కార్లలో ADAS ఫీచర్లకు భారీ డిమాండ్.. ఎందుకు ప్రతి కార్‌లో ఇది ఉండాలి? అది ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలు

రోడ్లపై కార్లను డైవింగ్ చేసే సమయంలో సురక్షితంగా గమ్యస్థానానికి చేరడంలో కీలక పాత్ర పోషిస్తుంది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS). ఇది ఒక ఆధునిక టెక్నాలజీ. ఇది వాహనాన్ని నడిపే సమయంలో డ్రైవర్‌కు సాయం చేసే ఆధునిక సాంకేతిక వ్యవస్థ. సులభంగా చెప్పాలంటే, ఇది డ్రైవర్‌కు, కళ్లు, చెవుల మాదిరిగా అదనంగా ఉపయోగపడుతుంది. రోడ్డు పరిస్థితులు, వాహనాల దూరం, ప్రమాద అవకాశాలు వంటి అంశాలను ముందుగానే గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరించడం లేదా కొన్ని సందర్భాల్లో వాహన నియంత్రణను స్వయంగా చేపట్టడం దీని ముఖ్య లక్ష్యం. దీని కారణంగా రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గుతున్నాయి. కారు లోపల కూర్చున్న వారికి ఇది ఒక భరోసాను ఇస్తుంది. ప్రస్తుతం ADAS ఫీచర్లకు అనుగుణంగా చాలా కార్లు అప్‌డేట్ అవుతున్నాయి.

ADAS ఎలా పనిచేస్తుంది?
ADAS వ్యవస్థలో కెమేరాలు, రాడార్లు, అల్ట్రాసోనిక్ సెన్సర్లు, లైడార్ (LiDAR) వంటి పరికరాలు ఉంటాయి. ఈ పరికరాలు వాహనం చుట్టుపక్కల పరిస్థితులను నిరంతరం స్కాన్ చేస్తూ డేటాను సేకరిస్తాయి. కెమేరాలు- లేన్ మార్కులు, సిగ్నల్ లైట్లు, వాహనాలు, పాదచారులు వంటి అంశాలను గుర్తిస్తాయి. రాడార్ సెన్సర్లు - ముందు, వెనుక వాహనాల మధ్య దూరం, వేగాన్ని కొలుస్తాయి. లైడార్ - లేజర్ బీమ్‌ల సాయంతో పరిసరాల త్రిమితీయ దృశ్యాన్ని రూపొందిస్తుంది.

What Is Adas And How It Works in Cars More Details Inside

చివరగా అల్ట్రాసోనిక్ సెన్సర్లు - పార్కింగ్ లేదా తక్కువ వేగంలో కదిలే సమయంలో సమీప అడ్డంకులను గుర్తిస్తాయి. ఈ సెన్సర్ల ద్వారా వచ్చిన డేటాను ECU (Electronic Control Unit) ప్రాసెస్ చేసి, డ్రైవర్‌కు హెచ్చరికలు పంపిస్తుంది లేదా అవసరమైతే బ్రేక్, యాక్సిలరేటర్, స్టీరింగ్ వంటి నియంత్రణలను తాత్కాలికంగా స్వయంగా నిర్వహిస్తుంది. దీంతో డ్రైవర్‌కు డ్రైవింగ్‌లో యాక్సిడెంట్ లాంటివి కాకుండా సాయం చేస్తుంది.

ADASలోని ముఖ్య ఫీచర్లు:
లేన్ కీప్ అసిస్ట్ (LKA), ఇది వాహనం లేన్ దాటి వెళ్లబోతే హెచ్చరిస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC), ఇది ముందున్న వాహన దూరాన్ని బట్టి వాహనం వేగాన్ని స్వయంగా నియంత్రిస్తుంది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), ఇది ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నప్పుడు స్వయంగా బ్రేక్ వేస్తుంది. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఇది డ్రైవర్‌కు కనిపించని ప్రదేశాల్లో వాహనాలు ఉన్నప్పుడు హెచ్చరిక ఇస్తుంది.

What Is Adas And How It Works in Cars More Details Inside

చివరగా ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, రోడ్డు సిగ్నల్ బోర్డులను కెమేరాలు గుర్తించి డ్రైవర్‌కు సమాచారం ఇస్తాయి.ఇవన్నీ కూడా డ్రైవింగ్ అనుభవాన్ని మరింతగా కంఫర్ట్‌గా మార్చేస్తాయి. లాంగ్ డ్రైవ్, హైవేలపై వెళ్లే సమయంలో కార్ ఆటోమెటిక్ గా డ్రైవింగ్ చేసుకునేందుకు ఈ ముఖ్య ఫీచర్లు అన్నీ కూడా ADAS టెక్నాలజీలో భాగంగా ఉంటు ఈజీ , అలాగే నమ్మకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ప్రస్తుతం ADAS ఎక్కువగా లగ్జరీ కార్లలో మాత్రమే ఉన్నా, భవిష్యత్తులో ఇది ప్రతీ కారులో ఒక ప్రామాణిక ఫీచర్‌గా మారబోతోంది. భారత ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో, అనేక కంపెనీలు తమ కార్లలో ఈ టెక్నాలజీని అందించడం ప్రారంభించాయి. భారత రోడ్ల భద్రత పరంగా ఇది పెద్ద ముందడుగు అని చెప్పాలి. డ్రైవింగ్ సమయంలో జరిగే తప్పిదాలను తగ్గించడంలో, ప్రమాదాలను నివారించడంలో ADAS కీలక పాత్ర పోషిస్తోంది.

What Is Adas And How It Works in Cars More Details Inside

భారతదేశంలో కూడా మారుతి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా వంటి కంపెనీలు ADAS టెక్నాలజీని తమ కొత్త మోడళ్లలో ప్రవేశపెడుతున్నాయి. ADAS వలన రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా భారత రోడ్ల పరిస్థితులు, ట్రాఫిక్, డ్రైవర్ అలసట వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ఇది నిజంగా ప్రాణరక్షక సాంకేతికత.

More from DriveSpark

Article Published On: Wednesday, October 22, 2025, 12:39 [IST]
English summary
What is adas and how it works in cars more details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+