ఈ కారుతో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి.. లుక్‌తో కట్టి పడేస్తుంది.. రేపే విడుదల!
ప్రసిద్ధ కార్ల తయారీదారు అయినటువంటి వోల్వో (Volvo) తన మిడ్-సైజ్ లగ్జరీ SUV అయిన XC60 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ (Xc60 Facelift)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1, 2025న ఈ కొత్త మోడల్ విడుదల కానుంది. ఇది ప్రస్తుతం అమ్ముడవుతున్న XC60కి రెండోసారి వచ్చిన ముఖ్యమైన అప్‌డేట్ కావడం విశేషం. XC60 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ వోల్వో లగ్జరీ SUV శ్రేణిలో ఫ్లాగ్‌షిప్‌గా నిలుస్తుంది. కొత్తగా రానున్న మోడల్ పూర్తిగా డిజైన్‌ను మార్చకపోయినా, దాని డిజైన్ మరింత ఆధునీకరించడంలో వోల్వో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అతి ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్‌ల రూపం, అలాగే బంపర్ డిజైన్ కొద్దిగా మారినట్లు సమాచారం. అంతే కాదు, అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా కొత్తగా కనిపించనుంది.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కొత్త వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి మరింత మెరుగైన ఇంధన సామర్థ్యం, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ ఇంజిన్ 250 హెచ్‌పీ పవర్, 360 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది.

అలాగే ఇది ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ ద్వారా అన్ని టైర్లకూ శక్తిని సమానంగా పంపిణీ చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ సెటప్ వలన కారుకు వేగం, బలమైన పికప్, కంపోజ్డ్ హై-స్పీడ్ క్రూయిజింగ్ లాంటి అంశాలు లభిస్తాయి. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పాటు రిజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉండే అవకాశం ఉంది, దీని వలన ఇంధన సమర్థత మరింతగా మెరుగవుతుంది. కారులో మేక్‌ఓవర్‌ను ఇంటీరియర్‌లోనూ చూడవచ్చు.
లోపల ప్రయాణికుల అవసరమైన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో తాజాగా పరిచయమైన 11.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణ. ఇది గూగుల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా పనిచేస్తుంది. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవర్ అసిస్టెన్స్, ప్రీమియం మెటీరియల్స్‌తో ఈ కారు యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత స్మార్ట్‌గా, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది. కొత్తగా యాప్‌లు, నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

వోల్వో కొత్త ఫేస్‌లిఫ్ట్ XC60 మోడల్‌లో ఎలాంటి మేజర్ డిజైన్ ఛేంజ్‌లు లేకపోయినా, కొన్ని స్వల్ప మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రధానంగా, ఈ కారులో ముందుభాగంలో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, అప్‌డేట్ చేసిన అల్లాయ్ వీల్స్, రీ డిజైన్ చేసిన ఎయిర్ వెంట్స్, వెనుక భాగంలో నవీకరించిన టెయిల్ ల్యాంప్స్ మొదలగు అంశాలు కలిపి కారుకు ఒక కొత్త, ఆధునిక లుక్‌ను అందిస్తాయి.
ఇవి అన్ని కలిపి కారుకు ఇది అసలైన వోల్వో డిజైన్ భాషను కొనసాగిస్తూ, తక్కువ మార్పులతోనే మెచ్యూర్ లుకింగ్ SUV అనిపించేలా ఉంటుంది. ధర విషయంలోనూ, ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొంచెం ప్రీమియంగా ఉండబోతోంది. రూ.72.50 లక్షల నుండి రూ.74 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా వేయబడుతోంది. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న మోడల్ ధర రూ.70 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








