మీ కల మంచి ఎస్‌యూవీ కొనడమేనా ? అయితే దానికి నెలవారీ EMI ఎంత? మీ జీతం ఎంత ఉండాలో తెలుసా ?
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన మన దేశంలో ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు (ఎస్‌యూవీ) మంచి డిమాండ్ ఉంది. గణాంకాల ప్రకారం.. భారతదేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు సగం ఎస్‌యూవీలే. అయితే, టాప్ 5 ఎస్‌యూవీల జాబితాలో పెద్దగా మార్పులు ఉండవు.
టాటా పంచ్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో ఎన్ గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. మీరు ఎవరైనా ఈ ఎస్‌యూవీలలో ఒకటి లోన్ తీసుకొని కొనాలనుకుంటే ఈఎంఐ ఎంత ఉంటుంది. దాని ఫీచర్లు ఏంటో చూద్దాం.

అయితే, భారతదేశంలోని టాప్ 5 ఎస్‌యూవీలను కొనడానికి అవసరమైన కనీస జీతం, నెలవారీ వాయిదా (EMI) వివరాలను ఈ కథనంలో తెలసుకుందాం. ముఖ్యంగా, ఇక్కడ 10శాతం ప్రామాణిక వడ్డీ రేటు, 5 సంవత్సరాల తిరిగి చెల్లించే కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకున్నాం. ఒక వ్యక్తి తన జీతంలో 25శాతం మాత్రమే EMI కోసం ఉపయోగిస్తాడన్న అంచనాతో ఈ జాబితాను రూపొందించాం.
టాటా పంచ్: టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి. 2024 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే. సేఫ్టీ, విశ్వసనీయత, మంచి ఫీచర్ల జాబితా, ఒకటి కంటే ఎక్కువ పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లు ఈ మైక్రో ఎస్‌యూవీని భారతీయులకు బాగా నచ్చే కారుగా నిలబెట్టాయి.

ప్రస్తుతం, పంచ్ ఐసిఇ వెర్షన్‌ను రోడ్డుపైకి తీసుకురావడానికి దాదాపు రూ. 7.26 లక్షల నుండి రూ. 12.15 లక్షల వరకు ఖర్చవుతుంది. కాబట్టి, బేస్ ప్యూర్ ఎమ్‌టికి నెలవారీ EMI రూ. 11,855నుండి టాప్-స్పెక్ క్రియేటివ్ + ఎస్ ఎఎమ్‌టి కామో ఎడిషన్‌కు రూ. 19,734 వరకు ఉంటుంది. కాబట్టి, నెలకు రూ. 49,000 నుండి రూ. 83,000 వరకు జీతం ఉన్నవారు ఈ కారును సులభంగా కొనుగోలు చేయవచ్చు.
టాటా నెక్సాన్: టాటా నెక్సాన్ దేశీయ వాహన తయారీదారు విడుదల చేసిన సబ్-4 మీటర్ ఎస్‌యూవీ. భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. నెక్సాన్ 2023లో చివరిసారిగా ఫేస్‌లిఫ్ట్‌కు గురైంది. పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ అనే నాలుగు పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లలో లభించే ఏకైక ఎస్‌యూవీ ఇది. ఇది మాత్రమే కాదు, 5-స్టార్ సేఫ్టీ, లేటెస్ట్ ఫీచర్స్ నెక్సాన్‌లోని ఇతర ఆకర్షణీయ అంశాలు.

ప్రస్తుతం, నెక్సాన్ ఆన్-రోడ్ ధర రూ. 9.30 లక్షల నుండి రూ. 18.60 లక్షల వరకు ఉంది. నెక్సాన్ బేస్ స్మార్ట్ ఎమ్‌టికి నెలవారీ EMI రూ. 15,297 నుండి రేంజ్-టాపింగ్ వేరియంట్ ఫియర్‌లెస్ + పిఎస్ డిటి డీజిల్ ఎఎమ్‌టికి రూ. 29,448 వరకు ఉంటుంది. ఈ నెలవారీ వాయిదాలను సులభంగా చెల్లించడానికి కనీస జీతం రూ. 64,000 నుండి రూ. 1.28 లక్షల వరకు ఉండాలి.
మారుతి బ్రెజా: నెక్సాన్‌కు ప్రత్యర్థి అయిన మారుతి బ్రెజా కూడా బెస్ట్ సెల్లర్ కార్ మోడల్. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ఇది క్రమం తప్పకుండా టాప్ 10లో ఉంటుంది. ఆధునిక ఫీచర్లతో కూడిన ఈ కారు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడా లభిస్తుంది. కొన్ని రోజుల క్రితమే కంపెనీ ఈ కారుకు 6 ఎయిర్‌బ్యాగ్‌లను జోడించి అప్‌డేట్ చేసింది.

