వావ్.. ఇంటర్నేషనల్ స్టైలిష్ కారు ఇప్పుడు మన దగ్గరికే వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్స్‌కు ఫిదా కావాల్సిందే!

ఇండియా మార్కెట్ ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమకు అత్యంత కీలకమైంది. అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ది చెందిన వాహన తయారీ కంపెనీలు భారత్‌ వైపు చూస్తున్నాయి. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత్ మాత్రం అన్నింటిని తట్టుకుని బలంగా నిలబడి బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దేశ జీడీపీ వృద్ధి చెందడానికి ప్రధానంగా వాహన పరిశ్రమ అత్యంత కీలకంగా ఉంది. దేశీయంగా ఉన్న పలు సానుకూల అంశాల కారణంగా తయారీదారులు తమ మార్కెట్‌ను బాగా విస్తరించుకుంటున్నారు. ఈ తరుణంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు పోటీ పడి మరి కొత్త మోడళ్లను విడుదల చేస్తుండగా, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలు కూడా ఇప్పుడు వీటికి పోటీగా అధునాతన కార్లను లాంచ్ చేస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారుల కోసం మాత్రమే కాకుండా లగ్జరీ కార్ల వినియోగదారుల కోసం కూడా అదిరిపోయే మోడళ్లు దేశంలో విడుదల అవుతున్నాయి.

సాధారణంగా భారత్‌లో లగ్జరీ కార్లు అంటే మొదటగా గుర్తుకు వచ్చేవి ఆడీ, బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు మాత్రమే. అయితే వీటితో పాటు మరో కంపెనీ కూడా అదిరిపోయే లగ్జరీ కార్లను విడుదల చేస్తూ, భారత మార్కెట్లో తన ఉనికిని కలిగి ఉంది. ఆ కంపెనీయే వోల్వో (Volvo). స్వీడిష్ ఆటోమేకర్ అయిన వోల్వో మల్టీ-యాక్సిల్ బస్సుల నుంచి లగ్జరీ కార్ల వరకు తయారీలో బాగా పేరున్న సంస్థ.

Volvo New Xc90 Facelift Suv

ఈ కంపెనీ ICE ఇంజిన్ వాహనాలను విడుదల చేస్తూనే ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకొస్తూ భారత్‌లో మెరుగైన మార్కెట్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్‌లో చాలా కార్ల కంపెనీలు పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్న తరుణంలో వీటికి పోటీగా వోల్వో కంపెనీ కొత్త మోడల్‌ను తీసుకురావాలని చూస్తుంది. కంపెనీ కొత్తగా ఎక్స్‌సీ 90 ఫేస్‌లిఫ్ట్ (Xc90 facelift)ని అతి త్వరలోనే భారతదేశంలో ప్రారంభించనుంది.

తాజాగా కంపెనీ అధికారికంగా ధృవీకరించిన దాని ప్రకారం, కొత్త XC90 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని 2025 మార్చి ప్రారంభంలోనే ఇండియాలో విడుదల చేయనుంది. ఈ కారును కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 2024లో విడుదల చేసింది. ఇప్పుడు ఇదే మెడల్‌ను భారత వినియోగదారుల కోసం తీసుకొస్తుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీని డిజైన్ చూస్తే ఎవరైనా కూడా అట్రాక్ట్ కావాల్సిందే. లగ్జరీ లుక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Volvo Xc90 Facelift Suv

ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మైల్డ్ హైబ్రిడ్, బలమైన హైబ్రిడ్ ఇంజిన్‌లతో కొనుగోలుకు లభిస్తుంది. ఇప్పుడు ఇండియాలోకి విడుదల కాబోతున్న వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. దీని ముందు భాగం యాక్టివ్ గ్రిల్‌తో అందించబడి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ కారుకు లగ్జరీ లుకింగ్‌ను కలిగిస్తుంది. క్రోమ్ సెటప్ దీనిలో తక్కువగా అనిపిస్తుంది. ఫేస్‌లిఫ్ట్ కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌ కారు ఎక్స్‌టీరియర్ అందాన్ని పెంచుతాయి.

ఇది 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. 251 bhp పవర్, 360 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్‌లో 7.7 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అదే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌‌ను చూసినట్లయితే 2.0-లీటర్ ఇంజిన్, అలాగే 18.8 kWh బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉంటాయి.

Volvo New Xc90 Facelift Suv Will Launch In India

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2025, 11:20 [IST]
English summary
Volvo new xc90 facelift suv will launch in india on march 2025
Read more on: #volvo #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+