ఈ కారు ఎక్కామా అంటే సేఫ్టీ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు.. వోల్వో నుంచి కొత్త XC60 వచ్చేస్తోంది!
వోల్వో కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. అవి సెడాన్ అయినా, ఎస్‌యూవీ అయినా, సేఫ్టీ విషయంలో వోల్వో ఏమాత్రం రాజీపడదు. బీఎండబ్ల్యూ ఎక్స్3, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సి, ఆడి క్యూ5 వంటి మోడళ్లకు పోటీగా వోల్వో లైనప్‌లో ఉన్న మోడల్ XC60. ఇప్పుడు ఈ మోడల్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఆగస్ట్ 1న కంపెనీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కారు మొత్తం రూపురేఖలను మార్చకపోయినా, కొన్ని ముఖ్యమైన మార్పులు ఉన్నాయని తెలుస్తోంది.
కొత్త వోల్వో XC60 ముందు భాగంలో, అప్‌డేటెడ్ గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్‌ఎల్‌లు వంటి మార్పులు వచ్చాయి. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా కారు లుక్‌ను మరింత పెంచుతున్నాయి. అయితే, ఈ కారులో ప్రధాన మార్పులు ఇంటీరియర్‌లో ఉన్నాయి.

ఇంటీరియర్లో 11.2 అంగుళాల పోర్ట్రెయిట్-ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, మెరుగైన భద్రత, సౌకర్యం కోసం 360 డిగ్రీల కెమెరాతో కూడిన వోల్వో సరికొత్త ADAS టెక్నాలజీ కూడా క్యాబిన్‌లో ఉంటాయి.
మెకానికల్‌గా కారులో ఎలాంటి మార్పులూ లేవు. ఫేస్‌లిఫ్ట్, ఇంటీరియర్ మార్పుల కారణంగా కారు ధరలో స్వల్ప పెరుగుదల ఉండవచ్చు. 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఈ వాహనం గుండె లాంటిది. ఇది 251 bhp శక్తిని, 360 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో XC90 మోడల్ ఫేస్‌లిఫ్ట్ కూడా వోల్వో విడుదల చేసింది. 2014లో విడుదలైన తర్వాత, రెండవ తరం వోల్వో XC90 ఎస్‌యూవీకి ఇది రెండవ అప్‌డేట్. ప్రపంచవ్యాప్తంగా మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌లతో ఈ ఎస్‌యూవీ లభిస్తున్నప్పటికీ భారతదేశంలో కొత్త వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతోనే రానుంది. ఈ ఎస్‌యూవీకి మొత్తంగా ఒక కొత్త లుక్ వచ్చింది.
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన EX90 EVకి చాలా పోలికలు ఉన్న రూపం ప్రజలకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందు భాగంలో మునుపటి ప్యానెల్‌కు బదులుగా, ఈసారి యాక్టివ్ గ్రిల్ అందాన్ని ఇస్తుంది. ఈ కొత్త ప్యాటర్న్, స్లీకర్ ఫ్రంట్ బంపర్ కలయిక లగ్జరీ ఎస్‌యూవీని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది. క్రోమ్ వాడకం తక్కువగా ఉండటం కూడా గమనించదగ్గ విషయం.

వోల్వో సిగ్నేచర్ స్టైల్ అయిన థోర్ హామర్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ ను తొలగించలేదు. పక్కల నుండి చూస్తే, మునుపటి ఎస్‌యూవీతో పోలిస్తే పెద్దగా మార్పులు లేవు. అయినప్పటికీ, కొత్తదనం తీసుకురావడానికి వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌ను చేర్చారు. వెనుక భాగంలో, వోల్వో వర్టికల్ లైట్ సిగ్నేచర్ డిజైన్ కొనసాగుతుంది. అయితే స్ప్లిట్ డిజైన్ ద్వారా కంపెనీ దీన్ని మరింత అందంగా మార్చింది.
కారు లోపలికి వస్తే, కొత్త XC90 ఫేస్‌లిఫ్ట్ ప్రాథమిక రూపం మునుపటిలాగే ఉంది. అయితే, డ్యాష్‌బోర్డ్ నుండి వేరుగా నిలిచే ఒక పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంటీరియర్‌లో ఉపయోగించారు. సెంటర్ కన్సోల్‌లో అదనపు స్టోరేజ్ స్పేస్, ఒక కప్‌హోల్డర్ ఉండేలా మార్పులు కూడా చూడవచ్చు.


Click it and Unblock the Notifications








