేటెస్ట్ లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా కారు లోపల గాలిని స్వచ్ఛంగా మార్చే అధునాతన టెక్నాలజీ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

క్యాబిన్‌లో 12.3-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, గూగుల్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థతో కూడిన 11.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వైర్‌లెస్ ఛార్జింగ్ పోర్ట్, లగేజీ పెట్టుకోడానికి సరిపడినంత స్థలం వంటివి ఈ కారులో ఉన్నాయి.

Volvo New Xc90 Facelift Price

ఇది లగ్జరీ కారు కాబట్టి పేరుకు తగ్గట్టు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడానికి లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, అన్ని వైపులా పార్క్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఇతర అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలను XC90 ఫేస్‌లిఫ్ట్ కలిగి ఉంది.

చివరగా పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇది 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 253 bhp పవర్, 360 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రధానంగా ఇది ఆల్-వీల్-డ్రైవ్ (AWD)ను కలిగి ఉంది. ఈ కారు కేవలం 7.7 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 180 కి.మీ.

Volvo New Xc90 Facelift Design

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Wednesday, March 5, 2025, 10:51 [IST]
English summary
Volvo new xc90 facelift launched in india at starting price rs 1 03 crore
Read more on: #volvo #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+