ప్రస్తుతం మారుతి బ్రెజా ధర రూ. 10.88 లక్షల నుండి రూ. 17.73 లక్షల వరకు ఉంది. నెలవారీ EMIని పరిశీలిస్తే, బ్రెజా LXI వేరియంట్‌కు రూ. 16,617 నుండి టాప్-స్పెక్ ZXi+ AT డ్యూయల్ టోన్‌కు రూ. 27,038 వరకు ఉంటుంది. మారుతి బ్రెజాను సొంతం చేసుకోవడానికి కనీస నెలవారీ జీతం రూ. 74,000 నుండి రూ. 1.21 లక్షల వరకు ఉండాలి.
హ్యుందాయ్ క్రెటా: 2025 మార్చి నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు హ్యుందాయ్ క్రెటా. 18,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో ఈ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ మారుతి చిన్న కార్లను కూడా వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. బోల్డ్ లుక్‌తో పాటు ఒకటి కంటే ఎక్కువ పవర్‌ట్రెయిన్, గేర్‌బాక్స్ కాంబినేషన్‌లు క్రెటాను ఎస్‌యూవీ వినియోగదారులలో బాగా పాపులారిటీ తీసుకొచ్చాయి. గతేడాది జనవరిలో క్రెటా ఫేస్‌లిఫ్ట్‌తో వచ్చింది.

ప్రస్తుతం క్రెటా ఆన్-రోడ్ ధర రూ. 13.16లక్షల నుండి రూ. 24.88లక్షల వరకు ఉంది. క్రెటా బేస్ ఇ పెట్రోల్ ఎమ్‌టికి నెలవారీ EMI రూ. 21,243 వరకు, ఫుల్లీ లోడెడ్ SX (O) డ్యూయల్ టోన్ డీజిల్ ఎటి నైట్ ఎడిషన్‌కు రూ. 39,196 వరకు ఉంటుంది. ఈ కారు EMIని సులభంగా చెల్లించడానికి కనీసం రూ. 90,000 నుండి రూ. 1.70లక్షల వరకు నెలవారీ జీతం ఉండాలి.
మహీంద్రా స్కార్పియో N: మహీంద్రా ప్రసిద్ధ ఎస్‌యూవీ స్కార్పియో N దాని బోల్డర్ డిజైన్, సేఫ్టీకి పేరుగాంచింది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ఆన్-రోడ్ ధర రూ. 16.74లక్షల నుండి రూ. 30.37లక్షల వరకు ఉంది. స్కార్పియో N ఎంట్రీ-లెవెల్ Z2 7-సీటర్ పెట్రోల్ ఎమ్‌టికి నెలవారీ EMI రూ. 26,755 నుండి ఫుల్లీ లోడెడ్ Z8 L 4x4 డీజిల్ ఎటి కార్బన్ ఎడిషన్‌కు రూ. 47,597 వరకు ఉంటుంది.

కనీసం రూ. 1.14 లక్షల నుండి రూ. 2.02 లక్షల వరకు నెలవారీ జీతం ఉన్నవారు ఈ కారును నిస్సందేహంగా కొనుగోలు చేయవచ్చు. ఈ గణాంకాలు 10% ప్రామాణిక వడ్డీ రేటు, 5 సంవత్సరాల తిరిగి చెల్లించే కాలవ్యవధితో తయారు చేయబడ్డాయి. ఒక వ్యక్తి తన జీతంలో 25% మాత్రమే EMI కోసం ఉపయోగిస్తాడని కూడా పరిగణనలోకి తీసుకున్నాము.
ఇక్కడ పేర్కొన్న ఎస్‌యూవీల ఆన్-రోడ్ ధరలు వివిధ నగరాలను బట్టి మారవచ్చు కాబట్టి గణాంకాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అయినప్పటికీ, ఇది పేర్కొన్న జీతం పరిధిని పెద్దగా ప్రభావితం చేయదు. కాబట్టి, కొత్తగా లోన్‌లో కారు కొనాలనుకుంటున్న ఈ సమాచారం బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








