ఒక్కసారి కూర్చోండి.. మీకు బయటకే రావాలనిపించదు! భయంకరమైన లగ్జరీతో కొత్త వోల్వో కారు లాంచ్
భారతదేశంలో ఇటీవలి కాలంలో లగ్జరీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మారుతున్న ప్రజల అభిరుచుల ధోరణి కారణంగా మార్కెట్లోకి కొత్త కొత్త మోడళ్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తజాగా వోల్వో (Volvo) తన లగ్జరీ మిడ్-సైజ్ SUV అయిన ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ (XC60 Facelift) మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తాజా వెర్షన్ మరింత ప్రీమియం ఫీచర్లు, మైల్డ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, కొత్త డిజైన్ అప్‌డేట్‌లు, టెక్నాలజీ సౌకర్యాలతో వస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ SUV ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.71,90,000. పాత మోడల్‌తో పోలిస్తే ఇది సరికొత్తగా అనిపిస్తుంది. ఎక్స్‌టీయర్ పరంగా లేదా ఇంటీరియర్ పరంగా చూసిన కూడా ఇది అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.
వోల్వో XC60 Facelift కొత్త తరం ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఇంటీరియర్ లేఅవుట్, మరింత ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు, Google-బేస్డ్ కంట్రోల్ సిస్టమ్ వంటి న్యూ సాంకేతికతలతో మరింత టెక్-ఫ్రెండ్లీగా మారింది. అంతేకాదు, లోపల హై-క్వాలిటీ మెటీరియల్స్, ప్రీమియం కంఫర్ట్ ఫీచర్లు కూడా అందించబడ్డాయి. ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ యూనిట్‌తో వస్తోంది. ఇది 250hp పవర్, మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందించగలదు.

ఈ కారు ఇంజిన్ ఆటోమేటెడ్ 8-స్పీడ్ AWD గేర్‌బాక్స్‌తో 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. కారు లోపల ప్రయాణికులను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. 11.2-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇది కొత్త అనుభూతి ఇచ్చే విధంగా పనిచేస్తూ, మరింత రెస్పాన్స్ కలిగిన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇంతకుముందు మాదిరిగా కాకుండా, ఈసారి వోల్వో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ కాక్‌పిట్ ప్లాట్‌ఫామ్ ప్రాసెసర్‌ను వాడింది
స్నాప్‌డ్రాగన్ వలన గణనీయంగా మెరుగైన గ్రాఫిక్స్, వేగవంతమైన ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను సజావుగా ఓవర్-ది-ఎయిర్ (OTA) ద్వారా అందించగలదు. అలాగే, చార్‌కోల్ డ్యాష్‌బోర్డ్ ఆధునిక స్కాండినేవియన్ లగ్జరీని ప్రతిబింబిస్తుంది. నప్పా లెదర్ అప్హోల్స్టరీ, మెష్ డిజైన్‌తో కొత్తగా తీర్చిదిద్దిన స్పీకర్ గ్రిల్స్, మినిమలిస్ట్ ఇంటీరియర్ టచ్.. ఈ కారును ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని ఇచ్చే అంశాలు.

వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇప్పుడు లగ్జరీ SUV నియోగదారుల హాయిగా ప్రయాణించేందుకు అవసరమైన ప్రతి అంశాన్ని దీని కొత్త వెర్షన్‌లో సమర్ధవంతంగా సమపాళ్లలో అమర్చారు. మొదటగా, ఈ కారులో సైలెంట్ క్యాబిన్ స్పెషల్ హైలైట్‌గా నిలుస్తోంది. సౌండ్ అడ్డుకునే మెరుగైన ఇన్‌సులేషన్‌తో, మీరు సిటీ ట్రాఫిక్‌లోనో, హైవేపైనో ప్రయాణించినా మీకు ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది.
ఇంటీరియర్‌లో కొత్త కప్ హోల్డర్లు, వైరలెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, విశాలమైన లోడ్ కంపార్ట్‌మెంట్ వంటి స్మార్ట్ స్టోరేజ్ ఆప్షన్లు మరింత యుటిలిటీని అందిస్తాయి. లోపల ఇంకా మసాజింగ్ ఫంక్షన్‌తో వచ్చే ఫ్రంట్ సీట్లు, హీటెడ్, వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ADAS సూట్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి సదుపాయాలు ఈ కారులో అందించారు.

అదనంగా ఈ కారు సేఫ్టీ కోసం బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (BSIS), కొలిషన్ మిటిగేషన్ సపోర్ట్ (ముందు & వెనుక), క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ అండ్ బ్రేక్ సపోర్ట్, లేన్ కీపింగ్ ఎయిడ్, Volvo Cars App ద్వారా మీరు దూరం నుంచే మీ కారును లాక్ చేయడం, స్టార్ట్ చేయడం, కండిషన్ చెకప్ చేయడం లాంటి అనేక ఆపరేషన్స్ నిర్వహించవచ్చు.


Click it and Unblock the Notifications








