ఇది 34 లక్షల కుటుంబాల నమ్మకం.. బైక్ లాగా మైలేజ్ ఇస్తూ మధ్యతరగతి ప్రజలు మనసులు గెలిచిన కారు

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki WagonR) సరికొత్త మైలురాయిని చేరుకుంది. 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబాల ఫస్ట్ ఛాయిస్‎గా నిలిచిన ఈ టాల్-బాయ్ డిజైన్ కారు, దేశంలో ఏకంగా 34 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది.

ఈ అద్భుత విజయంతో పాటు, మారుతి సుజుకి దేశీయంగా మొత్తం 3 కోట్ల వాహనాల విక్రయాల చారిత్రక ఘనతను కూడా సాధించింది. ఒకప్పుడు కేవలం రూ.4.98 లక్షల ప్రారంభ ధరతో బడ్జెట్ సెగ్మెంట్ గేమ్‌ను మార్చేసిన వ్యాగన్‌ఆర్‌ ప్రయాణం, దాని మైలేజ్, సేఫ్టీ ఫీచర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

WagonR Achieves Milestone 34 Lakh Units Sold in India Fuels Maruti Suzuki s 3 Crore Sales Feat

మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ వ్యాగన్‌ఆర్, భారతీయ మార్కెట్‌లో 34 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని చేరుకుంది. 1999లో తొలిసారిగా మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి, వ్యాగన్‌ఆర్ దాని టాల్-బాయ్ డిజైన్, మంచి స్పేస్, నమ్మకమైన ఇంజిన్‌ కారణంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన కారుగా మారింది.

ఈ విజయం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ భారతదేశంలో మొత్తం 3 కోట్ల వాహనాల విక్రయాల చారిత్రక మైలురాయిని చేరుకోవడానికి కూడా దోహదపడింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాగన్‌ఆర్ మొత్తం విక్రయాలు కోటి యూనిట్లను దాటాయి.

వ్యాగన్‌ఆర్‌ మోడల్ తన 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కాలానుగుణంగా అనేక మార్పులు, అప్‌డేట్‌లను పొందింది. 2006లో పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ వెర్షన్ ప్రవేశపెట్టబడింది. 2010లో రెండవ జనరేషన్ మోడల్‌లో 1.0-లీటర్ ఇంజన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యాడ్ చేసింది.

WagonR Achieves Milestone 34 Lakh Units Sold in India Fuels Maruti Suzuki s 3 Crore Sales Feat

2019లో పూర్తిగా కొత్త హియర్‌టెక్ ప్లాట్‌ఫామ్(Heartect Platform) పై మూడవ జనరేషన్ వ్యాగన్‌ఆర్ లాంచ్ చేయబడింది. 2022లో దీనికి 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి స్మార్ట్ ఫీచర్లు అప్‌డేట్ చేయబడ్డాయి. వ్యాగన్‌ఆర్ ఇప్పుడు మెరుగైన మైలేజ్‌తో పాటు, భద్రత (Safety), టెక్నికల్ ఫీచర్లలో కూడా ముందంజలో ఉంది.

ప్రస్తుతం వ్యాగన్‌ఆర్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీ ఉన్నాయి. 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ సిస్టమ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. వ్యాగన్‌ఆర్ భారత మార్కెట్‌లో మైలేజ్ క్వీన్‎గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 25.19 కి.మీ./లీటర్ మైలేజ్ ఇస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 24.43 కి.మీ./లీటర్ వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. దీని సీఎన్‌జీ (CNG) వెర్షన్ (LXI, VXI ట్రిమ్స్) ఏకంగా కేజీకి 34.05 కి.మీ. చొప్పున అద్భుతమైన మైలేజ్‌ను ఇస్తుంది. రూ.4.98 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, టాటా టియాగో, రెనాల్ట్ క్విడ్ వంటి కార్లతో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ భారతదేశంలో 34 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది. 34 కి.మీ/కేజీ మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లతో ఈ కారు మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా నిలుస్తోంది. దీనిని ఎక్కువగా టీచర్లు, డాక్టర్లు ఇష్టపడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 6, 2025, 11:16 [IST]
English summary
Wagonr achieves milestone 34 lakh units sold in india fuels maruti suzukis 3 crore sales feat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+